CM Vijay: రాజకీయాల్లో విమర్శలు , ప్రతి విమర్శలు సహజం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ ని దాటి విమర్శలు చేస్తే , కచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడిని కోట్లాది మంది అనుసరిస్తూ ఉంటారు. వీళ్ళు ప్రవర్తించే తీరు ప్రభావం కచ్చితంగా వీళ్ళని అనుసరించే అభిమానులు , కార్యకర్తలపై పడుతుంది. అప్పుడు హద్దులే లేకుండా ప్రవర్తించే తీవ్రమైన పరిణామాలు ఎదురు అవుతుంటాయి. ఇవి సమాజం లో అశాంతి వాతావరణాలు నెలకొల్పుతాయి. తమిళనాడు లో మొన్న అసెంబ్లీ ప్రతిపక్ష పార్టీ లీడర్, DMK పార్టీ నేత ఉదయ్ నిధి స్టాలిన్ ప్రముఖ హీరోయిన్ త్రిష పై అత్యంత నీచమైన కామెంట్స్ చేసాడు. ప్రస్తుతం తమిళనాడు , కర్ణాటక మధ్య కావేరి జలాల సమస్య నడుస్తోంది. ఇది నిన్న గాక మొన్న ఏర్పడిన సమస్య కాదు , ఎప్పటి నుండో రెండు రాష్ట్రాల మధ్య నడుస్తున్న సమస్య.
దీనిపై సీఎం విజయ్ మౌనం పాటిస్తున్నారు అంటూ స్టాలిన్ రీసెంట్ గా జరిగిన బహిరంగ సభలో మాట్లాడగా , DMK పార్టీ కార్యకర్తలు ‘త్రిష.. త్రిష’ అంటూ పెద్దగా అరుస్తారు. అప్పుడు స్టాలిన్ దానికి స్పందిస్తూ ‘మన రాష్ట్రానికి కావేరి నీరు వచ్చినా రాకపోయినా , త్రిష వద్దకు మాత్రం నీరు వస్తుంది, దాని గురించి అందరికీ తెలిసిందే’ అంటూ డబుల్ మీనింగ్ అర్థాలతో స్టాలిన్ అత్యంత నీచంగా మాట్లాడాడు. త్రిష పై ఆయన చేసిన కామెంట్స్ కి సోషల్ మీడియా లో తీవ్రమైన వ్యతిరేకత ఎదురైంది. సినీ నటులు కూడా స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. తక్షణమే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అయితే సీఎం విజయ్ మాత్రం తనదైన స్టైల్ లో యాక్షన్ తీసుకొని అందరినీ షాక్ కి గురయ్యేలా చేసాడు.
స్టాలిన్ ని కాసేపటి క్రితమే తమిళ నాడు పోలీసులు అరెస్ట్ చేసారు. దీంతో విజయ్ అందరికీ ఒక హెచ్చరికని జారీ చేసినట్టు అయ్యింది. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేస్తే , ఏకంగా ప్రతిపక్ష పార్టీ లీడర్ నే అరెస్ట్ చేయించాను , ఇక మామూలు లీడర్స్ పరిస్థితి ఏంటో ఒకసారి ఊహించుకోండి , కాబట్టి నోరు ఇకనైనా అదుపులో పెట్టుకోండి అంటూ విజయ్ ఈ అరెస్ట్ తో చెప్పకనే చెప్పాడు. త్రిష జోలికి వస్తే ఆమె క్షమించి మిమ్మల్ని వదిలేయొచ్చేమో కానీ , నేను మాత్రం వదలను అంటూ పరోక్షంగా ఈ అరెస్ట్ తో అందరినీ హెచ్చరించాడు విజయ్. స్టాలిన్ కి సినీ ఇండస్ట్రీ లో రెడ్ జైన్ట్ మూవీస్ అనే సంస్థ ఉంది. ఈ సంస్థ లో త్రిష అనేక సినిమాలు చేసింది. కురువి, మన్మధన్ అంబు లతో పాటు , గత ఏడాది ఈ సంస్థ నుండి విడుదలైన ‘తుగ్ లైఫ్’ చిత్రంలో కూడా త్రిష నటించింది. అలాంటి త్రిష పై స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం.