Homeక్రీడలుక్రికెట్‌Lord's Ground Controversy: క్రికెట్ మక్కా కాదు.. చెత్త గ్రౌండు అని ఐసిసి తొక్కలా తీసి...

Lord’s Ground Controversy: క్రికెట్ మక్కా కాదు.. చెత్త గ్రౌండు అని ఐసిసి తొక్కలా తీసి పడేసింది

Lord’s Ground Controversy: గత ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఇండియన్ గ్రౌండ్ల మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా లార్డ్స్ మైదానాన్ని ఇండియన్ మైదానాలతో పోల్చి చూపుతూ రకరకాల విమర్శలు చేశారు. లార్డ్స్ మై దానం చాలా అందంగా ఉందని.. ఇండియన్ మైదానాలు పాన్ పరాగ్ ప్రకటనలకు అనుకూలంగా ఉంటాయని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో అందరూ కూడా ఇండియన్ […]

Lord’s Ground Controversy: గత ఏడాది ఇంగ్లాండ్ జట్టుతో టీమ్ ఇండియా టెస్ట్ సిరీస్ ఆడుతోంది. ఆ సమయంలో సోషల్ మీడియాలో ఇండియన్ గ్రౌండ్ల మీద విపరీతంగా ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా లార్డ్స్ మైదానాన్ని ఇండియన్ మైదానాలతో పోల్చి చూపుతూ రకరకాల విమర్శలు చేశారు. లార్డ్స్ మై దానం చాలా అందంగా ఉందని.. ఇండియన్ మైదానాలు పాన్ పరాగ్ ప్రకటనలకు అనుకూలంగా ఉంటాయని సోషల్ మీడియాలో కొంతమంది ప్రచారం చేయడం మొదలుపెట్టారు. దీంతో అందరూ కూడా ఇండియన్ క్రికెట్ మేనేజ్మెంట్ పై విమర్శలు చేశారు.

కాలం వేగంగా జరిగింది. ఏడాది గడిచే లోపే లార్డ్స్ మైదానం చెత్త జాబితాలోకి వెళ్లిపోయింది. ఈ మైదానం నిర్వహణ సరిగా లేదని.. అత్యంత చెత్తగా ఉందని ఐసిసి ఆరోపించింది. 200 సంవత్సరాల చరిత్ర ఈ గ్రౌండ్ కు ఉంది. అయితే ఈ గ్రౌండ్ నిర్వహణ దారుణంగా ఉండడంతో ఐసీసీ డి మెరిట్ పాయింట్ విధించింది. గతవారం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల మధ్య ఇక్కడ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో గ్రౌండ్ క్వాలిటీ ఏమాత్రం బాగోలేదని ఐసిసి ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండు రోజులైనా సరే బంతి బౌన్స్ తగ్గలేదని ఐసిసి నిపుణులు తమ పరిశీలన ద్వారా తెలుసుకున్నారు.

వాస్తవానికి ఒక మైదానం సరిగా లేకపోతే మెరిట్ పాయింట్ ఇస్తారు. మైదానం అత్యంత చెత్తగా ఉంటేనే రెండు డి మెరిట్ పాయింట్ లు ఇస్తారు. అంతకంటే దారుణంగా ఉంటే మూడు ఇస్తారు. ఇలా ఆరు డీ మెరిట్ పాయింట్ల గనుక ఇస్తే ఆ గ్రౌండ్ ఏడాది పాటు మ్యాచ్ లు నిర్వహించేందుకు ఐసీసీ ఒప్పుకోదు. లార్డ్స్ లాంటి మైదానానికి ఈ దుస్థితి రావడం నిజంగా ఆందోళన కలిగిస్తుంది. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇంత దారుణంగా మైదానం నిర్వహించడం పట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వాస్తవానికి లార్డ్స్ మైదానం విశాలంగా ఉంటుంది. అక్కడ అత్యంత అద్భుతంగా సౌకర్యాలు ఉంటాయి. క్రికెట్ చూసే అభిమానులు అక్కడ వాతావరణాన్ని నిత్యం ఆస్వాదిస్తూ ఉంటారు. అయితే ఈ మైదానం ఈ స్థాయిలో ఉండటం పట్ల అభిమానులు కూడా నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దలు పాఠాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికైనా ఇండియన్ మైదానాల మీద ఏడ్చి చచ్చే ఇంగ్లాండ్ అభిమానులు.. ఇకపై తమ లార్డ్స్ మైదానం గురించి చూసుకోవాలని భారత క్రికెట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper