Homeక్రీడలుక్రికెట్‌Hardik Pandya: ముంబై మునిగి పోతోంది.. హార్థిక్ పాండ్యా.. గర్ల్ ఫ్రెండ్ మాయ నుంచి బయటికి...

Hardik Pandya: ముంబై మునిగి పోతోంది.. హార్థిక్ పాండ్యా.. గర్ల్ ఫ్రెండ్ మాయ నుంచి బయటికి రావయ్యా..

Hardik Pandya: ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ నేతృత్వంలో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీలు అందుకున్న చెన్నై జట్టుతో సమానంగా కొనసాగుతోంది ముంబై ఇండియన్స్. ముంబై జట్టులో అద్భుతమైన ప్లేయర్లు అప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే అప్పట్లో ప్లేయర్లలో కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు అది కనిపించడం లేదు. ప్రస్తుత ముంబై జట్టుకు నాయకుడిగా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. 2024లో అతడు […]

Hardik Pandya: ఐపీఎల్ లో ఐదుసార్లు విజేతగా నిలిచింది ముంబై ఇండియన్స్. రోహిత్ శర్మ నేతృత్వంలో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు ట్రోఫీలు అందుకున్న చెన్నై జట్టుతో సమానంగా కొనసాగుతోంది ముంబై ఇండియన్స్. ముంబై జట్టులో అద్భుతమైన ప్లేయర్లు అప్పుడు ఉన్నారు. ఇప్పుడు కూడా ఉన్నారు. కాకపోతే అప్పట్లో ప్లేయర్లలో కమిట్మెంట్ ఉంది. ఇప్పుడు అది కనిపించడం లేదు.

ప్రస్తుత ముంబై జట్టుకు నాయకుడిగా హార్దిక్ పాండ్యా కొనసాగుతున్నాడు. 2024లో అతడు ముంబై జట్టు సారధిగా వచ్చాడు. అంతకుముందు అతడు గుజరాత్ జట్టుకు ట్రోఫీ అందించాడు. తొలి సీజన్లోనే గుజరాత్ జట్టును విజేతగా నిలిపి సరికొత్త చరిత్ర సృష్టించాడు. రెండవ సీజన్లో రన్నర్ అప్ గా నిలబెట్టాడు. అతడి స్థాయిని చూసిన ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్ గా నియమించింది.

2024లో ముంబై జట్టు సారధిగా వచ్చిన హార్దిక్ పాండ్యా.. అంత గొప్పగా జట్టు మీద తన ప్రభావాన్ని చూపించలేకపోయాడు. గుజరాత్ జట్టు మాదిరిగా నిలపలేకపోయాడు. పైగా తన ఆట తీరు కూడా అంతంతమాత్రంగానే ఉంది. 2024లో ముంబై జట్టు చివరి స్థానంలో నిలిచింది. 2025లో టాప్ ఫోర్ లో స్థిరపడింది. ముంబై జట్టు ఈ సీజన్లో మాత్రం దారుణమైన ఆట తీరు కొనసాగిస్తోంది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్నప్పటికీ ముంబై జట్టు ఏమాత్రం ఆకట్టుకోలేకపోతోంది.

ముంబై జట్టు ఓటములకు ప్రధాన కారణం హార్దిక్ పాండ్యా అని అభిమానులు విమర్శిస్తున్నారు. అతడి కెప్టెన్సీ లోపం వల్లే ముంబై జట్టు ఇలా ఓటములు ఎదుర్కోవాల్సి వస్తుందని వారు పేకానిస్తున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మీద ముంబై ఇండియన్స్ ఓడిపోవడానికి వారు తట్టుకోలేకపోతున్నారు. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా 23 బంతులు ఎదుర్కొని కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.. అతడు దూకుడుగా ఆడి ఉంటే ముంబై జట్టు స్కోర్ వేరే విధంగా ఉండేదని అభిమానులు అంటున్నారు. స్నేహితురాలు మహీక మాయలో పడి హార్థిక్ పాండ్యా ఆటను మొత్తం పక్కన పెట్టాడని అభిమానులు విమర్శిస్తున్నారు.. అతడిని కొద్దిరోజుల పాటు ఆటకు దూరంగా పెట్టాలని.. అప్పుడే ఆ లోపాలను సవరించుకొని బయటికి వస్తాడని చెబుతున్నారు..

హార్థిక్ పాండ్యా జట్టు ప్లేయర్లతో సరైన విధానంలో ఉండడం లేదని.. సూర్య కుమార్, బుమ్రా, బౌల్ట్ వంటి వారితో పాండ్యాకు సమన్వయం లేదని.. అందువల్లేవారు సరిగ్గా ఆడ లేకపోతున్నారని అభిమానులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా హార్దిక్ పాండ్యా తన ఆట తీరు పూర్తిగా మార్చుకోవాలని సూచిస్తున్నారు. ఇన్ని వ
ఓటములు ఎదుర్కొన్న తర్వాత కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే అంతకుమించిన దరిద్రం మరొకటి ఉండదని ముంబై అభిమానులు పేర్కొంటున్నారు. సోషల్ మీడియాలో హార్థిక్ పాండ్యాను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా హార్దిక్ పాండ్యా మారుతాడా.. ముంబై జట్టును గెలుపు బాట పట్టిస్తాడా.. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం లభించాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper