Today 13 August 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురువారం ద్వాదశరాసులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో కొన్ని రాసిన వారికి ఈరోజు అనుకోకుండా శుభయోగాలు ఉండనున్నాయి. మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,): ఈ రాశి వారికి ఈ రోజు సానుకూలమైన వాతావరణం ఉంటుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వ్యాపారులకు ఇదే మంచి సమయం. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపడకూడదు. పెద్దలను లేదా కుటుంబ సభ్యులను సంప్రదించి ముందుకు వెళ్లాలి. ఉద్యోగులకు మరో ధైర్యం పెరగడంతో తమ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలో పాల్గొనడానికి ఇదే మంచి సమయం.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి ఈ రోజు మెరుగుపడవచ్చు. స్నేహితుల సహాయంతో అప్పులను తీరుస్తారు. బంధువుల నుంచి శుభవార్తను అందుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులను నివారించాలి. కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మిథున రాశి( మృగశిర 3,4 ): ఈ రాశి వారు ఈ రోజు ముఖ్యమైన పనులు అన్ని పూర్తి చేస్తారు. ఎవరికైనా డబ్బు ఇచ్చే ముందు ఆలోచించాలి. బంధువులతో సంతోషంగా గడుపుతారు. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. గతంలో అనుకున్న కోరిక ఈరోజు నెరవేరుతుంది. జీవిత భాగస్వామి కోసం వస్తువులు కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : ఈ రాశి వారికి ఈ రోజు పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. ఎవరికైనా అప్పు ఇచ్చే ప్రయత్నం చేయొద్దు. ఇవి తిరిగి వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. పిల్లల కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంటారు. ఉద్యోగుల పనితీరుకు ప్రశంసలు అందుతాయి. నైపుణ్యాలను ప్రదర్శించడం ద్వారా ఉద్యోగులకు పదోన్నతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారికి ఈ రోజు కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వినోదాత్మక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్య రాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : శ్రావణం మొదటి రోజు కావడంతో ఈ రాశి వారు ఈ రోజు ఆర్థికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు షాపింగ్ చేస్తారు. అయితే ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు. దూర ప్రయాణాలు చేయాల్సివస్తుంది. ఇవి ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఇస్తాయి.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఆర్థికంగా ఊహించని ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. స్నేహితుల నుంచి ధన సహాయము అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. మాటతీరుతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. కొత్తగా పెట్టుబడును పెట్టడానికి ఇదే మంచి సమయం.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని పనులు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. ఆర్థిక ప్రణాళికలు విజయవంతం కావడంతో ధన సమస్య ఉండదు. స్నేహితుల నుంచి సహకారం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుంచి అండదండలు ఉంటాయి. వ్యాపారులు కొత్త భాగస్వాములను చేసుకోవడం ద్వారా వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) : ఈ రాశి వారు ఈ రోజు కొన్ని ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దలను సంప్రదించడం మంచిది. పిల్లల ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధికారుల సపోర్టు ఉంటుంది. దీంతో ముఖ్యమైన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపారులకు మెరుగైన లాభాలు ఉంటాయి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : ఈ రాశి వారికి ఈరోజు ఎలాంటి ఒత్తిడి లేకుండా గడిచిపోతుంది. అనవసరపు వివాదాల్లోకి తలదూర్చకుండా ఉండాలి. కొన్ని పనులు పూర్తి చేయడానికి తెలివిగా వ్యవహరిస్తారు. పెండింగ్ పల్లెలు పూర్తి చేస్తారు. ఉద్యోగులకు కార్యాలయాల్లో అధిక ప్రయోజనాలు ఉంటాయి. అదనపు ఆదాయాన్ని పొందేందుకు మార్గం ఏర్పడుతుంది.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాశి వారికి ఈ రోజు అన్ని శుభయోగాలే జరగనున్నాయి. వ్యాపారులకు అధిక లాభాలు ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల నుంచి సపోర్టు ఉంటుంది. కుటుంబ వాతావరణం సంతోషంగా గడుస్తుంది. స్నేహితుల నుంచి సహకారం ఉండడంతో కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేస్తారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : ఈ రాశి వారు ఈ రోజు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి. కొన్ని సమయాల్లో ప్రతికూలమైన వాతావరణ ఉండే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలోనే దైవారాధన చేయాలి. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు.