Homeక్రైమ్‌Pakistan cricketer controversy : హోటల్ రూమ్ లో పాక్ క్రికెటర్ పాడు పని.. వెలుగులోకి...

Pakistan cricketer controversy : హోటల్ రూమ్ లో పాక్ క్రికెటర్ పాడు పని.. వెలుగులోకి సంచలన నిజం!

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దారుణమైన ప్రదర్శన చేసింది. సూపర్ 8 లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. పేలవ ప్రదర్శన పరంగా ఆ జట్టు పరువు ఇప్పటికే పోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా పాకిస్తాన్ ప్లేయర్ చేసిన ఒక పాడు పని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది కాస్త అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ జట్టు పరువును మరోసారి తీసింది. టి20 వరల్డ్ కప్ […]

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ జట్టు దారుణమైన ప్రదర్శన చేసింది. సూపర్ 8 లో అంతగా ఆకట్టుకోలేకపోయింది. పేలవ ప్రదర్శన పరంగా ఆ జట్టు పరువు ఇప్పటికే పోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఆటగాళ్ల ప్రదర్శన తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా పాకిస్తాన్ ప్లేయర్ చేసిన ఒక పాడు పని ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అది కాస్త అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్తాన్ జట్టు పరువును మరోసారి తీసింది.

టి20 వరల్డ్ కప్ లో అత్యంత దారుణమైన ప్రదర్శన చేసింది పాకిస్థాన్ క్రికెట్ జట్టు. ఇప్పుడు ఆ జట్టును మరో వివాదం చుట్టుముట్టింది. శ్రీలంక జట్టుతో జరిగిన సూపర్ 8 మ్యాచ్ కు ముందు హోటల్ హౌస్ కీపింగ్ మహిళతో పాకిస్థాన్ ప్లేయర్ దారుణంగా ప్రవర్తించాడు. ఆ సమయంలో ఆమె కేకలు కూడా వేసింది. ఇదే విషయాన్ని ఆమె హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్తే.. వారు అతని భార్య నుంచి రక్షించినట్టు తెలుస్తోంది. ఆ మహిళ పాకిస్తాన్ క్రికెట్ జట్టు మేనేజర్ నవైద్ కు ఫిర్యాదు చేసింది. దీంతో ఆయన కల్పించుకొని.. ఆ ప్లేయర్ తరఫున క్షమాపణ చెప్పాడు. అంతేకాదు ఆ ప్లేయర్ కు జరిమానా వినించినట్టు తెలుస్తోంది. త్వరలో అతడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ముందు విచారణకు హాజరవుతాడని తెలుస్తోంది.

పాకిస్తాన్ క్రికెటర్లు క్రమశిక్షణను కలిగి ఉండరని ఎప్పటినుంచో విమర్శలు ఉన్నాయి. జట్టు ప్లేయర్లు అనుచితంగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ జరుగుతున్నప్పుడు కొంతమంది ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్ లో సిగరెట్లు కాల్చారు. అనుచితమైన సైగలు చేశారు. ఇప్పుడు ఏకంగా ఒక హౌస్ కీపింగ్ మహిళతో అనుచితంగా ఒక ఆటగాడు ప్రవర్తించాడు. వాస్తవానికి ఇలాంటి సంఘటనలు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ పరువును తీస్తాయి. ఇటువంటి సంఘటనలు జరుగుతున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అందువల్లే పాకిస్తాన్ క్రికెటర్లు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. హోటల్ గదిలో హౌస్ కీపింగ్ చేసే మహిళపై ఇలా ప్రవర్తించడం ఏమాత్రం సబబు కాదని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

” ఆ ఆటగాడు దారుణంగా ప్రవర్తించాడు. హౌస్ కీపింగ్ మహిళతో దుర్మార్గంగా వ్యవహరించాడు. ఆమె కేకలు వేసింది. హోటల్ సిబ్బంది సకాలంలో రావడంతో ఆమెకు రక్షణ లభించింది. లేకపోతే పరిస్థితి దారుణంగా ఉండేది. ఇటువంటి ఆటగాళ్లకు జాతీయ జట్టులో చోటు ఎలా ఇస్తారు? అటువంటివారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి వారికి ఫైన్ విధించడమే కాదు.. అంతకు మించిన కఠినమైన శిక్ష ఉండాలని” క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper