Sardar Vallabhbhai Patel: ఉక్కుమనిషి వల్లభాయ్ పటేల్.. ఆయన జీవితం చూస్తుంటే.. ఎంతో మందికి ప్రేరణ ఇస్తుంది. మంచి న్యాయవాద వృత్తిలో అద్భుతంగా రాణిస్తూ డబ్బులు సంపాదిస్తున్న టైంలో గాంధీజీతో పరిచయం పటేల్ జీవితాన్ని మార్చేసింది.
సూటు బూటు వేసుకునే పటేల్ గాంధీజీ స్ఫూర్తితో రైతు వేషంలోకి మారారు. గాంధీజీ ఆలోచనలు అమలు చేసిన మొట్టమొదటి వ్యక్తి వల్లభాయ్ పటేల్. గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలకు పరీక్ష రాసి విజయవంతమైన నేతగా పటేల్ పేరొందారు. సత్యాగ్రహాన్ని, అహింసాయుత మార్గంలో పటేల్ చేసిన పోరాట అనన్య సమానం.
1928 బార్డోలీ సత్యగ్రహాన్ని విజయవంతం చేశాక పటేల్ నే కాంగ్రెస్ అధ్యక్షుడు కావాలన్న డిమాండ్ దేశమంతా వినిపించింది. అయినా గాంధీజీ పటేల్ ను కాదని నెహ్రూను కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేసింది. నాడు బ్రిటీష్ స్వాతంత్ర్యం వేళ కాంగ్రెస్ అధ్యక్షుడే దేశ ప్రధాని అవుతాడన్న వేళ కాంగ్రెస్ క్యాడర్ అంతా పటేల్ ను నామినేట్ చేస్తే గాంధీజీ మాత్రం నెహ్రూను ప్రధానిని చేసి పటేల్ ను తప్పుకోమన్నాడు. దీనికి మారు మాట్లాడకుండా తప్పుకొని గాంధీ మాటకు విలువనిచ్చిన వ్యక్తి పటేల్.
భారత నిర్మాత వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినం సందర్భంగా ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.