IPL Delhi And Kolkata Teams Changes: వచ్చే సీజన్ కు సంబంధించి ఐపీఎల్ ఇంకా మొదలు కాలేదు. మినీ వేలం కూడా ప్రారంభం కాలేదు. దానికి ఇంకా చాలా సమయం ఉంది.. అయినప్పటికీ ఇప్పటినుంచి కొన్ని జట్లు ఐపిఎల్ లో సత్తా చాటడానికి కసరత్తు మొదలు పెట్టాయి. ఈ జాబితాలో కోల్ కతా, ఢిల్లీ జట్లు ముందున్నాయి. 2024 సీజన్లో కోల్ కతా జట్టు విజేతగా నిలిచింది. ఢిల్లీ జట్టు ఇంతవరకు ఐపీఎల్ ట్రోఫీని అందుకోలేకపోయింది. ఈ రెండు జట్లకు బలమైన ఆర్థిక నేపథ్యం ఉంది. దీనికి తోడు గత వైభవాన్ని అందుకోవాలని కోల్ కతా జట్టు భావిస్తోంది. సరికొత్త చరిత్ర సృష్టించాలని ఢిల్లీ జట్టు యోచిస్తోంది.
ఢిల్లీ జట్టు యాజమాన్యం ఈసారి తన సారధిని మార్చే అవకాశం కనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ను బయటికి పంపించడం ఖాయంగా కనిపిస్తున్న క్రమంలో అతడిని తన జట్టుకు నాయకుడిగా నియమించేందుకు ఢిల్లీ యాజమాన్యం కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఢిల్లీ జట్టుకు అక్షర్ నాయకత్వం వహిస్తున్నాడు. అతని ఆధ్వర్యంలో ఢిల్లీ జట్టు ఇటీవల సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే అతడి స్థానంలో వచ్చే సీజన్ కు సంజు కు ఆ బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. సంజు కు బదులుగా ఏ ఆటగాడిని ట్రేడ్ చేయాలనే విషయంపై ఢిల్లీ జట్టు యాజమాన్యం ఆలోచనలు చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.. సంజు రాజస్థాన్ జట్టును 2024 లో ఒక స్థాయి వరకు తీసుకొచ్చాడు. 2025 లో జట్టులో అంతర్గత రాజకీయాలు పెరిగిపోయాయి. దీంతో సంజు మధ్యలో కొన్ని మ్యాచ్లకు దూరంగా ఉన్నాడు.. కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా వెళ్లిపోవడంతో.. సంజు మేనేజ్మెంట్ తీరు పట్ల ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఐతే ఇది ఇక్కడిదాకా దారి తీస్తుందని ఎవరూ ఊహించలేదు.
కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం కూడా కేఎల్ రాహుల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 2025 సీజన్లో ఏ అతడు ఢిల్లీ జట్టుకు అద్భుతమైన విజయాలు అందించాడు. ముఖ్యంగా బెంగళూరులో బెంగళూరు జట్టుపై అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. అంతేకాదు తన జట్టును గెలిపించిన తర్వాత మైదానంలో గిరి గీసి సవాళ్లు విసిరాడు. అప్పట్లో అతి పెద్ద సంచలనంగా మారిపోయింది. అప్పటినుంచి కోల్ కతా యాజమాన్యం రాహుల్ మీద ప్రత్యేకంగా దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాహుల్ ను తమ లైన్ లోకి తెచ్చుకోవాలని కోల్ కతా యాజమాన్యం భావిస్తోంది. కోల్ కతా జట్టును 2025 సీజన్లో అజింక్యా రహానే అనుకున్న స్థాయిలో ముందుకు నడిపించలేకపోయాడు. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో కోల్ కతా ఆడలేకపోయింది. రహానే కూడా అనుకున్న స్థాయిలో ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఇవన్నీ కూడా కోల్ కతా యాజమాన్యాన్ని ఆలోచనలో పడేసినట్టు తెలుస్తోంది. అందువల్లే కేల్ రాహుల్ కు కెప్టెన్సీ అప్పగిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీనికి కేఎల్ రాహుల్ ఎలా స్పందిస్తాడో చూడాల్సి ఉంది. మరోవైపు తన బ్యాటింగ్ మీద దృష్టి సారించాలి కాబట్టి.. గతంలోనే ఢిల్లీ యాజమాన్యం ఇచ్చిన ఆఫర్ ను అతడు తిరస్కరించాడు. మరి ఇప్పుడు ఏం చేస్తాడో చూడాల్సి ఉంది.