Homeఎంటర్టైన్మెంట్Janasena Party: జనసేన నిజంగానే 35 శాతం సీట్స్ లో పోటీ చేయబోతుందా ? ఇందులో...

Janasena Party: జనసేన నిజంగానే 35 శాతం సీట్స్ లో పోటీ చేయబోతుందా ? ఇందులో నిజం ఎంతంటే!

Janasena Party: రేపు ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయం లో పెద్ద గందరగోళం నెలకొంది. నేడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్ , నిమ్మల రామానాయుడు చర్చలు జరిపారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా , రిజర్వేషన్స్ గెజిట్ చేయడం […]

Janasena Party: రేపు ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఇప్పుడు కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయం లో పెద్ద గందరగోళం నెలకొంది. నేడు కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మంగళగిరి క్యాంప్ ఆఫీస్ లో టీడీపీ నేతలు పల్లా శ్రీనివాస్ , నిమ్మల రామానాయుడు చర్చలు జరిపారు. తమకు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా , రిజర్వేషన్స్ గెజిట్ చేయడం పై పవన్ కళ్యాణ్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేసాడట. అందుకు నిమ్మల రామానాయుడు , పల్లా శ్రీనివాస్ పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వడం తో , పవన్ కళ్యాణ్ శాంతించినట్టు తెలుస్తోంది. అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చెయ్యాలి అనే దానిపై కూటమి నేతల్లో ఇంకా స్పష్టత రాలేదని తెలుస్తోంది.

నిన్న ఈనాడు దిన పత్రిక లో జనసేన పార్టీ కి కూటమి లో భాగంగా కేవలం 3 సీట్లు మాత్రమే ఇస్తారని ఒక కథనం ప్రచురితం అయ్యింది. దీనిపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున జనసేన పార్టీ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ సాయంత్రానికి జనసేన పార్టీ విశ్వసనీయ వర్గాల నుండి 35 శాతం సీట్లలో కూటమిగా పోటీ చేస్తున్నారనే వార్త తో సోషల్ మీడియా భగ్గుమంది. మరి జనసేన నిజంగానే 35 శాతం స్థానాల్లో పోటీ చేయబోతుందా ?, లేదా టిట్ ఫర్ ట్యాట్ లాగా ఈనాడు కి కౌంటర్ గా జనసేన శ్రేణులు ప్రచారం చేశారా అనేది తెలియాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏమిటంటే , జనసేన పార్టీ కి ఒంగోలు , విజయవాడ, కాకినాడ , మచిలీపట్టణం స్థానాలు ఖరారు అయ్యాయి అని , మరో రెండు స్థానాల మీద చర్చలు నడుస్తున్నాయని సమాచారం.

ఓవరాల్ గా టీడీపీ 11 మేయర్ స్థానాల్లో , జనసేన 5 మేయర్ స్థానాల్లో , బీజేపీ ఒక మేయర్ స్థానం లో పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రేపు మధ్యాహ్నం మంగళగిరి లో సీఎం చంద్రబాబు నాయుడు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి చర్చించుకోబోతున్నారు. ఈ చర్చ తో సీట్ల పంపకం విషయం లో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ 6 స్థానాలకు అసలు తగ్గడం లేదని సమాచారం. ఎటు తేలకపోతే సొంతంగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాబోయే రెండు రోజులు రాజకీయాలు చాలా రసవత్తరంగా మారనున్నాయి. చూడాలి మరి emi జరగబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper