Khaleja : మహేష్ బాబు(Superstar Mahesh Babu) అభిమానులతో పాటు ఇతర హీరోల అభిమానులు కూడా ఎంతో ఇష్టపడే సినిమాలలో ఒకటి ‘ఖలేజా'(Khaleja Movie). త్రివిక్రమ్ శ్రీనివాస్(Trivikram Srinivas) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా ఆరోజుల్లో కనీవినీ ఎరుగని రేంజ్ భారీ అంచనాల నడుమ విడుదలైంది. అంతటి భారీ అంచనాల నడుమ ఈ సినిమా విడుదల కావడంతో అభిమానుల అంచనాలను అప్పట్లో అందుకోవడంలో విఫలం అయ్యింది. ఫలితంగా ఈ చిత్రం అప్పట్లో ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. అప్పట్లో ఫ్లాప్ అయితే అయ్యింది కానీ, ఇప్పటి జనరేషన్ ఆడియన్స్ కి మాత్రం ఈ సినిమా అంటే పిచ్చి ఇష్టం అని చెప్పొచ్చు. మహేష్ కెరీర్ లో, లేదా త్రివిక్రమ్ శ్రీనివాస్ కెరీర్లో ది బెస్ట్ చిత్రం ఏమిటి అని ఆడియన్స్ ని అడిగితే అత్యధిక శాతం మంది ఖలేజా చిత్రం పేరు చెప్తారు. నేటి తరం ఆడియన్స్ కి అంతలా కనెక్ట్ అయ్యింది ఈ చిత్రం.
Also Read : షాక్ అయ్యేలాగా మారిపోయిన ఖలేజా సినిమాలో దిలావర్ సింగ్ భార్య…
అయితే ఈ సినిమాపై కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్(Nag aswin) ఒక ఇంటర్వ్యూ లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసాడు. యాంకర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీరు ఒక సినిమాని చూసినప్పుడు..అబ్బా ఈ చిత్రం నేను దర్శకత్వం వహించి ఉండుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా?’ అని అడగ్గా, దానికి నాగ్ అశ్విన్ సమాధానం చెప్తూ ‘దర్శకత్వం వహించాలని ఎప్పుడూ అనిపించలేదు కానీ, ఎడిటింగ్ చేయాలనీ మాత్రం అనిపించింది. నాకు మహేష్ సినిమాలలో బాగా నచ్చిన చిత్రాలలో ఒకటి ఖలేజా. ఈ సినిమాకి ఎడిటింగ్ నేను అయితే అద్భుతంగా చేసేవాడిని, ఫలితంగా కూడా ఆ రేంజ్ లోనే వచ్చి ఉండేది అని నాకు అనిపించింది. అదే విధంగా విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రం చూసినప్పుడు కూడా ఎడిటింగ్ నేను చేసుంటే బాగుండేది అని అనిపించింది’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ అశ్విన్. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ అప్పట్లో నాకు ఇన్సెప్షన్ కాన్సెప్ట్ తో ఒక సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది. అప్పట్లో ఇన్సెప్షన్ సినిమా తీస్తున్నారనే విషయం కూడా నాకు తెలియదు. నాకొచ్చిన ఆలోచనే హాలీవుడ్ మేకర్స్ కి కూడా వచ్చినట్టు. స్క్రిప్ట్ వర్క్ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత వారం రోజులకు ‘ఇన్సెప్షన్’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ వచ్చింది. దానిని చూసి నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. నేను చేయాలనుకున్న కాన్సెప్ట్ మరొకరు చేసారు అనే నిజాన్ని జీర్ణించుకోలేకపోయాను’ అంటూ చెప్పుకొచ్చాడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ ఆలోచనలు చాలా బిన్నంగా ఉంటాయి. ఆయన తీసిన సినిమాలు కేవలం మూడే. ఆ మూడు సినిమాల జానర్స్ చాలా ప్రత్యేకమైనవి, రీసెంట్ గా ‘కల్కి’ చిత్రం తో వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టిన నాగ అశ్విన్ త్వరలోనే సీక్వెల్ తో మన ముందుకు రాబోతున్నాడు.
Also Read : సినిమాలో డి గ్లామర్ లుక్.. బయట మాత్రం అందాల అరాచకం…