Homeఉద్యోగాలుSeven Daughters Government Jobs: పిండి మిల్లు నడుపుతూ.. ఏడుగురు కూతుర్లను చదివించాడు.. ఏడుగురికీ ప్రభుత్వ...

Seven Daughters Government Jobs: పిండి మిల్లు నడుపుతూ.. ఏడుగురు కూతుర్లను చదివించాడు.. ఏడుగురికీ ప్రభుత్వ ఉద్యోగాలు.. కన్నీరు తెప్పిస్తున్న తండ్రి కథ..

Seven Daughters Government Jobs: కూతురు పుడితే భారంగా భావించే కుటుంబాలు ఇప్పటికీ మనదేశంలో కనిపిస్తూనే ఉంటాయి. ఆడపిల్ల అంటే అలుసుగా అనుకునే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆడపిల్లకు చదువు ఎందుకు.. చదువు మీద ఖర్చు ఎందుకు ప్రశ్నించే వాళ్లు కూడా నేటి కాలంలో ఉన్నారు. కానీ ఒక తండ్రి మాత్రం ఇలాంటి మాటలు పట్టించుకోలేదు. తనకు పుట్టిన ఏడుగురు మాణిక్యాల లాంటి కూతుర్లను చదివించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బంధువులు సూటిపోటి మాటలు […]

Seven Daughters Government Jobs: కూతురు పుడితే భారంగా భావించే కుటుంబాలు ఇప్పటికీ మనదేశంలో కనిపిస్తూనే ఉంటాయి. ఆడపిల్ల అంటే అలుసుగా అనుకునే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. ఆడపిల్లకు చదువు ఎందుకు.. చదువు మీద ఖర్చు ఎందుకు ప్రశ్నించే వాళ్లు కూడా నేటి కాలంలో ఉన్నారు. కానీ ఒక తండ్రి మాత్రం ఇలాంటి మాటలు పట్టించుకోలేదు. తనకు పుట్టిన ఏడుగురు మాణిక్యాల లాంటి కూతుర్లను చదివించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. బంధువులు సూటిపోటి మాటలు అన్నారు. చుట్టుపక్కల వారు ఈసడించుకున్నారు. అయినప్పటికీ ఆయన వెనుకడుగు వేయలేదు. కుటుంబాన్ని పోషించాడు. పిల్లల భవిష్యత్తు కోసం రేయి పగలు తేడా లేకుండా కష్టపడ్డాడు. చివరికి ఆయన కష్టం ఫలించింది. ఏడుగురు కూతుర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చా. పోలీసు.. కేంద్ర భద్రత దళాల్లో చేరి వారి దేశానికి సేవ చేస్తున్నారు. బీహార్ రాష్ట్రానికి చెందిన ఈ తండ్రి ఇప్పుడు దేశంలో అనేకమందికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

బీహార్ రాష్ట్రంలోని సారన్ జిల్లా ఏక్ మా బజార్ ప్రాంతానికి చెందిన రాజకుమార్ సింగ్ అలియాస్ కమల్ సింగ్ కు ఏడుగురు కూతుర్లు. ఈయనకు వరుసగా ఆడపిల్లలు పుట్టడంతో బంధువులు.. చుట్టుపక్కల వారు రకరకాలుగా మాట్లాడుకునేవారు. ఏడుగురు కూతుర్లను ఎలా పెంచుతావని.. వారి పెళ్లిళ్లు ఎలా చేస్తామని విమర్శించేవారు. ఆడపిల్లలకు అంతగా చదువు చెప్పించడం అవసరమా అంటూ ప్రశ్నించేవారు. కానీ కమల్ సింగ్ మాత్రం ఎవరి మాటలకు భయపడలేదు. ఏడుగురు కూతుర్లను కష్టపడి పెంచాడు. బాగా చదివించడానికి అతడు తీవ్రంగా కష్టపడ్డాడు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ ఏక్ మా బజార్ ప్రాంతంలో పిండి మిల్లును ఏర్పాటు చేశాడు. ఆ బిల్లు ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నడిపించాడు. కూతుర్ల చదువుకు అవసరమైన ఖర్చులు మొత్తం భరించాడు. అదనపు ఆదాయం కోసం ఆవును కూడా పెంచాడు. ఆవు పాలు అమ్మి పిల్లలకు చదువులు చెప్పించాడు.

కమల్ సింగ్ తన కూతుర్ల కోసం కేవలం చదువు మాత్రమే కాదు.. శారీరక దృఢత్వాన్ని కూడా అలవడే విధంగా చేశాడు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోలీసు.. భద్రత దళాల ఎంపికలు శారీరక పరీక్షలు అత్యంత కీలకమైనవి. అందుకే కూతుర్లను రాత్రి 11 గంటల వరకు చదివించేవాడు. తెల్లవారుజామున 4:00 గంటలకు నిద్ర లేపేవాడు. సమీపంలో ఉన్న మైదానానికి తీసుకెళ్లేవాడు. పరుగు సాధన చేయించేవాడు. చదువుతోపాటు శారీరక శిక్షణపై కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టే విధంగా చేశాడు. తండ్రి పడుతున్న కష్టాన్ని అర్థం చేసుకున్న కూతుర్లు పట్టదలతో శ్రమించారు. ఒక్కొక్కరిగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.. కమల్ సింగ్ ఏడుగురు కూతుర్లలో మొదటి కుమార్తె రాణి కుమారి సింగ్ బీహార్ పోలీస్ గా పనిచేస్తున్నారు. రేణు కుమార్ సింగ్ సశస్త్ర సీమా బల్ లో పనిచేస్తున్నారు. సోనీ కుమార్ సింగ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సులో పనిచేస్తున్నారు. ప్రీతి కుమారి సింగ్ క్రైమ్ బ్రాంచ్ లో పనిచేస్తున్నారు. పింకీ కుమారి సింగ్ ఎక్సైజ్ పోలీస్ గా పని చేస్తున్నారు. రింకి కుమారి సింగ్ బీహార్ పోలీస్ గా పనిచేస్తున్నారు. నన్హీ సింగ్ గవర్నమెంట్ రైల్వే పోలీసుగా పనిచేస్తున్నారు. వీరిలో రేణు సింగ్ 2006లో ఎస్ఎస్ బీ కానిస్టేబుల్ గా ఎంపిక అయ్యారు. ఆమె సాధించిన విజయం మిగతా సోదరీమణులకు స్ఫూర్తిగా నిలిచింది. ఆ తర్వాత ఒక్కొక్కరు తమ కృషితో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు.

తమను ఈ స్థాయి తీసుకొచ్చేందుకు తండ్రి పడిన కష్టాన్ని కూతుర్లు మర్చిపోలేదు. అందుకే ఆయనకు కృతజ్ఞతగా ఏడుగురు కలిసి నాలుగు అంతస్తుల భవనం నిర్మించి బహుమతి గెలిచారు. దీనిని తమ తండ్రికి తాము ఇచ్చిన పెన్షన్ లాగా వారు భావించారు. భవిష్యత్తులో తాము వివాహాలు చేసుకున్న తర్వాత వేర్వేరు ప్రాంతాలకు వెళ్లినప్పటికీ.. ఈ భవనం ద్వారా వచ్చే అద్దె ఆదాయం తండ్రికి ఆర్థికంగా ఉపయోగపడుతుందని వారు భావించారు. ఈ భవనానికి సింగ్ సిస్టర్స్ పాలస్ అని పేరు పెట్టారు. ఇంటిముందు ఏర్పాటుచేసిన బోర్డుపై ఏడుగురు సోదరీమణుల పేర్లు.. వారు పనిచేస్తున్న విభాగాల వివరాలు కూడా ఇందులో ఉన్నాయి.

కూతుర్లు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి స్థిరపడిన కమల్ సింగ్ మాత్రం తన పెళ్లి మిల్లును మూసి వేయలేదు. కూతుర్లు ఎన్నిసార్లు పని మానేయాలని చెప్పినప్పటికీ ఆయన అంగీకరించలేదు. తన పిల్లల చదువుకు.. ఈ స్థాయికి చేరుకోవడానికి ఆ మిల్లే ఆధారమని ఆయన భావిస్తున్నారు. తన ఏడుగురు కూతుర్ల విజయం పై కమల్ సింగ్ , ఆయన భార్య శారద దేవి భావద్వేగానికి గురవుతున్నారు.

ఒకప్పుడు ఏడుగురు పిల్లల్ని పెంచడం ఎలా అని ప్రశ్నించిన సమాజమే ఇప్పుడు వారి విజయాన్ని చూసి అభినందిస్తోంది. పిండి మిల్లు ద్వారా వచ్చిన ఆదాయాన్ని కూతుర్ల చదువు ఖర్చు చేసిన తండ్రి వారి పట్టుదల.. కష్టంతో దేశానికి సేవ చేసే ఏడుగురు ఉద్యోగులను తయారు చేశారు. కూతుర్లకు సరైన ప్రోత్సాహం.. విద్య.. శిక్షణ అందిస్తే వారు ఏ రంగంలోనైనా రాణించగలరని సింగ్ సిస్టర్స్ కథ మరోసారి నిరూపితమైంది. ఒక తండ్రి నమ్మకం.. ఏడుగురు కూతుర్ల కష్టం.. ఒక కుటుంబానికి కాదు.. సమాజానికే గొప్ప స్ఫూర్తిగా నిలిచింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper