Homeవింతలు-విశేషాలుNarayanpet Bus Depot: ఆర్టీసీ బస్సులో తాటి కల్లు సీసా గట్టిగా లేపేసింది: వైరల్ వీడియో

Narayanpet Bus Depot: ఆర్టీసీ బస్సులో తాటి కల్లు సీసా గట్టిగా లేపేసింది: వైరల్ వీడియో

Narayanpet Bus Depot: వ్యసనం ఏడు ఊళ్ళ ప్రయాణం అంటారు. దీనిని ఆమె నిజం చేసి చూపించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ తన వ్యసనాన్ని అందరికీ చూపించింది. ఎవరు కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు. కమాన్ నీ పని నువ్వు చేసుకో అంటే ప్రోత్సహించారు. కాకపోతే కొందరు కొంటెగాళ్లు ఆ వ్యవహారాన్ని ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియా లోకి ఎక్కించారు. దీంతో ఈ అక్క ఒకసారి గా వైరల్ అయిపోయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట […]

Narayanpet Bus Depot: వ్యసనం ఏడు ఊళ్ళ ప్రయాణం అంటారు. దీనిని ఆమె నిజం చేసి చూపించింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తూ తన వ్యసనాన్ని అందరికీ చూపించింది. ఎవరు కూడా ఆమెను డిస్టర్బ్ చేయలేదు. కమాన్ నీ పని నువ్వు చేసుకో అంటే ప్రోత్సహించారు. కాకపోతే కొందరు కొంటెగాళ్లు ఆ వ్యవహారాన్ని ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియా లోకి ఎక్కించారు. దీంతో ఈ అక్క ఒకసారి గా వైరల్ అయిపోయింది.

ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట బస్సు డిపోలో ఇటీవల ఓ సంఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ఆర్టీసీ బస్సు ఎక్కింది. ఏకంగా డ్రైవర్ పక్కన బానేట్ పైన కూర్చుంది. చేతిలో పండుతాడు కల్లు సీసా పట్టుకుంది. గట్టిగా లాగేసింది. అయితే ఆమె తాగుతున్న తీరును చూసిన మహిళా కండక్టర్ ఒకసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ ఇలాంటి పనిచేయకూడదని ఆమెకు చెప్పింది. అయితే ఆ మహిళ ఏమాత్రం కండక్టర్ మాటలను లెక్కపెట్టలేదు. దీంతో ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. ప్రయాణికులు కూడా ఆమెను తిట్టారు. కొద్దిసేపు ఆమె తాగడం ఆపింది. ఆ తర్వాత మళ్లీ మొదలుపెట్టింది. ఇందులో కొంతమంది ప్రయాణికులు ఆమెను ఎంకరేజ్ చేశారు. నీ ఇష్టం నీది కానీ అంటూ.. సపోర్ట్ చేశారు.

మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు ప్రయాణం సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించడంతో.. ఇటువంటి దృశ్యాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం లభించడంతో చాలామంది మహిళలు ఇతర ప్రాంతాలకు తిరుగుతున్నారు. స్వేచ్ఛగా విహరించగలుగుతున్నారు. ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం ఉండడంతో చాలామంది మహిళలు షాపింగ్ కోసం.. ఇతర శుభకార్యాల కోసం.. వేడుకల కోసం సుదూర ప్రాంతాలకు కూడా వెళ్తున్నారు. కొందరైతే బస్సులోనే బ్రష్ చేస్తున్నారు. ఇంకొందరైతే అల్లం ఎల్లిపాయల పొట్టు తీస్తున్నారు. మరికొందరైతే బస్సులోనే నెత్తి దువ్వుకుంటూ.. కూరగాయలు కోసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇటువంటి దృశ్యాలు ఇటీవల కాలంలో సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చాయి. అవన్నీ కూడా నవ్వులు పంచాయి. అయితే ఉచితం వల్ల ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోతుంది. ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. ఆర్టీసీకి ఆశించి స్థాయిలో ప్రోత్సాహకాలు రావడం లేదు. దీంతో అప్పుల్లోనే ఆర్టీసీ కొట్టుమిట్టాడుతోంది. వాస్తవానికి ఉచితాల వల్ల ప్రజలు ఎలా మారిపోతారో.. ఎంతకు దిగజారి పోతారో.. ఈ ఉదంతం నిరూపిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper