Homeక్రీడలుక్రికెట్‌PAK vs SL: ఇదేందయ్యా ఇది.. పిచ్చి పాక్ ఇలా కూడా ఆడుతుందా.. ఫ్యూజులు ఎగిరిపోయాయిగా..

PAK vs SL: ఇదేందయ్యా ఇది.. పిచ్చి పాక్ ఇలా కూడా ఆడుతుందా.. ఫ్యూజులు ఎగిరిపోయాయిగా..

PAK vs SL: అయితేనేమో అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. ఇలా సాగిపోతుంది పాకిస్తాన్ జట్టు క్రికెట్ ఆడే తీరు. ఒక సందర్భంలో బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తారు. అదే సమయంలో జింబాబ్వే మీద ఓడిపోతారు. సొంత దేశంలో బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అవుతారు. అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కాలర్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఇలా ఎటుచూసినా సరే పాకిస్తాన్ ఆట.. పాకిస్తాన్ ప్లేయర్ల వ్యవహార శైలి గాని ఒక పట్టాన అంతుపట్టదు. పాకిస్తాన్ ప్రస్తుతం సొంత […]

PAK vs SL: అయితేనేమో అతివృష్టి.. లేకుంటే అనావృష్టి.. ఇలా సాగిపోతుంది పాకిస్తాన్ జట్టు క్రికెట్ ఆడే తీరు. ఒక సందర్భంలో బలమైన ఆస్ట్రేలియాను ఓడిస్తారు. అదే సమయంలో జింబాబ్వే మీద ఓడిపోతారు. సొంత దేశంలో బంగ్లాదేశ్ చేతిలో వైట్ వాష్ అవుతారు. అదే సమయంలో డ్రెస్సింగ్ రూమ్ లో కాలర్లు పట్టుకొని కొట్టుకుంటారు. ఇలా ఎటుచూసినా సరే పాకిస్తాన్ ఆట.. పాకిస్తాన్ ప్లేయర్ల వ్యవహార శైలి గాని ఒక పట్టాన అంతుపట్టదు.

పాకిస్తాన్ ప్రస్తుతం సొంత దేశంలో శ్రీలంకతో మూడు టి20 మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ లో భాగంగా తొలి మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత అదే ఊపును రెండవ టి20 లో కూడా కొనసాగిస్తోంది. రావల్పిండి వేదికగా జరుగుతున్న రెండో టి20 మ్యాచ్లో శ్రీలంక మీద ముందుగా బ్యాటింగ్ చేసి.. మూడు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. ఇటీవల కాలంలో టి20లో పాకిస్తాన్ ఈ స్థాయిలో పరుగులు చేయడం ఇదే తొలిసారి. పాకిస్తాన్ జట్టులో ఫర్హాన్ 73.. ఫకర్ జమాన్ 22.. సాద్ కత్ 96 పగులు చేశారు. శ్రీలంక జట్టులో తీక్షణ, మలింగ, షనక ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత శ్రీలంక బ్యాటింగ్ మొదలుపెట్టింది. ఈ స్టోరీ రాశాసనం వరకు 13.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి.. 86 పరుగులు చేసింది.. శ్రీలంక జట్టులో కామిందు మెండిస్ 23, సినీత్ జయవర్ధన 22 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. పాకిస్తాదటలో మహమ్మద్ ఇమ్రాన్ మూడు వికెట్లు పడగొట్టి.. శ్రీలంక పతనాన్ని శాసించాడు. సయిమ్ ఆయుబ్.. షాదాబ్ ఖాన్ తలా ఒక వికెట్ సాధించారు..

ఆరు పరుగులకే శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 14 పరుగుల వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కీలకమైన వికెట్లు నష్టపోయి.. శ్రీలంక పీకల లోతు కష్టాల్లో పడింది. శ్రీలంక గెలవాలంటే అద్భుతం జరగాలి. కానీ ఆ మ్యాజిక్ చేసే ప్లేయర్లు కనిపించడంలేదు. విచిత్రమైన ఆట తీరుకు మారుపేరైన పాకిస్తాన్ ఆటగాళ్లు.. ఈ సిరీస్లో సమష్టిగా ఆడుతుండడం విశేషం. బౌలింగ్.. బ్యాటింగ్.. ఫీల్డింగ్ లో పర్యాటక జట్టుకు మించి ప్రదర్శన చేస్తున్నారు. అందువల్లే క్రికెట్ అభిమానులు పాకిస్తాన్ ప్లేయర్ల ఆట తీరు చూసి వామ్మో అంటూ ఆశ్చర్యపోతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper