Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Surya Vamshi: ఒకే ఒక్కడు వైభవ్ సూర్య వంశీ.. చరిత్ర సృష్టించాడు..

Vaibhav Surya Vamshi: ఒకే ఒక్కడు వైభవ్ సూర్య వంశీ.. చరిత్ర సృష్టించాడు..

Vaibhav Surya Vamshi: యువ భారత జట్టులో నిప్పురవ్వలాగా వెలిగిపోతున్నాడు వైభవ్ సూర్య వంశీ. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పై అంత గొప్పగా ఆడని వైభవ్ సూర్య వంశీ.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు. వైభవ్ సూర్య వంశీ […]

Vaibhav Surya Vamshi: యువ భారత జట్టులో నిప్పురవ్వలాగా వెలిగిపోతున్నాడు వైభవ్ సూర్య వంశీ. తనకు మాత్రమే సాధ్యమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో సంచలనాలు సృష్టిస్తున్నాడు.

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న అండర్ 19 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ జట్టు పై అంత గొప్పగా ఆడని వైభవ్ సూర్య వంశీ.. ఫైనల్ మ్యాచ్లో మాత్రం దుమ్మురేపాడు.

వైభవ్ సూర్య వంశీ ఫైనల్ మ్యాచ్లో చరిత్ర సృష్టించాడు.. తద్వారా అండర్ 19 ప్రపంచకప్ టోర్నమెంట్లో ఒకే ఒక్క ఆటగాడిగా నిలిచాడు. ఏ ఆటగాడు కూడా అందుకోలేని రికార్డును సృష్టించాడు.

ఐపీఎల్, యూత్ వన్డేలలో అత్యంత చిన్న వయసులో వేగవంతమైన సెంచరీలు చేసిన వైభవ్.. ప్రస్తుతం అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో పరుగుల వరద పారించాడు. ఈ టోర్నీ ప్రారంభించి దుమ్ము దుమారం మాదిరిగా ఇన్నింగ్స్ లు ఆడుతున్న అతడు.. ఫైనల్ మ్యాచ్లో కూడా అదే జోరు కొనసాగించాడు.

ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో ఓపెనర్ ఆరోన్ జార్జ్(9) అంతేగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. వైభవ్ సూర్య వంశీ తన స్థాయిని మరోసారి ప్రదర్శించాడు. మొదట్లో నిదానంగా ఆడిన అతడు.. ఆ తర్వాత జూలు విదిల్చిన సింహం మాదిరిగా రెచ్చిపోయాడు. 32 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన అతడు.. 55 బంతుల్లో సెంచరీ చేశాడు. 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 80 బంతుల్లో 175 పరుగులు చేశాడు. తొలి వికెట్ 20 పరుగుల వద్ద కోల్పోయిన ఇండియా.. రెండో వికెట్ కు ఏకంగా 142 భాగస్వామ్యం నమోదు చేసిందంటే.. వైభవ్ ఏ స్థాయిలో బ్యాటింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆయుష్ (53) హాఫ్ సెంచరీ చేశాడు. అయితే అతడు ఆడిన తర్వాత త్రివేదితో కలిసి వైభవ్ సూర్య వంశీ మూడో వికెట్ కు 89 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ఈ దశలో వైభవ్ సూర్య వంశీ ఔట్ అయ్యాడు. అతడు అవుట్ అయ్యే నాటికి టీమ్ ఇండియా స్కోర్ 251 పరుగులు. లమ్స్ డన్ బౌలింగ్లో అవుట్ అవ్వకుండా ఉండి ఉంటే సూర్య వంశీ ఏకంగా డబుల్ సెంచరీ చేసేవాడు.

అండర్ 19 వరల్డ్ కప్ లో హైయెస్ట్ సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ కొనసాగుతున్నాడు. అండర్ 19 వరల్డ్ కప్ లో 20 సిక్సర్లు కొట్టి వైభవ్ సూర్య వంశీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. సూర్య వంశీ తర్వాత 2022లో డోనాల్డ్ బ్రేవిస్ 18, 2016, 2018లో అలెన్ 18, బర్న్ హామ్ 2008లో 14, నికోలస్ పూరన్ 2014లో 14 సిక్సర్లు కొట్టారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper