Homeక్రీడలుక్రికెట్‌IND Vs AFG: వైభవ్ సూర్యవంశీ అగ్గిముట్టిస్తే.. అతడు కాల్చేశాడు.. ఇదీ కదా దీపావళి అంటే!

IND Vs AFG: వైభవ్ సూర్యవంశీ అగ్గిముట్టిస్తే.. అతడు కాల్చేశాడు.. ఇదీ కదా దీపావళి అంటే!

IND Vs AFG: అండర్ 19 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియా గెలవాల్సిన మ్యాచ్లో గెలిచి చూపించింది. ప్రత్యర్థి జట్టు విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. 41.1 ఓవర్లలోనే భారత్ ఈ లక్ష్యాన్ని ఫినిష్ చేయడం విశేషం. హరారే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ నష్టానికి 310 పరుగులు చేసింది. […]

IND Vs AFG: అండర్ 19 వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్లో అద్భుతం చోటుచేసుకుంది. టీమిండియా గెలవాల్సిన మ్యాచ్లో గెలిచి చూపించింది. ప్రత్యర్థి జట్టు విధించిన 311 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. 41.1 ఓవర్లలోనే భారత్ ఈ లక్ష్యాన్ని ఫినిష్ చేయడం విశేషం.

హరారే వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ నష్టానికి 310 పరుగులు చేసింది. షినో జాడా 110, నియాజై 101* పరుగులు చేయడంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టు టీమ్ ఇండియా ఎదుట 311 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

311 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన టీమిండియా.. ఏ దశలో కూడా ఓడిపోతున్నట్టు కనిపించలేదు. ఓపెనర్ వైభవ్ సూర్య వంశీ(68: 33 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (115: 104 బంతుల్లో 15 ఫోర్లు, రెండు సిక్సర్లు) సూపర్ సెంచరీ తో ఆకట్టుకున్నాడు. వైభవ్ సూర్య వంశీ క్రీజ్ లో ఉన్నప్పుడు మైదానంలో విధ్వంసం చెలరేగింది. తొలి వికెట్ కు 57 బంతుల్లోనో 90 పరుగులు నమోదయ్యాయి. దీనిని బట్టి వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత జార్జ్ సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పరుగులు తీశాడు.

వైభవ్ సూర్య వంశీ ఔట్ అయిన తర్వాత కెప్టెన్ ఆయుష్ మాత్రే క్రీజ్ లోకి వచ్చాడు. అతడు కూడా సమర్థవంతంగా బ్యాటింగ్ చేశాడు. 59 బంతులు ఎదుర్కొన్న అతడు ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 62 పరుగులు చేశాడు. జార్జ్, ఆయుష్ రెండో వికెట్ కు ఏకంగా 114 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఆ తర్వాత జార్జ్, విహాన్ మల్హోత్రా మూడో వికెట్ కు 96 పరుగులు జత చేశారు. దీంతో టీమిండియా 8.2 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఫినిష్ చేసింది.

పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో తడబడిన వైభవ్.. ఈ మ్యాచ్లో మాత్రం వెనకడుగు వేయలేదు. దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. దీటుగా ఆఫ్గనిస్తాన్ బౌలర్లను ఎదుర్కొన్నాడు. అతడికి జార్జ్ తోడు కావడంతో టీమిండియా స్కోరు రాకెట్ వేగంతో దూసుకుపోయింది. వైభవ్ అవుట్ అయినప్పటికీ జార్జ్ నిలబడ్డాడు. కెప్టెన్ ఆయుష్ తన స్థాయి ఇన్నింగ్స్ ఆడాడు. మల్హోత్ర 38*, త్రివేది 5* చివరి అంకాన్ని పూర్తి చేశారు. ఈ మ్యాచ్లో గెలుపొందడం ద్వారా టీం ఇండియా ఫైనల్ వెళ్లిపోయింది. ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తో పోటీ పడుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper