PBKS Vs KKR IPL 2025: 112 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఈజీగానే గెలుస్తుందనిపించింది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో కోల్ కతా ఇదేతీరుగా ప్రదర్శన చూపింది. అయితే పంజాబ్ జట్టు మీద మాత్రం కోల్ కతా పప్పులు ఉడకలేదు. మొత్తంగా 112 పరుగుల విజయ లక్ష్యంతో రంగంలోకి దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కు ఆదిలోనే హంసపాదు లాగా.. తొలి ఓవర్ చివరి బంతికి ప్రమాదకరమైన సునీల్ నరైన్(5) మార్కో జాన్సన్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత తర్వాతి ఓవర్ రెండవ బంతికి క్వింటన్ డికాక్ (2) బార్ట్ లెట్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. కేవలం ఏడు పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది కోల్ కతా. ఈ దశలో కెప్టెన్ రహానే (17), సూర్యవంశీ (37) మూడో వికెట్ కు 55 పరుగులు జోడించారు. అయితే ఎప్పుడైతే యజువేంద్ర చాహల్ రంగంలోకి దిగాడో.. అప్పుడే కోల్ కతా కు కౌంట్ డౌన్ మొదలైంది. చాహల్ బౌలింగ్లో రహానే, సూర్యవంశీ అవుట్ అయ్యారు. ఆండ్రి రస్సెల్ (17) దూకుడుగా ఆడుతున్న సమయంలో.. అతడికి జాన్సన్ కళ్లెం వేశాడు. ఆ తర్వాత వచ్చిన రమణ్ దీప్ సింగ్(0) గోల్డెన్ డక్ అవుట్ అయ్యాడు. అనంతరం వచ్చిన హర్షిత్ రాణా(3), వైభవ్ అరోరా (0) అవుట్ కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఇన్నింగ్స్ 15.1 ఓవర్లలో 95 పరుగుల వద్ద ముగిసింది. పంజాబ్ జట్టులో చాహల్ నాలుగు వికెట్లు పడగొట్టి కోల్ కతా పతనాన్ని శాసించాడు. జాన్సన్ మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. బ్రాట్ లెట్, అర్ష్ దీప్ సింగ్, మాక్స్ వెల్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
Also Read: కోట్లకు కోట్లు పెట్టి కొంటే.. ప్రీతిజింటాను ఎందుకిలా ఏడిపిస్తున్నార్రా?
పంజాబ్ బ్యాటింగ్ పేలవం
అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడ లేకపోయింది. సొంతమైదానంలో 15.1 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌట్ అయింది. పంజాబ్ జట్టులో ప్రభ్ సిమ్రాన్ సింగ్ (30), ప్రియాన్ష్ ఆర్య(22) టాప్ స్కోరర్ లు గా నిలిచారు. చివర్లో శశాంక్ సింగ్ (18) దూకుడుగా ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు లో హర్షిత్ రానా మూడు వికెట్లు పడగొట్టాడు.. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి చెరి రెండు వికెట్లు సాధించారు. వైభవ్ అరోరా, నోర్ట్జే చెరో వికెట్ పడగొట్టారు.. ఐపీఎల్ 18 ఎడిషన్ లో రెండు జట్లు ఆల్ ఔట్ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు రెండు జట్లు చేసిన పరుగులు 206 రన్స్ మాత్రమే కావడం విశేషం. అయితే పంజాబ్ జట్టు విధించిన 112 పరుగులను కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతూ పాడుతూ కొట్టేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ పంజాబ్ జట్టు బౌలర్లు సొంతమైదానంపై దుమ్మురేపారు. ముఖ్యంగా చాహల్ బౌలింగ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఆటగాళ్లు ఆడేందుకు ఇబ్బంది పడ్డారు. ఇక సొంతమైదానంలో పంజాబ్ జట్టు ఫీల్డర్లు కూడా అద్భుతంగా ఫీల్డింగ్ చేశారు. కనీసం కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆటగాళ్లకు సింగిల్స్ తీసే అవకాశాన్ని కూడా ఇవ్వలేదు. మొత్తంగా మూడో వికెట్ మినహా… మిగతా అన్ని వికెట్లపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు బౌలర్లు పట్టు సాధించడంతో విజయం సాధ్యమైంది..
Also Read: శ్రేయస్ అయ్యర్ ను షారుక్ ఎందుకు వదిలేశాడో.. ప్రీతి జింటాకు తెలిసే ఉంటుంది..
ABSOLUTE CINEMA IN MULLANPUR.
– Shreyas Iyer and his boys did the impossible by defending 111. pic.twitter.com/naqVHyAxll
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 15, 2025