spot_img
Homeక్రీడలుక్రికెట్‌Ben Stokes Injury Update: కన్ను లొట్ట పోయింది.. మూతి వాచింది.. బెన్ స్టోక్స్ కు...

Ben Stokes Injury Update: కన్ను లొట్ట పోయింది.. మూతి వాచింది.. బెన్ స్టోక్స్ కు ఏమైంది?

Ben Stokes Injury Update: ఇంగ్లాండ్ జట్టు సారధి బెన్ స్టోక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ చేస్తాడు. వేగంగా పరుగులు తీస్తాడు. అదే సమయంలో వికెట్లు కూడా తన ఖాతాలో వేసుకుంటాడు. అందువల్లే అతడిని అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా పిలుస్తుంటారు.
బెన్ స్టోక్స్ ప్రస్తుతం గాయపడ్డాడు. ఆ ఫోటోలను అతడు తన సామాజిక మాధ్యమ ఖాతాల ద్వారా బయటపెట్టాడు. ఆ ఫోటోలలో స్టోక్స్ ను చూస్తుంటే హృదయ విదారకంగా ఉన్నాడు. అతడి కన్ను లొట్ట పోయింది. మూతి వాచిపోయింది.  గాయాలు కూడా ఎక్కువ అయ్యాయి.
తనకు గాయాలైన ఫోటోలను స్టోక్స్ సోషల్ మీడియాలో పెట్టాడు. అంతేకాదు.. “గాయాల సంగతి పక్కన పెడితే.. ఇప్పుడు బంతి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాల్సి ఉంటుందని” ఒక ఎమోజిని అతడు సూచికగా పేర్కొన్నాడు.
ఇంగ్లాండ్ మీడియాలో మాత్రం ఈ ఘటనపై విభిన్నమైన కథనాలు ప్రసారమవుతున్నాయి.. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అతడు గాయపడలేదని మీడియాలో వార్తలు వచ్చాయి. తన తోటి ప్లేయర్లతో అతడు పక్కనే నిలబడి ఉన్నాడని.. ఆ సమయంలో బంతిని అతడు గమనించలేదని.. అందువల్ల అది అతని ముఖం కుడి వైపు ప్రాంతంలో నేరుగా తాకిందని.. బంతి తాకుతున్నప్పుడు అతడిని బలంగా రాసుకుపోయి ఉంటుందని ఇంగ్లాండ్ మీడియా తన కథనాలలో చెబుతోంది. నిర్విరామమైన క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్.. ఇటీవల జరిగిన యాషెస్ సిరీస్ లో గాయపడ్డాడు. ఆ గాయం తగ్గకపోవడంతో ఇప్పటికి ఇబ్బంది పడుతూనే ఉన్నాడు.
ఇంగ్లాండ్ టెస్ట్ సారథి గతంలోనే పరిమిత ఓవర్ల క్రికెట్ కు శాశ్వత విరామం ప్రకటించాడు. కేవలం అతడు సుదీర్ఘ ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. త్వరలో న్యూజిలాండ్ జట్టుతో ఇంగ్లాండు జట్టు టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఇది జూన్ నెలలో మొదలవుతుంది. అప్పుడే బెన్ స్టోక్స్ ఆటను ఇంగ్లాండ్ అభిమానులు చూడగలుగుతారు. అప్పటివరకు అతడు గాయం నుంచి కోలుకోవాలని ఇంగ్లాండ్ అభిమానులు ప్రార్థిస్తున్నారు.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

google pixel 11 : గూగుల్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఏకంగా 4 ఫోన్లు.. ఇక రెడీ...

google pixel 11 : స్మార్ట్ ఫోన్ కొనాలని చూసేవారికి గూగుల్ కంపెనీ లేటేస్ట్ గా సూపర్ న్యూస్ తెచ్చింది. ఈ కంపెనీకి చెందిన ప్లాగ్ ఫిష్ విభాగంలో కొత్త ఫోన్ ను...
Bajaj Pulsar

bajaj pulsar : సీజన్ రాకముందే ఈ పల్సర్ బైక్ లతో పండుగ చేసుకోండి.. !

bajaj pulsar : మరో నెలలో పండుగల సీజన్ ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త వాహనాలు కొనాలని అనుకుంటారు. అయితే టూవీలర్స్ వినియోగదారులకు ఏ బైక్ కొనాలి? అన్న సందేహంలో...
hyperactive children

parenting tips : పిల్లలు.. డబ్బు.. ఈ విషయాల్లో జాగ్రత్త..

parenting tips : స్మార్ట్ మొబైల్ అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లల్లో సృజనాత్మకత పెరిగిపోతుంది. ఇలాంటి సమయంలో వారు కొత్త కొత్త వస్తువుల గురించి తెలుసుకుంటున్నారు. అయితే ప్రపంచంలో ఉన్న వస్తువులను పిల్లలు...
SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Oktelugu Epaper