Homeక్రీడలుక్రికెట్‌Devdutt Padikkal Century: వరుసగా రెండు సెంచరీలు.. మూడో స్థానానికి మగాడొచ్చాడు..

Devdutt Padikkal Century: వరుసగా రెండు సెంచరీలు.. మూడో స్థానానికి మగాడొచ్చాడు..

Devdutt Padikkal Century: రాహుల్ ద్రావిడ్.. ఆ తర్వాత పూజార.. కొద్దిరోజులు విరాట్ కోహ్లీ.. అప్పుడప్పుడు మిగతా బ్యాటర్లు.. కానీ ఆస్థానాన్ని పూర్తిగా పరిపుష్టం చేసిన ఆటగాళ్లు లేరు. ద్రావిడ్ లేని లోటును ఎవరి భర్తీ చేస్తారు.. పూజార స్థానాన్ని ఎవరు పూడ్చుతారు. ఒకటే చర్చ.. చాలామంది ప్లేయర్లు వస్తున్నారు.. వెళ్తున్నారు. కేఎల్ రాహుల్ ఆస్థానంలో నిలబడతాడు అనుకుంటే.. అతడు స్థిరంగా ఆటలేకపోతున్నాడు. ఒకవేళ జైస్వాల్ ను ఆ స్థానంలో ఆడించాలంటే ఓపెనర్ ఎవరు అనే ప్రశ్న […]

Devdutt Padikkal Century: రాహుల్ ద్రావిడ్.. ఆ తర్వాత పూజార.. కొద్దిరోజులు విరాట్ కోహ్లీ.. అప్పుడప్పుడు మిగతా బ్యాటర్లు.. కానీ ఆస్థానాన్ని పూర్తిగా పరిపుష్టం చేసిన ఆటగాళ్లు లేరు. ద్రావిడ్ లేని లోటును ఎవరి భర్తీ చేస్తారు.. పూజార స్థానాన్ని ఎవరు పూడ్చుతారు. ఒకటే చర్చ.. చాలామంది ప్లేయర్లు వస్తున్నారు.. వెళ్తున్నారు. కేఎల్ రాహుల్ ఆస్థానంలో నిలబడతాడు అనుకుంటే.. అతడు స్థిరంగా ఆటలేకపోతున్నాడు. ఒకవేళ జైస్వాల్ ను ఆ స్థానంలో ఆడించాలంటే ఓపెనర్ ఎవరు అనే ప్రశ్న ఎదురవుతోంది. ఒకవేళ గిల్ ఆ స్థానంలో ఆడితే.. నాలుగు స్థానం పరిస్థితి ఏంటి అనే సమస్య కూడా కనిపిస్తోంది.

ఇన్ని రోజులకు మొత్తానికి ఆ స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు టీమ్ ఇండియాకు దొరికేశాడు. దొరకడం మాత్రమే కాదు అతడు స్థిరంగా ఆడుతున్నాడు. ఆడటం మాత్రమే కాదు పరుగుల వరద సాగిస్తున్నాడు. డొమెస్టిక్ క్రికెట్లో సంచలన ఆట తీరుతో ఆకట్టుకున్న అతడు.. ఇప్పుడు అదే జోరును శ్రీలంక టూర్లో కొనసాగిస్తున్నాడు. ఒక ఎండ్ లో ద్రావిడ్ మాదిరిగా.. మరో ఎండ్ లో పూజారి మాదిరిగా ఆడుతూ సత్తా చూపిస్తున్నాడు. శ్రీలంక జట్టుతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్ లో ఇప్పటికే అతడు వరుసగా రెండు సెంచరీలు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు.

ఈ సిరీస్లో దేవదత్ పడికల్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. ఈ సిరీస్ లో అతడు ఇప్పటివరకు 328 పరుగులు చేశారు. అతడికి దరిదాపుల్లో మరే ఆటగాడు కూడా లేడు. జురెల్ రెండు టెస్టులో సెంచరీ చేసిన నేపథ్యంలో.. అతడు తన స్థానాన్ని కాస్త మెరుగుపరుచుకున్నాడు.

రిషబ్ పంత్ రెండు హాఫ్ సెంచరీలు చేయడంతో అతడు కూడా.. మెరిగైన స్థితిలో ఉన్నాడు. కాకపోతే దేవదత్ శ్రీలంక స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. మిగతా భారత ప్లేయర్లు కాస్త ఇబ్బంది పడినప్పటికీ.. అతడు మాత్రం నిలకడగా ఆడాడు. తద్వారా టీమిండియాకు నెంబర్ 3 స్థానంలో అద్భుతమైన ఆటగాడిగా దేవదత్ నిలిచాడు. అతడు గనుక ఇదే ఫామ్ కొనసాగిస్తే టీమిండియాలో అతడికి తిరుగులేని స్థానం ఉంటుంది. పైగా అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉంది. టెక్నిక్ సూపర్ గా ఉంది. అందువల్లే అతడిని మరో ద్రావిడ్ అని.. పూజార అని అభిమానులు కొనియాడుతున్నారు. అతడికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper