Homeక్రీడలుక్రికెట్‌Ind Vs Pak: అన్నంత పనీ చేసిన సూర్య కుమార్ యాదవ్.. పాపం సల్మాన్ ఆఘా!...

Ind Vs Pak: అన్నంత పనీ చేసిన సూర్య కుమార్ యాదవ్.. పాపం సల్మాన్ ఆఘా! వైరల్ వీడియో

Ind Vs Pak: ” మేము కరచాలనం చేస్తామా? లేదా? అనేది ఇక్కడ విషయం కాదు. దాని గురించి ఆలోచించడానికి ఇంకా 24 గంటల సమయం ఉంది. అప్పటివరకు మీరు హాయిగా తినండి. మంచిగా విశ్రాంతి తీసుకోండి. మేమేం చేస్తామనేది మీరు చూస్తారు” నిన్నటి ప్రెస్ మీట్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు ఇవి. పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ తీసుకునే విషయంపై విలేకరులు ప్రశ్నలు సంధిస్తే.. సూర్య కుమార్ యాదవ్ […]

Ind Vs Pak: ” మేము కరచాలనం చేస్తామా? లేదా? అనేది ఇక్కడ విషయం కాదు. దాని గురించి ఆలోచించడానికి ఇంకా 24 గంటల సమయం ఉంది. అప్పటివరకు మీరు హాయిగా తినండి. మంచిగా విశ్రాంతి తీసుకోండి. మేమేం చేస్తామనేది మీరు చూస్తారు” నిన్నటి ప్రెస్ మీట్ లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు ఇవి.

పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ తీసుకునే విషయంపై విలేకరులు ప్రశ్నలు సంధిస్తే.. సూర్య కుమార్ యాదవ్ పై విధంగా సమాధానం చెప్పాడు. తద్వారా మైదానంలో ఏం చేస్తామనే విషయంపై సస్పెన్స్ విధించాడు.

షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై సూర్యకుమార్ యాదవ్ సస్పెన్స్ కొనసాగించడంతో ఏం జరుగుతుందనేది అంతుబట్టలేదు. జాతీయ మీడియా.. స్పోర్ట్స్ సర్కిల్స్ లో షేక్ హ్యాండ్ ఇచ్చే విషయంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. చివరికి సూర్య కుమార్ యాదవ్ తాను ఏదైతే అనుకున్నాడో.. అదే చేసి పాకిస్తాన్ ప్లేయర్లకు షాక్ ఇచ్చాడు.

ఆదివారం సాయంత్రం టాస్ వేసే ప్రక్రియ పూర్తయిన తర్వాత.. పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచాడు. మరో మాటకు తావు లేకుండా అతడు బౌలింగ్ ఎంచుకున్నాడు. ఉస్మాన్ తారిఖ్ లాంటి బౌలర్ ఉన్న నేపథ్యంలో సల్మాన్ అఘా బౌలింగ్ వైపు మొగ్గు చూపించాడు. టాస్ నెగ్గిన తర్వాత సాధారణంగా గెలిచిన సారధికి.. ప్రత్యర్థి జట్టు కెప్టెన్ షేక్ హ్యాండ్ ఇస్తాడు. కానీ సూర్య కుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ ముఖం కూడా చూడడానికి ఇష్టపడలేదు.

సూర్య కుమార్ యాదవ్ ముఖాన్ని మాత్రం పాకిస్తాన్ కెప్టెన్ పదేపదే చూశాడు. ఇదే విషయాన్ని వ్యాఖ్యాత ప్రస్తావిస్తే పాకిస్తాన్ కెప్టెన్ దాటవేశాడు. “ఈ మైదానం బౌలింగ్ కు సహకరిస్తుంది. అందువల్లే బౌలింగ్ ఎంచుకున్నాం. మా జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. మేము భారత ప్లేయర్లకు అడ్డు కట్టడానికి సిద్ధంగా ఉన్నామని” పాకిస్తాన్ కెప్టెన్ పేర్కొన్నాడు.

టీమిండియాలో వరుణ్ చక్రవర్తి, కులదీప్ యాదవ్ తో పాటు అక్షర్ పటేల్ ఉన్నారు . వీరంతా అద్భుతంగా బౌలింగ్ చేయగలరు. మిస్టీరియస్ స్పిన్ బౌలింగ్ వేయడంలో వరుణ్ చక్రవర్తి సిద్ధహస్తుడు. గత ఆసియా కప్ లో అతడు పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్లో కూడా పాకిస్తాన్ బ్యాటర్లకు చుక్కలు చూపించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper