War 2: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కలిసి నటించిన ‘వార్ 2′(War 2 Movie) మూవీ టీజర్ కాసేపటి క్రితమే విడుదలై సోషల్ మీడియా ని షేక్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ‘దేవర’ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రమిది. దీంతో అభిమానులు అంచనాలు భారీ రేంజ్ లో పెట్టుకున్నారు. పైగా హృతిక్ రోషన్ లాంటి సూపర్ స్టార్ తో తమ అభిమాన హీరో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అనే ఆనందం వారిలో ఎక్కువగా ఉంది. ఇకపోతే నేడు విడుదల చేసిన టీజర్ ని చూసి ఈ సినిమాలో ఈ ఇరువురి హీరోల క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి డీ కోడ్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇందులో ఎన్టీఆర్ మోసానికి గురి కాబడిన ఇండియన్ ఆర్మీ ఏజెంట్ గా కనిపించబోతున్నాడు అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ క్రమం లో ఎన్టీఆర్ కబీర్ టీం పై పగ పెంచుకున్నాడా?, లేకపోతే ఇండియా మీద పగ పెంచుకున్నాడా అనేది సినిమాని చూసి తెలుసుకోవాల్సి.
Also Read: జుట్టుపట్టుకొని కొడతారేయ్.. దిగ్వేష్ కు అభిషేక్ వార్నింగ్.. వైరల్ వీడియో
అయితే ఈ చిత్రం లో హృతిక్ రోషన్ కి జోడీగా కియారా అద్వానీ(Kiara Advani) నటించింది. ఆమెకు సంబంధించిన షాట్స్ కూడా టీజర్ లో ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఈ టీజర్ లో హీరోలిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ని ఆమె డామినేట్ చేసింది అనొచ్చు. అంత అందంగా కనిపించింది. హృతిక్ రోషన్ కి హీరోయిన్ ఉంది సరే, మరి ఎన్టీఆర్ కి ఈ చిత్రం లో హీరోయిన్ లేదా ? అనే అనుమానాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ‘వార్ 2’ వరకు ఎన్టీఆర్ కి హీరోయిన్ ఉండదట. కానీ ఆయన క్యారక్టర్ కి కొనసాగింపుగా తెరకెక్కించబోయే సోలో స్పై మూవీ లో హీరోయిన్ ఉంటుందని సమాచారం. మరి ఆ హీరోయిన్ ఎవరు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అంతే కాదు ఈ ‘వార్ 2’ లో ఎన్టీఆర్ కి, కియారా అద్వానీ క్యారక్టర్ కి మధ్య ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుందట.
ఈ సినిమా సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ మైండ్ బ్లాస్ట్ అయ్యేలా చేస్తుందని, కచ్చితంగా ఆ ట్విస్టులు సినిమాని మరో లెవెల్ కి తీసుకెళ్తామని అంటున్నారు విశ్లేషకులు. మరి ఆ ట్విస్టులు ఏంటో తెలియాలంటే ఆగష్టు 14 వరకు ఆగాల్సిందే. ఈ సినిమా విడుదల అయ్యే రోజునే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరో గా నటించిన ‘కూలీ’ కూడా విడుదల కానుంది. ఈ సినిమా పై కూడా అంచనాలు మామూలు రేంజ్ లో లేవు. ఎందుకంటే ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించాడు. అదే విధంగా ఇందులో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర ,అమీర్ ఖాన్ వంటి సూపర్ స్టార్స్ కూడా నటించారు కాబట్టి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున విడుదల అవుతున్నాయి కాబట్టి కచ్చితంగా ఎదో ఒక సినిమాకు ఓపెనింగ్స్ విషయంలో భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.