Homeక్రీడలుక్రికెట్‌BCCI: బీసీసీఐ పెద్దలు పైకి ఏదో చెబుతున్నారు గాని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మట్టిలో కలిపే...

BCCI: బీసీసీఐ పెద్దలు పైకి ఏదో చెబుతున్నారు గాని.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డును మట్టిలో కలిపే ప్లాన్ ఆల్రెడీ మొదలైంది!

BCCI: క్రికెట్ ఇంగ్లాండ్ పుట్టింది. ఆస్ట్రేలియాలో అభివృద్ధి చెందింది. ఒకప్పుడు అమెరికాలో కూడా ఒక వెలుగు వెలిగింది. కానీ క్రికెట్ కు సరికొత్త భవిష్యత్తును మాత్రం ఇండియా అందించింది. దానిని ప్రపంచానికి సరికొత్త కమర్షియల్ గేమ్ గా పరిచయం చేసింది. ఇండియా చూపించిన తోవను ఇప్పుడు ప్రపంచ దేశాలు మొత్తం అనుసరిస్తున్నాయి. క్రికెట్ ను రకరకాలుగా తమ దేశాల్లో ఆడిస్తూ సొమ్ము చేసుకుంటున్నాయి. అంతేకాదు ప్రపంచానికి గొప్ప గొప్ప క్రికెటర్లను అందిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికొస్తే ఐపీఎల్ లాంటి అతిపెద్ద భారీ కమర్షియల్ గేమ్ ను నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆటగాళ్లపై కళ్ళు చెదిరే రేంజ్ లో కనక వర్షం కురిపిస్తోంది. కోట్లకు కోట్లు అందిస్తూ వారిని మిలియనీర్లను చేస్తోంది. ఇక అంతర్జాతీయ విభాగానికి వస్తే.. భారత్ ప్రపంచ క్రికెట్ మీద పెత్తనం సాగిస్తోంది. ఒకరకంగా పాకిస్తాన్ నుంచి మొదలు పెడితే బంగ్లాదేశ్ లాంటి క్రికెట్ బోర్డులకు ఆదాయం కూడా కల్పిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలో క్రికెట్ ఈ స్థాయిలో అభివృద్ధి చెందుతోంది అంటే దానికి ప్రధాన కారణం భారత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఐసీసీలో భారత్ ఒకటి ఒక ఎత్తు.. మిగతా యాజమాన్యాల మొత్తం ఒక ఎత్తు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Also Read: దిగ్వేష్ రాటి, అభిషేక్ శర్మ మధ్య జరిగింది ఉత్తుత్తి ఫైటింగేనా.. తెర వెనుక జరిగింది ఇదా?

వర్ధమాన దేశాలలో క్రికెట్ అభివృద్ధికి సహాయం చేయడంలో భారత్ ఇతోధికమైన పాత్ర పోషిస్తున్నది. అందువల్లే గొప్ప గొప్ప ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఇవాళ ఈ స్థాయిలో ఉందంటే దానికి ప్రధాన కారణం. భారత్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆసియాలో చాలా దేశాలకు భారత్ ఇదే విధంగా సహాయం చేసింది. చేస్తూనే ఉంది. అక్కడిదాకా ఎందుకు అంతటి పాకిస్తాన్ జట్టుకు కూడా ఈ స్థాయిలో ప్రకటనల ఆదాయం రావడానికి ప్రధాన కారణం భారతే.

ఇటీవల పహల్గాం దాడి తర్వాత భారత క్రికెట్ నియంత్రణ మండలి ధోరణి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు విషయంలో అత్యంత కఠిన వైఖరి అవలంబిస్తోంది. వాస్తవానికి ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి దీనికి బీజాలు పడినప్పటికీ.. ఇప్పుడు అవి మరింత పటిష్టమయ్యాయి. క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఆసియా కప్ టోర్నీలలో పాల్గొనకూడదని బీసీసీఐ ఇటీవల నిర్ణయించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను బిసిసిఐ బోర్డు సెక్రటరీ దేవజీద్ సైకిల్ ఖండించారు. దీనిపై బోర్డు ఎటువంటి చర్చ జరపలేదని వ్యాఖ్యానించారు. ఏసియా క్రికెట్ కౌన్సిల్ కు ఎటువంటి లెటర్స్ రాయలేదని పేర్కొన్నారు. ప్రస్తుతం బిసిసిఐ క్రిష్టి మొత్తం ఐపిఎల్, ఇంగ్లాండ్ సిరీస్ ల మీద మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. వాస్తవానికి పైకి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడినప్పటికీ.. తెర వెనుక మాత్రం గట్టి ప్లాన్ చేశారని తెలుస్తోంది.

జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో ఇప్పటికే చాలా విషయాలలో భారత క్రికెట్ నియంత్రణ మండలి తెగ తెంపులు చేసుకుంది. చాంపియన్స్ ట్రోఫీ విషయంలో తన మాట మాత్రమే వినే విధంగా ఐసీసీపై తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చింది. భారత జట్టును కేవలం దుబాయ్ వేదికగా హైబ్రిడ్ విధానంలో మ్యాచులు ఆడేలా చేసింది. తద్వారా పాకిస్తాన్ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. ఇక ఇప్పుడేమో పిసిఎల్ విషయంలో కూడా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయింది. భారత్ చేసిన దాడుల వల్ల ఫారిన్ ప్లేయర్లు పాకిస్తాన్లో అడుగుపెట్టాలంటేనే భయపడుతున్నారు.

ఒకవేళ ఐసీసీ పాకిస్తాన్లో ఏవైనా టోర్నీలు నిర్వహిస్తే భారత్ న్యూట్రల్ వేదిక మీద ఆడుతుంది. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు యాడ్ రెవెన్యూ ఉండదు. ఎందుకంటే మిగతా జట్లకు భారీగా స్పాన్సర్ చేయడానికి కంపెనీలు ముందుకు రావు. అప్పుడు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారీగా పెట్టుబడి పెట్టినప్పటికీ ఉపయోగము ఉండదు. ఇప్పటికే చాంపియన్స్ ట్రోఫీ వల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీవ్రంగా నష్టపోయింది. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఇప్పట్లో ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీ కూడా జరిపే స్థితిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లేదు. మరోవైపు ఏసియన్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గా పాక్ వ్యక్తి ఉన్నప్పటికీ.. అతడిని నామ మాత్ర పాత్రకు పరిమితం చేయాలని బీసీసీఐ పెద్దలు తెరవెనుక స్కెచ్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. వచ్చే రోజుల్లో దీనిపై మరింత స్పష్టత వస్తుందని సమాచారం. మొత్తంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డును ఆర్థికంగా మాత్రమే కాకుండా.. పలుకుబడి విషయంలో కూడా దెబ్బ కొట్టేలాగా.. మట్టిలో కలిపేసేలాగా బీసీసీఐ పెద్దలు తెర వెనుక ప్రయత్నాలు చేస్తున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular