Nara Lokesh: గత రెండు మూడు రోజుల నుండి రాజకీయ వర్గాల్లో బలంగా సాగుతున్న చర్చ, నారా లోకేష్ ముఖ్యమంత్రి పదవి ని చేపట్టబోతున్నాడు అని. తెలుగు దేశం పార్టీ నాయకుల నుండి రోజురోజుకి నారా లోకేష్(Nara Lokesh) ని సీఎం చెయ్యాలనే డిమాండ్ బలంగా ఏర్పడింది. ఎందుకంటే రాబోయే తరం లో తెలుగు దేశం పార్టీ బలంగా ముందుకు వెళ్లాలంటే నారా లోకేష్ సీఎం పదవి ని చేపట్టాల్సిందే. లేదంటే ఇక ఆయన భవిష్యత్తు ప్రశ్నర్ధకంగా మారిపోతుందని తెలుగు దేశం పార్టీ శ్రేణుల్లో ఉన్న భయం. రీసెంట్ గా లోకేష్ తన నివాసం తెలుగు దేశం పార్టీ నాయకులందరినీ పిలిపించి విందు భోజనం ఏర్పాటు చేసాడు. అనంతరం వాళ్ళతో ఆప్యాయంగా మెలిగిన తీరు ని చూస్తుంటే, నారా లోకేష్ సీఎం పగ్గాలు చేపట్టడానికి అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది అంటూ సోషల్ మీడియా లో విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
ఉగాది పర్వదినాన, చంద్రబాబు(Cm Chandrababu Naidu) తన సీఎం కుర్చీని ఖాళీ చేసి, నారాలోకేష్ చేతుల్లో పెట్టబోతున్నాడని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇదే నిజమైతే పవన్ కళ్యాణ్(Deputy Cm Pawan Kalyan) పరిస్థితి ఏంటి?. నారా లోకేష్ సీఎం , పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అంటే జనాలు ఊరుకుంటారా?, ముఖ్యంగా జనసేన పార్టీ క్యాడర్ ఆగ్రహావేశాలతో అల్లకల్లోలం చేయకుండా ఉంటుందా?, కూటమి విచ్ఛిన్నం అవ్వకుండా ఉంటుందా అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ నారా లోకేష్ సీఎం గా అంగీకరిస్తే, ఇక జనసేన పార్టీ అధికారికంగా మూత పడినట్టే అనుకోవచ్చు. సీఎం చంద్రబాబు ని వయస్సులో, అనుభవం పవన్ కళ్యాణ్ కంటే పెద్ద వాడు కాబట్టి, ఆయన క్రింద డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటికీ జనాలు అంగీకరించి ఓట్లు వేశారు. అదే నారా లోకేష్ అయితే జనసేన అభిమానుల వైపు నుండి ఒక్క ఓటు కూడా కూటమి కి పడేది కాదు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ చెప్పినట్టు కూటమి 15 ఏళ్ళు చెక్కు చెదరకుండా ఉండాలంటే, కచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఉండాలి. లేదంటే, మరోసారి జగన్ చేతిలో సీఎం కుర్చీని చాలా తేలికగా పుట్టినవాళ్ళు అవుతారు. మరి మార్చి 19 న ఏమి జరగబోతుందో చూడాలి. అయితే రీసెంట్ గా జరిగిన టీడీపీ పార్టీ కార్యకర్తల సమావేశం లో లోకేష్ సీఎం అంటూ ఒక టీడీపీ కార్యకర్త అరిస్తే, అందుకు లోకేష్ సమాధానం ఇస్తూ ‘బాబు నీకొక నమస్కారం..చంద్రబాబు నాయుడు మన నాయకుడు, మనం ఆయన సైనికులం, పవనన్న సేనాధిపతి, వాళ్ళిద్దరి నాయకత్వం లో మనం నడుస్తున్నాం. మీరు ఇలాంటి నినాదాలు చేసి ఉన్న ఉద్యోగం కూడా పీకించేలా ఉన్నారు’ అంటూ క్లారిటీ ఇచ్చాడు. అంటే సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నవి కేవలం రూమర్స్ యేనా?, లేదా నిజామా, కాలమే సమాధానం చెప్పాలి.