PAK vs SL: విజయం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి మానసిక ధైర్యాన్నిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా భవిష్యత్తు కాలంలో సాధించబోయే లక్ష్యాల మీద ఒక స్పష్టమైన అవగాహన కల్పిస్తుంది. ప్రపంచ క్రికెట్లో మిగతా జట్లు పై సిద్ధాంతాలను పాటిస్తాయి. కానీ, పాకిస్తాన్ అలా కాదు. వీటన్నిటిని పాటిస్తే అది పాకిస్తాన్ ఎందుకు అవుతుంది..
పాకిస్తాన్ క్రికెట్లో నిత్యం చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏ ప్లేయర్ ఎప్పుడు ఎలా ఆడతాడో తెలియదు. ఏ ఆటగాడు ఎలా స్పందిస్తాడో తెలియదు. డ్రెస్సింగ్ రూమ్ లలో కొట్టుకుంటారు. మైదానంలో ఫీల్డింగ్ చేసే విషయంలో గొడవ పడుతుంటారు. కొన్ని సందర్భాలలో గల్లి స్థాయి ఆట తీరు ప్రదర్శిస్తుంటారు. అసలు ఇలా ఎందుకు ఆడుతున్నారు.. ఎందుకు అలాంటి ఆట అలవాటు చేసుకున్నారు. సమర్థవంతమైన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఇంత చెత్తగా ఎందుకు ఆడుతున్నారు.. ఈ ప్రశ్నలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వద్ద సమాధానం ఉండదు. సమాధానం తెలిసినా చెప్పే స్థాయి పాకిస్తాన్ ప్లేయర్లకు ఉండదు.
పాకిస్తాన్ జట్టు ప్రస్తుతం సొంత మైదానం వేదికగా శ్రీలంక జట్టుతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లు గెలిచింది. సిరీస్ కూడా దక్కించుకుంది. వాస్తవానికి ఈ ఆట తీరును ఇలాగే కొనసాగించి ఉంటే బాగుండేది. కానీ అలా కొనసాగిస్తే అది పాకిస్తాన్ జట్టు ఎందుకు అవుతుంది. మంగళవారం శ్రీలంకతో జరుగుతున్న చివరిదైనా మూడవ టి20 మ్యాచ్లో పాకిస్తాన్ తన ఒరిజినల్ ఆట తీరును బయటపెట్టుకుంది.. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు ఈ స్టోరీ రాసే సమయం వరకు 10.4 ఓవర్లలో, నాలుగు వికెట్లు కోల్పోయి 78 పరుగులు చేసింది. పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ ఫర్హాన్ 38* మాత్రమే పరవాలేదు అనిపించాడు. మిగతా ప్లేయర్లు ఫకర్ జమాన్ 12, సదాకత్ 0, నవాజ్ 16, నాఫీ 3 ఇలా వచ్చి అలా వెళ్ళిపోయారు. శ్రీలంక బౌలర్లలో భలింగ రెండు వికెట్లు పడగొట్టాడు. విజయ్ కాంత్.. దాసన్ శనక చెరో వికెట్ సాధించారు.
పాకిస్తాన్ ప్లేయర్లు దారుణంగా ఆడుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బీభత్సమైన కామెంట్లు వినిపిస్తున్నాయి. అసలు ఇటువంటి ప్లేయర్లను ఎందుకు ఎంపిక చేస్తారని పాకిస్థాన్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. రెండు మ్యాచ్ లు గెలవగానే కళ్ళు నెత్తికి ఎక్కాయని.. ఇలాంటి ప్లేయర్లు జట్టుకు అద్భుతమైన విజయాలు ఎలా అందిస్తారని పాకిస్తాన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ సిరీస్ లో రెండో మ్యాచ్ గనుక గెలవకపోతే.. పరిస్థితి దారుణంగా ఉండేదని.. సిరీస్ గెలిచారు కాబట్టి ఆటగాళ్లు రెస్ట్ మోడ్లోకి వెళ్లిపోయారని.. ఇది సరైన విధానం కాదని సోషల్ మీడియాలో పాకిస్తాన్ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.