Triumph Bonneville T40 : పాతకాలపు బైక్‌ల రూపం.. ఆధునిక టెక్నాలజీ హంగులు.. సాఫీగా సాగే ప్రయాణం.. ఈ మూడు అంశాలను కలిపి అందించడమే లక్ష్యంగా ట్రయంఫ్ తన కొత్త బొన్నెవిల్ T40ను తీసుకొచ్చింది. బజాజ్‌తో కలిసి అభివృద్ధి చేసిన 350సీసీ ఇంజిన్‌తో వచ్చిన ఈ బైక్.. క్లాసిక్ లుక్ కోరుకునే రైడర్లను ఆకట్టుకునేలా రూపొందింది. అయితే ధర విషయంలో మాత్రం కాస్త ఖరీదైన ఎంపికగానే నిలుస్తోంది.
డిజైన్ పరంగా బొన్నెవిల్ తన సంప్రదాయాన్ని కొనసాగించింది. టియర్‌డ్రాప్ ఆకారపు ఫ్యూయల్ ట్యాంక్, రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ట్విన్ రియర్ షాక్స్, వైర్ స్పోక్ వీల్స్, పీషూటర్ ఎగ్జాస్ట్‌తో పాతకాలపు మోటార్‌సైకిల్ రూపాన్ని గుర్తుచేస్తుంది. ముఖ్యంగా ట్యాంక్‌పై ఉన్న ట్రయంఫ్ బ్యాడ్జ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఇందులోని 350సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ 29 బీహెచ్పీ పవర్, 31.2 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. వేగం కోసం కాకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఇంజిన్‌ను ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. సిటీ ట్రాఫిక్‌లో తక్కువ గేర్ల మార్పులతోనే సులభంగా నడపవచ్చు. హైవేలపై కూడా ఇంజిన్ స్మూత్‌గా పనిచేస్తుంది.
790 ఎంఎం సీట్ హైట్ ఉండటంతో ఎక్కువ మంది రైడర్లకు అందుబాటులో ఉంటుంది. 4 అంగుళాల కలర్ TFT డిస్ప్లే, నావిగేషన్, క్రూయిజ్ కంట్రోల్, కార్నరింగ్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
అయితే 195 కిలోల బరువు కారణంగా మలుపుల్లో వేగంగా నడపడం కొంత కష్టమే. గుంతల రోడ్లపై సస్పెన్షన్ మరింత మెరుగ్గా ఉండాల్సింది.
ధర విషయానికి వస్తే రూ.2.80 లక్షలతో అందుబాటులో ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350, హోండా CB350C, జావా 350తో పోలిస్తే ఇది ఖరీదైనదే. మొత్తంగా వేగం కంటే స్టైల్, బ్రాండ్, సౌకర్యానికి ప్రాధాన్యం ఇచ్చేవారికి బొన్నెవిల్ T40 మంచి ఎంపిక.