India vs Sri Lanka Test: కొంతకాలంగా వైట్ బాల్ ఫార్మాట్ లో టీమిండియా అంత గొప్పగా ఆడటం లేదు. స్వదేశంలో.. విదేశంలో సిరీస్ లు కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా మీద ఒత్తిడి పెరిగిపోయింది. ఫలితంగా శ్రీలంక గడ్డపై శ్రీలంక తో జరిగే టెస్ట్ సిరీస్ కు టీమిండియాకు అత్యంత ముఖ్యంగా మారిపోయింది.
తొలి టెస్ట్ ఆడిన టీమిండియా శ్రీలంక మీద అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 165 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వర్షం ఇబ్బంది పెట్టినప్పటికీ.. ఈ మ్యాచ్లో టీమిండియా తిరుగులేని స్థాయిని అందుకుంది. అందువల్లే విజయం సాధించి ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకుంది. తద్వారా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ ఆశలను కాస్త సజీవంగా ఉంచుకుంది. శ్రీలంక మీద భారీ అంతరంతో గెలిచినప్పటికీ టీమిండియా ఇంకా చేయాల్సింది చాలా ఉంది.
డబ్ల్యూటీసి సైకిల్లో టీమిండియా ఇంకా ఎనిమిది మ్యాచ్ లు ఆడాల్సి ఉంది. ఇందులో ఆరు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ వెళ్తుంది. శ్రీలంకతో టీమిండియా మరో టెస్ట్ ఆడాల్సి ఉంది. ఈ టెస్ట్ లో కూడా భారీ అంతరంతో గెలవాలి.
ప్రస్తుతం డబ్ల్యూటీసి పాయింట్ల పట్టికలో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా 77.50%తో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మరో నాలుగు లేదా ఐదు మ్యాచ్లు గెలిస్తే ఆస్ట్రేలియా ఫైనల్ వెళ్తుంది. ఆస్ట్రేలియా ఇంకా 13 మ్యాచ్లు ఆడాల్సి ఉంది.
సౌత్ ఆఫ్రికా 75% తో రెండవ స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా ఇంకా 10 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో ఆరు గెలిస్తే చాలు ఫైనల్ వెళ్ళిపోతుంది.
న్యూజిలాండ్ 72.2%తో మూడవ స్థానంలో కొనసాగుతోంది. మరో ఎనిమిది మ్యాచ్ల్లో నాలుగు గెలిస్తే చాలు.. న్యూజిలాండ్ ఫైనల్ వెళ్లిపోతుంది.
బంగ్లాదేశ్ 66.67%తో నాలుగో స్థానంలో ఉంది. ఈ జట్టు మరో ఎనిమిది మ్యాచ్లు ఆడాలి. అందులో ఆరు గెలిస్తే చాలు ఫైనల్ వెళ్ళిపోతుంది.
టీమిండియా 55.33%తో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. టీమిండియా మరో ఎనిమిది మ్యాచ్ల్లో ఆరింట్లో గెలవాలి. అప్పుడే ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.
ఇంగ్లాండ్ జట్టు 24.36 శాతంతో కొనసాగుతోంది. అయితే ఇంగ్లాండ్ జట్టు ఇప్పటికే డబ్ల్యూటీసి జాబితా నుంచి తప్పుకుంది.
శ్రీలంక జట్టు 41.67%తో కొనసాగుతోంది. ఈ జట్టు వచ్చే ఎనిమిది మ్యాచ్లలో.. ఐదింట్లో విజయం సాధించాలి.. రెండు డ్రా చేసుకోవాలి. అలా అయితేనే ఈ జట్టు ఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.ఇక పాకిస్తాన్ ఇప్పటికే ఈ జాబితా నుంచి తప్పుకుంది.