Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav : ముంబై ని వీడుతున్న సూర్య కుమార్ యాదవ్.. క్లారిటీ ఇచ్చిన ఎంఐ..

Suryakumar Yadav : ముంబై ని వీడుతున్న సూర్య కుమార్ యాదవ్.. క్లారిటీ ఇచ్చిన ఎంఐ..

Suryakumar Yadav సూర్య కుమార్ యాదవ్ కు.. ముంబై ఇండియన్స్ జట్టుకు బలమైన బంధం ఉంది. ఈ జట్టు సాధించిన అనేక విజయాలలో సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో అతడు అంత గొప్పగా ఆడలేదు. పైగా అతని మీద భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ వాటిని అందుకోలేకపోయాడు. మధ్యలో కొన్ని మ్యాచ్లలో ఆడలేదు. ఈ నేపథ్యంలో అతడికి ఉద్వాసన పలుకుతుందని.. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇక […]

Suryakumar Yadav సూర్య కుమార్ యాదవ్ కు.. ముంబై ఇండియన్స్ జట్టుకు బలమైన బంధం ఉంది. ఈ జట్టు సాధించిన అనేక విజయాలలో సూర్య కుమార్ యాదవ్ కీలక పాత్ర పోషించాడు. అయితే గత సీజన్లో అతడు అంత గొప్పగా ఆడలేదు. పైగా అతని మీద భారీగా అంచనాలు పెట్టుకున్నప్పటికీ వాటిని అందుకోలేకపోయాడు. మధ్యలో కొన్ని మ్యాచ్లలో ఆడలేదు. ఈ నేపథ్యంలో అతడికి ఉద్వాసన పలుకుతుందని.. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి.

ఇక ముంబై ఇండియన్స్ జట్టు సారథిగా హార్దిక్ పాండ్యా అంతగా ఆకట్టుకుపోవడంతో అతడిని ఈ సీజన్లో పక్కకు పెడతారని వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. కాకపోతే మీడియాలో ప్రచారం జరుగుతూనే ఉంది. అయితే హార్దిక్ పాండ్యా లక్నో లేదా ఢిల్లీ జట్టుకు వెళ్లే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. పైగా ఆట తీరు మెరుగు పడకపోవడంతో హార్దిక్ పాండ్యా కొంతకాలంగా బెంగళూరులో ఉంటున్నాడు. బెంగళూరులోనే ప్రాక్టీస్ చేస్తున్నాడు. గాయం కూడా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో జాతీయ జట్టుకు అతడు దూరంగా ఉంటున్నాడు.

హార్దిక్ పాండ్యాను పక్కనపెట్టి రోహిత్ శర్మకు నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరుగుతుంది. దీనిపై కూడా ముంబై మేనేజ్మెంట్ అధికారికంగా ప్రకటన చేయలేదు. ముంబై ఇండియన్స్ కు ఐపీఎల్ లో అత్యంత విలువైన జట్టుగా పేరుంది. అయినప్పటికీ గత కొన్ని సీజన్లుగా అంతగా ఆకట్టుకోలేకపోతోంది. మేనేజ్మెంట్ మదిలో ఎటువంటి అంచనాలు ఉన్నాయో తెలియదు గానీ.. హార్థిక్ పాండ్యా గురించి.. సూర్య కుమార్ యాదవ్ గురించి రోజుకో వార్త బయటకు వస్తోంది.. అయితే సూర్య కుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్ జట్టు నుంచి వెళ్లిపోవడానికి సిద్ధంగా లేడని తెలుస్తోంది. అతడు చాలాకాలంగా ముంబై ఇండియన్స్ జట్టుతో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడని.. ఇటువంటి స్థితిలో అతడు జట్టు నుంచి బయటికి ఎలా వెళ్లిపోతాడని విశ్లేషకులు అంటున్నారు.

సూర్య కుమార్ యాదవ్ టీమిండియా టి20 కెప్టెన్ హోదాను కోల్పోయాడు. ఆటగాడిగా కూడా అతనికి అవకాశాలు లభించడం లేదు. టీమ్ ఇండియాకు టి20 వరల్డ్ కప్ అందించినప్పటికీ.. అతడిని మేనేజ్మెంట్ దూరంగా ఉంచుతున్నది. అతడు జట్టులోకి ఎప్పుడు వస్తాడో తెలియదు గానీ.. ఇప్పుడైతే మాత్రం వార్తల్లో కనిపిస్తున్నాడు.. అయితే సూర్య కుమార్ యాదవ్ ట్రేడ్ డీల్ కు సిద్ధంగా లేడని తెలుస్తోంది. గతంలో కూడా హార్దిక్ పాండ్యా ముంబై జట్టుకు తొలిసారిగా కెప్టెన్ అయినప్పుడు ఇలాంటి వార్తలే వచ్చాయి. అప్పుడు కూడా ముంబై మేనేజ్మెంట్ స్పందించలేదు. ఇప్పుడు కూడా ఈ తరహాలోనే వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా ముంబై మేనేజ్మెంట్ స్పందించడం లేదు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper