Udhayanidhi Stalin Arrest: త్రిష విజయ్ మధ్య ఏముందో అందరికీ తెలుసు. పైగా ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మొట్టమొదటిసారిగా అభినందించింది కూడా తనే.. తమిళనాడు ఎన్నికల ఫలితాలు వచ్చే రోజు నేరుగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి సన్నిధికి త్రిష వెళ్ళింది. స్వామివారి ప్రసాదాన్ని తీసుకొచ్చి నేరుగా విజయ్ కి అందించింది.
ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల తర్వాత.. ముందుగా ఆశీస్సులు తీసుకుంది త్రిష నుంచే. ఆ సమయంలో చేసుకున్న భార్య లేదు. కన్న పిల్లలు లేరు. త్రిష మాత్రమే ఆయనకు అన్నీ అయిపోయింది. దీనిని బట్టి వారిద్దరి మధ్య ఎంత గాఢమైన బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల విజయ్ పుట్టినరోజు జరుపుకున్నప్పుడు.. త్రిష పక్కనే ఉంది. పైగా ఆయనకు ఇష్టమైన కేకులు తీసుకొచ్చి ఆ సంబరాన్ని ఘనంగా జరిపింది.
ఏ మనిషి అయినా సరే ప్రేమ విషయంలో.. ప్రేయసి విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడు. ఒకవేళ ఆమెకు ఏదైనా ఆపద వస్తే మరో మాటకు తావులేకుండా దూసుకుపోతాడు. అవసరమైతే ఆ పరిణామానికి కారణమైన వ్యక్తుల మీద దాడికి తెగబడతాడు. దీనికి విజయ్ కూడా మినహాయింపు కాదు. పైగా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి.
అప్పట్లో సనాతన ధర్మం మీద ఉదయనిది స్టాలిన్ పిచ్చిపిచ్చిగా మాట్లాడాడు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడటం ఎవరు జీర్ణించుకోలేకపోయారు. చివరికి హైకోర్టు కూడా అతడికి గడ్డి పెట్టింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయినప్పటికీ ఉదయ నిధికి బుద్ధి రాలేదు. పైగా ముఖ్యమంత్రి విమర్శించే కారణంతో అతడి ఏకంగా త్రిషపై మతిలేని వ్యాఖ్యలు చేయడం విశేషం. ఈ నేపథ్యంలో అతడిని తంజావూర్లో పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై డీఎంకే ఆందోళనలు చేసినప్పటికీ.. విజయ్ ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. పైగా ఉదయనిది అరెస్టును తమిళనాడులో అన్ని పార్టీలు స్వాగతించాయి. డీఎంకే మాత్రం ఈ అరెస్టును కక్షపూరితమైన చర్యగా భావించింది. పార్టీ కార్యాలయానికి స్టాలిన్ వెళ్లారు. పరిస్థితిని సమీక్షించారు. కార్యకర్తలతో మాట్లాడారు. వాస్తవానికి ఉదయనిధికి ఎలా మాట్లాడాలో తెలియదు. పైగా అతడు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు. కొన్ని సినిమాలలో నాయకుడిగా.. కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అయినప్పటికీ ఇలాంటి బి గ్రేడ్ స్థాయి మాటలు మాట్లాడడం అతని వ్యక్తిత్వాన్ని సూచిస్తుంది.