Homeక్రీడలుక్రికెట్‌Ashirvad Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్నే తట్టుకోలేకపోతున్నాం.. అతడి తమ్ముడు అంతకుమించి.. ఏం చేశాడో తెలుసా..

Ashirvad Suryavanshi: వైభవ్ సూర్యవంశీ విధ్వంసాన్నే తట్టుకోలేకపోతున్నాం.. అతడి తమ్ముడు అంతకుమించి.. ఏం చేశాడో తెలుసా..

Ashirvad Suryavanshi: ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. తాజాగా శ్రీలంక ట్రై సిరీస్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మొత్తాన్ని షేక్ చేశాడు. బంతి పగిలి వక్కలు అయ్యేలాగా బ్యాటింగ్ చేశాడు.. సెంచరీ కోల్పోయాడు గాని.. ఇంకా కాసేపు ఉండి ఉంటే కచ్చితంగా టీమిండియా 500 స్కోర్ చేసేది.. సూర్య వంశీ విధ్వంసానికే కొలమానాలు లేకుండా పోయాయి.. అతని ఆట చూసి లెజెండరీ బౌలర్లు కూడా బౌలింగ్ వేయాలంటే భయపడుతున్నారు.. అతడే ఒక […]

Ashirvad Suryavanshi: ఐపీఎల్ లో ఆరెంజ్ క్యాప్ సాధించాడు. తాజాగా శ్రీలంక ట్రై సిరీస్లో ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. ముఖ్యంగా ఫైనల్ మ్యాచ్లో శ్రీలంక మొత్తాన్ని షేక్ చేశాడు. బంతి పగిలి వక్కలు అయ్యేలాగా బ్యాటింగ్ చేశాడు.. సెంచరీ కోల్పోయాడు గాని.. ఇంకా కాసేపు ఉండి ఉంటే కచ్చితంగా టీమిండియా 500 స్కోర్ చేసేది..

సూర్య వంశీ విధ్వంసానికే కొలమానాలు లేకుండా పోయాయి.. అతని ఆట చూసి లెజెండరీ బౌలర్లు కూడా బౌలింగ్ వేయాలంటే భయపడుతున్నారు.. అతడే ఒక డేంజర్ మ్యాన్ అనుకుంటే.. ఇప్పుడు అతని తమ్ముడు అంతకు మించిన స్థాయిలో ఆడుతున్నాడు. తన అన్న టైగర్ అయితే.. తాను అంతకుమించిన పరుగుల చీతా అని నిరూపిస్తున్నాడు.

వైభవ్ తమ్ముడు పేరు ఆశీర్వాద్.. ఆమధ్య ఒక మ్యాచ్లో అద్భుతమైన సెంచరీ చేశాడు.. కాకపోతే స్థిరంగా బ్యాటింగ్ చేశాడు. అన్న మాదిరిగా దూకుడుగా కాకుండా.. దృడచిత్తంతో ఆడాడు. అప్పట్లో ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో కూడా తనకు క్రికెటర్ కావాలని ఉందని మనసులో మాట చెప్పాడు. అయితే అది కేవలం మామూలుగా చెప్పిన మాట కాదు. ఆ మాట నిలబెట్టుకోవడానికి ఆశీర్వాద్ సూర్య వంశీ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా జరిగిన ఒక లోకల్ మ్యాచ్లో కేవలం 119 బంతుల్లోనే 19 ఫోర్లు, 6 సిక్సర్ల సహాయంతో 168 పరుగులు చేశాడు. తన అన్న సెంచరీలు మిస్ చేసుకుంటుంటే.. ఇతడు మాత్రం శతకాలు బాదేస్తూ ఉన్నాడు. తన అన్న తుఫాన్ లాగా బ్యాటింగ్ చేస్తుంటే.. ఇతడు ప్రత్యర్థి బౌలర్లకు సునామీని పరిచయం చేస్తున్నాడు. ఆశీర్వాద్ దూకుడు ఇలాగే ఉంటే త్వరలోనే అతడు ఐపిఎల్ కి వస్తాడని.. అన్నను మించిపోతాడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. తన తమ్ముడు సెంచరీ చేసిన విషయాన్ని సూర్య వంశీ సోషల్ మీడియాలో పంచుకున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper