Homeఆధ్యాత్మికంToday 14 April 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు లక్కీ డే.....

Today 14 April 2026 Horoscope: ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు లక్కీ డే.. పదోన్నతులకు అవకాశం..

Today 14 April 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంగళవారం ద్వాదశ రాశులపై పూర్వాభాద్ర నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాసిన వారు ఈ రోజు అద్భుతమైన శుభ ఫలితాలను పొందుతారు. మరికొన్ని రాసిన వారు ప్రతికూలమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మేషం నుంచి మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారు ఈరోజు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. దీంతో అనుకున్న పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో సపోర్టు ఉండటంతో ప్రాజెక్టులను ఇన్ టైంలో పూర్తి చేస్తారు. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. ఆగిపోయిన పనులను పూర్తి చేస్తారు. వ్యాపారులకు ఈరోజు అన్ని కలిసి వస్తాయి. కొత్తగా పెట్టుబడులు పెడతారు.

వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని పనులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. రిస్కు తీసుకోవడం ఆపేయాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టి అవకాశం లేదు. కొందరు అనవసరంగా నిందలు వేస్తారు. ఇలాంటి సమయంలో ఓపిక అవసరం. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన ప్రాజెక్టులను పూర్తి చేస్తారు.

మిథున రాశి( మృగశిర 3,4 ): దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు పూజిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో అదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారులకు కుటుంబ సభ్యుల అండదండలు ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యులను సంప్రదించాలి. పిల్లల కెరీర్ పైకి ఎలుక నిర్ణయం తీసుకుంటారు. అనవసరపు వాదనలకు దూరంగా ఉండాలి. కొన్ని పనులు చేయడానికి ఇతరుల సహాయం అవసరం ఉంటుంది. స్నేహితుల నుంచి ధన సహాయం పొందుతారు.

సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని పనులు ఒకేసారి పూర్తవుతాయి. ఇంట్లో శుభకారమైన వాతావరణం ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.

కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : ఈ రాశి ఉద్యోగులకు ఈరోజు అద్భుతమైన అవకాశాలు అందుతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారాలు కొత్తగా పెట్టుబడులు పెడతారు. పెద్దల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి ఉద్యోగులు ఈరోజు పదోన్నతి విషయంలో శుభవార్తలు వింటారు. గతంలో ప్రారంభించిన పనులను ఇప్పుడు పూర్తి చేస్తారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయవద్దు. అనవసరపు వాదనలకు దిగకుండా ఉండాలి. సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెడతారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొంటే విజయం సాధిస్తారు.

వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. వ్యాపారులు కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. ఆగిపోయిన పనులను ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులకు ఇప్పుడు లాభాలు వస్తాయి. విద్యార్థులకు గురువుల మద్దతు ఉంటుంది.

ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వ్యాపారంలో ఈరోజు కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగులకు ప్రతికూలమైన వాతావరణం ఉండే అవకాశం ఉంది. అయితే గతంలో మొదలుపెట్టిన కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేస్తారు. విద్యార్థులకు అన్ని కలిసి వస్తాయి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పెట్టుబడుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు.

మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారు ఈరోజు కొత్త వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట్లో శుభకార్యం జరగడంతో బిజీగా ఉంటారు. కొత్తగా పెట్టుబడులు పెట్టాల్సి వస్తే ఇదే మంచి సమయం. ఉద్యోగులు శుభవార్తలు వింటారు.

కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారు ఈ రోజు అప్పులు చేయొద్దు. ఎందుకంటే ఇవి తీరడానికి చాలా సమయం పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు ఉండే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకు ప్రతికూలమైన వాతావరణం ఉంటుంది. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి పెద్దల సలహా తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈరోజు కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఎవరికి డబ్బు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. వ్యాపారులు ప్రత్యర్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొత్తగా పెట్టుబడును పెట్టేందుకు కొన్ని రోజులు వెయిట్ చేయడం మంచిది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి వస్తువులు కొనుగోలు చేస్తారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper