Homeక్రీడలుక్రికెట్‌Yuzvendra Chahal : పక్కన ముగ్గురమ్మాయిలు.. నీ పని బాగుంది చాహల్!

Yuzvendra Chahal : పక్కన ముగ్గురమ్మాయిలు.. నీ పని బాగుంది చాహల్!

Yuzvendra Chahal : టీమిండియాలో ఒకప్పుడు యజువేంద్ర చాహల్ ఆడేవాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకునేవాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా అతడు రికార్డు సృష్టించాడు. టీమిండియా లో ఆడుతున్నప్పుడు జట్టు సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించేవాడు. ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అప్పుడప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తున్నాడు. మైదానంలో ప్రదర్శనతో పాటు.. […]

Yuzvendra Chahal : టీమిండియాలో ఒకప్పుడు యజువేంద్ర చాహల్ ఆడేవాడు. తనకు మాత్రమే సాధ్యమైన స్పిన్ బౌలింగ్ తో ఆకట్టుకునేవాడు. ఆ తర్వాత ఐపీఎల్ లో హైయెస్ట్ వికెట్ టేకర్ గా అతడు రికార్డు సృష్టించాడు. టీమిండియా లో ఆడుతున్నప్పుడు జట్టు సాధించిన విజయాలలో ముఖ్య పాత్ర పోషించేవాడు. ఆ తర్వాత అతడు ఫామ్ కోల్పోవడంతో జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం అతడు ఐపీఎల్ మాత్రమే ఆడుతున్నాడు. అప్పుడప్పుడు డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపిస్తున్నాడు.

మైదానంలో ప్రదర్శనతో పాటు.. మైదానం వెలుపల వ్యవహారాలతో చాహల్ నిత్యం వార్తల్లో ఉంటాడు. గతంలో అతడు బాలీవుడ్ చిత్ర పరిశ్రమతో సంబంధం ఉన్న ధనశ్రీని వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెతో విడాకులు తీసుకున్నాడు. గత ఏడాది ముంబై కోర్టు ధనశ్రీ, చాహల్ కు విడాకులు మంజూరు చేసింది. ఈ సమయంలో చాహల్ భారీగా భరణం చెల్లించినట్లు వార్తలు వచ్చాయి. దానిపై అటు చాహల్, ఇటు ధనశ్రీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

ధనశ్రీ తో విడాకులు తీసుకున్న తర్వాత చాహల్ ఆర్జె మహ్వేష్ తో డేటింగ్ మొదలుపెట్టాడు.. వీరిద్దరు కూడా సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు ఫాలో అవ్వడం ప్రారంభించారు. ఇద్దరు చాలా ప్రాంతాలు తిరిగారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరిని ఒకరు అన్ ఫాలో చేసుకున్నారు. ఈ వ్యవహారం జరుగుతుండగానే ధనశ్రీ చాహల్ గురించి ఏదో ఒక విషయం బయట పెట్టేది. కొన్ని సందర్భాల్లో పరోక్షంగా.. మరికొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా వ్యాఖ్యలు చేసేది. తద్వారా చాహల్ గురించి ఏదో ఒక చర్చ మీడియాలో జరుగుతూ ఉండేది.

అయితే ఇప్పుడు చాహల్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో కనిపిస్తోంది. ఆ ఫోటోలో చాహల్ ముగ్గురు అమ్మాయిలతో కనిపిస్తున్నాడు. ఆ ముగ్గురు అమ్మాయిలు కూడా అత్యంత అందగత్తెలు. ఇటీవల బాలీవుడ్లో విడుదలైన ఓ సినిమా పోస్టర్ కు జిరాక్స్ లాగా ఆ పోస్టర్ ఉంది. అయితే ఇదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించినట్లు తెలుస్తోంది. చాహల్ ప్రస్తుతం వెకేషన్ లో ఉన్నాడు. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాడు. అయితే చాహల్ గురించి ఇటీవల కాలంలో మీడియాలో భారీగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంతమంది ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి ఈ విధంగా పోస్టర్ రూపొందించారని తెలుస్తోంది. ఆట ద్వారా మాత్రమే కాకుండా.. అటు విడాకులు.. ఇటు సంబంధాలతో చాహల్ నిత్యం వార్తల్లో ఉంటున్నాడు. ఈ ప్రకారం చూసుకుంటే చాహల్ మంచి ఆటగాడే.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఆ ఫోటోలో చాహల్ తో పాటు ధనశ్రీ, మహ్వేష్, శఫాలీ బగ్గా కనిపిస్తున్నారు. ప్రస్తుతం బగ్గాతో చాహల్ డేటింగ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అందువల్లే కొంతమంది ఔత్సాహికులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఈ చిత్రాన్ని రూపొందించారని సమాచారం. మరి దీనిపై ధనశ్రీ, మహ్వేష్, శఫాలీ బగ్గా ఎలా స్పందిస్తారో చూడాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper