Homeక్రీడలుక్రికెట్‌IND vs PAK: ఆరడుగుల తెలుగోడు.. పాకిస్తాన్ అంటే చాలు రెచ్చిపోతాడు..

IND vs PAK: ఆరడుగుల తెలుగోడు.. పాకిస్తాన్ అంటే చాలు రెచ్చిపోతాడు..

IND vs PAK: పాకిస్తాన్ అంటే చాలు ఇతగాడికి ఎక్కడలేని ఊపు వస్తుంది. మామూలుగా కాదు.. బ్యాట్ అందుకున్నాడు అంటే శివతాండవం చేస్తాడు. బంతితో పనిలేదు. మైదానంతో పనిలేదు. ప్రత్యర్థి ప్లేయర్లతో పనిలేదు. కొట్టడం మొదలుపెడితే అన్ని రకాల స్టైల్స్ మొత్తం కళ్ళ ముందు కనిపించే విధంగా బ్యాటింగ్ చేస్తాడు. చూస్తుండగానే విధ్వంసాన్ని కళ్ళ ముందు ఉంచుతాడు. ఇంత ఉపోద్ఘాతం చదివిన తర్వాత అతడు మరెవరో కాదు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. సరిగా ఆసియా కప్ […]

IND vs PAK: పాకిస్తాన్ అంటే చాలు ఇతగాడికి ఎక్కడలేని ఊపు వస్తుంది. మామూలుగా కాదు.. బ్యాట్ అందుకున్నాడు అంటే శివతాండవం చేస్తాడు. బంతితో పనిలేదు. మైదానంతో పనిలేదు. ప్రత్యర్థి ప్లేయర్లతో పనిలేదు. కొట్టడం మొదలుపెడితే అన్ని రకాల స్టైల్స్ మొత్తం కళ్ళ ముందు కనిపించే విధంగా బ్యాటింగ్ చేస్తాడు. చూస్తుండగానే విధ్వంసాన్ని కళ్ళ ముందు ఉంచుతాడు.

ఇంత ఉపోద్ఘాతం చదివిన తర్వాత అతడు మరెవరో కాదు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ. సరిగా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్లో పాకిస్తాన్ మీద శివతాండవం చేశాడు. ఓడిపోయే మ్యాచ్ గెలిపించాడు. తద్వారా పాకిస్తాన్ మీద ఉన్న రికార్డును మరింత పదిలం చేశాడు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ లో కూడా అదే సీన్ రిపీట్ చేశాడు. మామూలుగా కాదు.. భీభత్సంగా బ్యాటింగ్ చేసి అదరగొట్టాడు. తద్వారా తను ఎంత స్పెషలో మరోసారి నిరూపించాడు. 133 పరుగుల వద్ద ఐదు వికెట్లు కోల్పోయిన టీమ్ ఇండియాకు.. తిరుగులేని బూస్ట్ ఇచ్చాడు తిలక్ వర్మ. 22 బంతుల్లో మూడు ఫోర్లు.. నాలుగు సిక్సర్ల సహాయంతో ఏకంగా హాఫ్ సెంచరీ చేశాడు. అంతేకాదు టీమిండియా భారీ స్కోర్ చేయడంలో తన వంతు సహాయం చేశాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో 61 పరుగులు చేస్తే.. తిలక్ వర్మ 22 బంతుల్లో 51 పరుగులు చేశాడు.

తిలక్ వర్మ దూకుడు వల్ల టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ మొదలుపెట్టిన పాకిస్తాన్ జట్టు ఏ దశలో కూడా టీమిండియా కు పోటీ ఇచ్చే విధంగా కనిపించలేదు. 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. మొత్తంగా 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు నిర్వహించడం లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే అంతర్జాతీయ సిరీస్ లు మాత్రమే జరుగుతున్నాయి. ఇందులో కూడా టీమిండియా ఏకపక్షమైన విజయాలు అందుకుంటున్నది. చివరికి ఏషియన్ గేమ్స్ లో కూడా టీమిండియా అదరగొట్టింది. పాకిస్తాన్ జట్టను గురించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్ జట్టును గురించి ఫైనల్ దాకా వచ్చిన పాకిస్తాన్.. ఫైనల్ లో టీమిండియా మీద ఎప్పటిలాగానే చేతులెత్తేసింది.

పాకిస్తాన్ జట్టు ఆట తీరును చూసి అభిమానులు సోషల్ మీడియాలో రకరకాల విమర్శలు చేస్తున్నారు. తెలుగు కుర్రాడు ఆసియా కప్ లో నేల నాకించాడు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్ లో కూడా అలానే చేశాడు. వైభవ్ సూర్యవంశీని అవుట్ చేసి సంకలు గుద్దుకున్నారు. కానీ అంతకు మించిన స్థాయిలో బ్యాటింగ్ చేశాడు తిలక్ వర్మ. అతడిని అవుట్ చేయలేక చేతులెత్తేశారు. కానీ అతడు విధ్వంసం సృష్టించి వెళ్ళాడు. ఇక అన్ని మూసుకొని వెళ్లిపోవడం తప్ప పాకిస్తాన్ ప్లేయర్లకు మరొకటి మిగలలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper