Tamil Nadu Politics : తమిళనాడులో ‘కరూర్’ తొక్కిసలాటతో రాజకీయం మొత్తం స్తంభించింది. టీవీకే విజయ్ యాత్రలు, ప్రచారం మానేశాడు. డీఎంకే, అన్నాడీఎంకే కూడా స్తబ్దుగా రాజకీయాలు చేయడం లేదు. తిరిగి మళ్లీ ఎన్నికల వార్తలు మొదలయ్యాయి. విజయ్ కొత్తగా రాజకీయం మొదలుపెట్టాడు. విజయ్ ప్రచారానికి జనం పోటెత్తారు. జనం మద్దతు చూస్తే ఈయనే తమిళనాడు నంబర్ 1 నేతగా మారుతారని అనుకున్నారు.
కరూర్ లో తొక్కిసలాట జరిగి జనం చనిపోవడంతో టీవీకే విజయ్ ప్రచారానికి తెరపడింది. కరూర్ లో జరిగే టప్పటికి ప్రతీవారికి డౌట్ వచ్చింది. కరూర్ సెంథిల్ బాలాజీ అడ్డ. దీంతో డీఎంకేనే ఈ తొక్కిసలాట కుట్ర జరిగిందన్న అనుమానాలు నెలకొన్నాయి.
ఇంగ్లీష్ చానెల్స్ అన్నీ విజయ్ దే తప్పు అన్నాయి. ఇక డీఎంకే తమిళనాడు మీడియాను మేనేజ్ చేసి విజయ్ దే తప్పు అని అభాసుపాలు చేసే కుట్ర చేస్తున్నాయి. సుప్రీంకోర్టు ఈ ఘటనపై దర్యాప్తు మొదలుపెట్టింది.
కరూర్ బాధితులకు చెక్కుల పంపిణీని తను కాకుండా వేరే వారితో ఇచ్చి పంపించేస్తున్నాడు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. విజయ్ స్వయంగా వెళ్లి బాధితులకు అందిస్తే బాగుండేది.
NDAకి ఇబ్బంది కరంగా మారిన అన్నాడీఎంకే కుమ్ములాటలపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.