Mangalagiri Tadepalli Municipal Corporation:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రం మొత్తం మంగళగిరి మీద ఉంది. ఇప్పటికే రిజర్వేషన్ల అంశం తేలింది. బీసీలకు సింహభాగం సీట్లను కూటమి కేటాయించబోతోంది. ఒకరకంగా ఇది ఏపీ రాజకీయాలలో సంచలన పరిణామం.. మెజారిటీకి మించిన సీట్లు గెలుచుకుంటామని కూటమినేతలు రెట్టించిన ఆత్మవిశ్వాసంతో కనిపిస్తున్నారు.
ఏపీలో మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ లో ఈసారి ఎస్టీ రిజర్వేషన్ అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కలు.. గత ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లు.. రొటేషన్ విధానం ఇప్పుడు మళ్ళీ స్థానిక రాజకీయాలలో ఆసక్తికరమైన చర్చకు దారితీస్తోంది.
రాష్ట్రంలో ఉన్న 17 మున్సిపల్ కార్పొరేషన్ లలో ఎస్టి జనాభాను పరిశీలిస్తే నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. మంగళగిరి- తాడేపల్లి రెండవ స్థానంలో ఉన్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మంగళగిరి – తాడేపల్లి కార్పొరేషన్ కు ఎస్టీ రిజర్వేషన్ దక్కుతుందని తెలుస్తోంది.
2011 జనాభా లెక్కల ప్రకారం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొత్తం 5,91,628 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 27, 726 మంది ఎస్టీ వర్గానికి చెందిన వారిగా గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ లెక్కల ప్రకారం ఎస్టీ జనాభా బాట 4.69 శాతంగా ఉంది. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ లో అత్యధిక ఎస్టి జనాభా శాతం నెల్లూరులో ఉంది. ఈ నేపథ్యంలో 2021 ఎన్నికల్లో మేయర్ పదవిని నాడు ఎస్టిలకు కేటాయించారు.
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 2,53,831 ఓటర్లు ఉన్నట్టు తెలుస్తోంది. వీరిలో 8,577 మంది ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు. వీరి జనాభా వాటా 3.38%. ఈ ఘనంగాలతో రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ లో మంగళగిరి తాడేపల్లి రెండవ స్థానంలో ఉంది. నెల్లూరు తర్వాత అత్యధిక ఎస్టి జనాభా శాతం ఉన్న కార్పొరేషన్ గా మంగళగిరి తాడేపల్లి నిలవడం.. గతంలో నెల్లూరుకు ఎస్టీ రిజర్వేషన్ కేటాయించడం వంటి అంశాలు ఈసారి రిజర్వేషన్లపై చర్చకు కారణమవుతున్నాయి..
స్థానిక సంస్థలకు సంబంధించిన రిజర్వేషన్లు కేటాయింపులో జనాభా గణాంకాలతో పాటు వర్తించే చట్టాలు.. ప్రభుత్వ మార్గదర్శకాలు.. గత రిజర్వేషన్లు.. రొటేషన్ నిబంధనలు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకొని రిజర్వేషన్లను కర్ర ప్రక్రియలో మంగళగిరి తాడేపల్లికి ఎస్టీ రిజర్వేషన్ దక్కే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎస్టీ జనాభా శాతం లో రెండో స్థానంలో ఉండడం.. ఒకటే రిజర్వేషన్ ఖరారు చేయదు. వర్తించే రిజర్వేషన్ నిబంధనలు.. రొటేషన్ ప్రక్రియ.. గతంలో కేటాయింపులు.. అధికారిక రిజర్వేషన్ జాబితాను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లో మేయర్ పదవి ఎస్టిలకు రిజర్వ్ అయితే.. ఆ వర్గానికి చెందిన ఆశాభహులకు రాజకీయంగా మంచి అవకాశం లభిస్తుంది. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమీకరణాలు.. ఎన్నికల వ్యూహాలపై కూడా ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది. మతంగా 2011 జనాభా లెక్కల్లో ఎస్టీ జనాభా వాటా పరంగా నెల్లూరు తర్వాతి స్థానంలో ఉన్న మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పై ఇప్పుడు అందరూ దృష్టి సారించారు. అయితే 2022 ఎన్నికల్లో మేయర్ పదవికి ఎస్టీ రిజర్వేషన్ ఖరారు అయిందా.. లేదా అనేది అధికారిక ప్రకటన ద్వారా తెలిసే అవకాశం ఉంది.