Bilibili App: సోషల్ మీడియా ప్రపంచంలో యూట్యూబ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీడియోలు చూడాలన్నా.. సొంతంగా వీడియోలు తయారుచేసి అప్లోడ్ చేయాలన్నా.. చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది యూట్యూబ్. కోట్లాదిమంది క్రియేటర్లు ఈ ప్లాట్ఫారం ద్వారా తమ ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. కొందరు లక్షలు.. మరికొందరు కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. అయితే ఇప్పుడు యూట్యూబ్ కు ప్రత్యామ్నాయంగా మరో వీడియో ఫ్లాట్ ఫామ్ వార్తల్లోకి వచ్చింది.
చైనాలో మొదలైన ఈ వీడియో ప్లాట్ఫారం ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా యానిమేషన్.. గేమింగ్, టెక్నాలజీ, ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కు ఇందులో మంచి ప్రాధాన్యత ఉంది. భారతీయ క్రీయేటర్లు కూడా ఈ ప్లాట్‌ఫామ్ పై ఆసక్తి చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఈ వేదిక ఏమిటి.. ఇందులో యూట్యూబ్ లాగే వీడియోలు అప్లోడ్ చేయవచ్చా.. ఆదాయం సంపాదించుకునే మార్గం ఉందా.. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
యూట్యూబ్ కు పోటీగా వచ్చిన ఈ వేదిక పేరు Bilibili. చైనా దేశానికి చెందిన ఈ యాప్ వీడియో షేరింగ్.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్. 2009లో యానిమేషన్.. కామిక్.. గేమ్స్ అభిమానుల కోసం ఒక ఆన్లైన్ కమ్యూనిటీగా మొదలైంది. ఆ తర్వాత క్రమక్రమంగా విస్తరించింది. వీడియోలు, లైవ్ స్ట్రీమింగ్, గేమింగ్, ఎడ్యుకేషన్, టెక్నాలజీ, వినోద కార్యక్రమాలు అందించే ప్లాట్‌ఫాంగా ఇది ఎదిగింది. దీనిని చాలామంది చైనీస్ యూట్యూబ్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే యూజర్లు వీడియోలు చూడడంతో పాటు సొంతంగా వీడియోలను అప్లోడ్ చేయవచ్చు. ఇతరుల వీడియోలకు కామెంట్లు కూడా పెట్టవచ్చు. తమకు నచ్చిన క్రీయేటర్లను ఫాలో కావచ్చు.Bilibili ప్రత్యేకత ఏంటంటే.. ఇందులో ఈ ఆనిమేషన్.. గేమింగ్ కంటెంట్ కు పెద్దపీట వేస్తారు. యువతను ఆకట్టుకునే విధంగా ప్రత్యేకమైన కమ్యూనిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఎలాంటి వీడియోలు చూడవచ్చు అంటే
Bilibili లో కేవలం సినిమాలు.. యానిమేషన్‌ను మాత్రమే కాకుండా అనేక రకాల కంటెంట్ అందుబాటులో ఉంటుంది. యానిమేషన్.. అనిమే వీడియోలు.. గేమింగ్ వీడియోలు.. గేమ్ లైవ్ స్ట్రీమింగ్.. టెక్నాలజీ.. గాడ్జెట్ రివ్యూలు.. ఎడ్యుకేషన్.. నాలెడ్జ్ వీడియోలు.. ట్రావెల్.. ఫుడ్ వీడియోలు.. మ్యూజిక్.. ఎంటర్టైర్మెంట్ కంటెంట్.. క్రియేటల రూపొందించే సొంత వీడియోలు చూడొచ్చు. అంటే యూట్యూబ్ మాదిరిగానే విభిన్న అంశాలకు సంబంధించిన వీడియోలను ఇందులో చూడవచ్చు. అయితే దేశాన్ని బట్టి కంటెంట్ అందుబాటులో ఉండడంతో మార్పులు ఉంటాయి.
ప్రత్యేకమైన ఫీచర్లు ఏంటంటే
ఈ యాప్ లో అత్యంత ఆసక్తికరమైన ఫీచర్ డాన్ మాకు.. సాధారణంగా యూట్యూబ్‌లో వీడియో కింద కామెంట్ లో కనిపిస్తాయి. కానీ ఇందులో కొంతమంది వీక్షకులు చేసే కామెంట్లు నేరుగా వీడియో తెరమీద కదులుతూ కనిపిస్తాయి. దీంతో ఒకే సమయంలో వీడియో చూస్తున్న వారు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు. ఇతరుల అభిప్రాయాలు కూడా వీడియో చూస్తూనే తెలుసుకోవచ్చు. ఇది ఈ యాప్ కు ప్రత్యేకతను తీసుకొచ్చింది.
కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలను ఇందులో దర్జాగా అప్లోడ్ చేసుకోవచ్చు. వాటిని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావచ్చు. వీడియోలు ద్వారా తమకంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులను సంపాదించుకోవచ్చు. టెక్నాలజీ.. గేమింగ్.. ట్రావెల్.. ఫుడ్.. ఎడ్యుకేషన్ వంటి విభాగాలలో కంటెంట్ రూపొందించే వారికి ఇది మరొక వేదికలాగా ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే యూట్యూబ్‌లో ఉన్న ప్రతి ఫీచర్.. ప్రతి రకమైన మానిటైజేషన్ సదుపాయం ఇందులో ఉంటుందని తెలుస్తోంది.
చాలామంది క్రియేటర్లకు వచ్చే ముఖ్యమైన సందేహం ఇందులో తమ వీడియోలను పోస్ట్ చేస్తే డబ్బులు సంపాదించవచ్చా.. దర్జాగా డబ్బులు వస్తాయి. ప్రతి వీడియోకు డబ్బులు వస్తాయి అని కాదు. క్రియేటర్లకు సంబంధించి మానిటైజేషన్ అర్హతలు.. దేశం.. అకౌంట్ స్థితి.. ఫ్లాట్ ఫామ్ నిబంధనలు బట్టి అవకాశాలు మారుతూ ఉంటాయి. కాబట్టి యూట్యూబ్ మాదిరిగా వ్యూస్ ఆధారంగా ఎంత ఆదాయం వస్తుందని విషయంలో ముందుగానే అంచనాల వేసుకోకూడదు.
ఇక మన దేశంలో ఇది ఇంతవరకు అందుబాటులో రాలేదు. ఇండోనేషియా.. ఫిలిప్పీన్స్.. థాయిలాండ్.. సింగపూర్.. వియత్నాం.. మలేషియా వంటి దేశాల్లో సేవలు అందుబాటులో ఉన్నాయి. అయితే మన దేశానికి సంబంధించిన క్రియేటర్లు కూడా ఇందులో కంటెంట్ అప్లోడ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే మన దేశంలో ఇది అధికారికంగా ఇంతవరకు లాంచ్ కాలేదు.