Homeక్రీడలుక్రికెట్‌Suryakumar Yadav: స్నేహితుడి ఇంట్లో సూర్య కుమార్ యాదవ్ చేసిన పని.. వైరల్ వీడియో

Suryakumar Yadav: స్నేహితుడి ఇంట్లో సూర్య కుమార్ యాదవ్ చేసిన పని.. వైరల్ వీడియో

Suryakumar Yadav: క్రికెట్ మైదానంలో తనదైన బ్యాటింగ్ తో అభిమానులను అలరించే టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. మైదానం బయట కూడా తన ప్రత్యేకతను చాటుకుంటాడు. తాజాగా సూర్య కుమార్ యాదవ్ చేసిన పని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో సూర్య కుమార్ యాదవ్ స్థాయిని మరింత పెంచింది. సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా ఇతడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో […]

Suryakumar Yadav: క్రికెట్ మైదానంలో తనదైన బ్యాటింగ్ తో అభిమానులను అలరించే టీమ్ ఇండియా స్టార్ ఆటగాడు సూర్య కుమార్ యాదవ్. మైదానం బయట కూడా తన ప్రత్యేకతను చాటుకుంటాడు. తాజాగా సూర్య కుమార్ యాదవ్ చేసిన పని సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో సూర్య కుమార్ యాదవ్ స్థాయిని మరింత పెంచింది.

సూర్య కుమార్ యాదవ్ ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ(SMAT)లో భాగంగా ఇతడికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. స్టార్ క్రికెట్ హోదాని పక్కనపెట్టి స్నేహితులతో కలిసి సాధారణ వ్యక్తి లాగా సూర్య కుమార్ యాదవ్ భోజనాన్ని ఆస్వాదించాడు. అందులో అతనికి ఇష్టమైన పూరీలు.. మటన్ కూర.. ఇంకా అనేక రకాల వంటకాలు ఉన్నాయి. ఇండియన్ క్రికెట్లో ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా.. స్నేహ బంధాలకు సూర్య కుమార్ యాదవ్ ప్రాధాన్యత ఇస్తాడు. సహచర క్రికెటర్ సర్ఫ రాజ్ ఖాన్ తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఈ విందులో పాల్గొన్నారు. క్రికెట్ లో ఎప్పుడు బిజీగా ఉండే ఆటగాళ్లకు ఇలాంటి క్షణాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాచ్ లు.. ప్రాక్టీసులు.. ప్రయాణల మధ్య స్నేహితులతో కలిసి గడిపే సమయం వారికి కొంత ఉపశమనాన్ని అందిస్తుంది. సూర్య కుమార్ యాదవ్ ను అభిమానులు మైదానంలో ఒక విధంగా చూస్తారు. కానీ ఇలాంటి వీడియోలు చూస్తే ఆయనలో ఉన్న మరో కోణం కనిపిస్తుంది. స్టార్ డం ఉన్నప్పటికీ.. స్నేహితులతో కలిసి సాధారణంగా గడపడం.. ఆత్మీయంగా భోజనం చేయడం అనుమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నది. మైదానంలో సిక్సర్ల వర్షం.. స్నేహితుల ఇంట్లో విందు భోజనం.. సూర్య కుమార్ యాదవ్ తీరు చూస్తే ఇలాగే అనిపిస్తోందని అతని అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక సూర్య కుమార్ యాదవ్ ఇటీవల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాను విజేతగా నిలిపాడు. సారధిగా అతడికి తిరుగులేదు. కానీ ఆటగాడిగా విఫలం కావడంతో మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. అతడి స్థానంలో శ్రేయస్ అయ్యర్ కు అవకాశం కల్పించింది. దీంతో అతడు జట్టులో పునరాగమనం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే డొమెస్టిక్ క్రికెట్లో సత్తా చూపించేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఇటీవల పండంటి పాపకు తండ్రి అయిన సూర్యకుమార్ యాదవ్.. తన ఆట మీద పూర్తిస్థాయిలో మనసు లగ్నం చేశాడు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సతీమణితో కలిసి సూర్య కుమార్ యాదవ్ కలిశాడు. ఈ నేపథ్యంలో అతడు బిజెపిలో చేరుతున్నాడని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై అతని నుంచి.. భారతీయ జనతా పార్టీ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper