Munugodu exit polls తెలుగులో ప్రముఖ మీడియాలన్నీ తాజాగా ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశాయి. మునుగోడులో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై సర్వే నిర్వహించాయి.. ఈ రెండు మూడు రోజుల్లో నిర్వహించిన సర్వేలో మునుగోడు ప్రజల అభిప్రాయాలను సేకరించింది. నియోజకవర్గంలోని 49320 మంది శాంపిల్స్ ను తాజాగా తెలుగు టాప్ న్యూస్ చానెల్ లో ఒకటి సేకరించింది. మండలానికి సగటున 3 వేల నుంచి 5వేల చొప్పున అభిప్రాయాలను సేకరించింది. ఈ సర్వేలో షాకింగ్ ఫలితం వచ్చింది.

వీ6 మీడియా సంస్థ బీజేపీ నేత గడ్డం వివేక్ వెంకటస్వామిదే. ఈయన ఇప్పుడు బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రచారం సహా చేరికల కమిటీలో ఉన్నారు. టీఆర్ఎస్ లో ఈయన గతంలో ఉండేవారు. పెద్దపల్లి ఎంపీగానూ గెలిచారు. అనంతరం కేసీఆర్ తో విభేదాలు వచ్చి బీజేపీలోచేరారు. బీజేపీ తరుఫున కీరోల్ పోషిస్తున్న ఈయన వీ6 ద్వారా, వెలుగు పత్రిక ద్వారా జనాల్లో బీజేపీ క్రేజ్ ను పెంచుతున్నారు. ఈ క్రమంలోనే మీడియా చేసిన సర్వేలో బీజేపీ వెనుకబడి ఉండడం చూస్తే ఈ సర్వే నిజంగానే నిజం అని చెప్పకతప్పదు. ఈ సర్వేలో బీజేపీ గెలుస్తుందని ఉంటే అందరూ అనుమానించేవారు కానీ ఓడిపోతుందని ఉండడంతో నిజమేనని అంగీకరించకతప్పదు.
మునుగోడులో బీజేపీకి షాక్ తప్పదని ఈ సర్వే తేల్చింది. మొత్తం దాదాపు 50వేల మంది అభిప్రాయాలు తీసుకొని చేసిన ఈ సర్వేలో టీఆర్ఎస్ కు దాదాపు 38.24 శాతం ఓటు బ్యాంకు వచ్చింది. రెండో స్థానంలో కాంగ్రెస్ కు 34.33 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీకి కేవలం 17.32 శాతం ఓట్లు మాత్రమే వస్తాయని సర్వే తేల్చింది. ఇక బీఎస్పీకి 3.59 శాతం ఓట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఇతరుకులకు 6.53 శాతం ఓట్లు వస్తాయని నిగ్గుతేల్చారు.

కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి వ్రతం చెడ్డా ఫలితం దక్కదని వీ6 సర్వే తేల్చింది. ఆయనపై వ్యతిరేకతనే బీజేపీ కొంప ముంచిందని.. టీఆర్ఎస్ గెలుపునకు దారితీస్తోందని సర్వేలో బయటపడింది. ఇక బీజేపీని తోసిరాజని కాంగ్రెస్ పార్టీ ఇక్కడ టీఆర్ఎస్ తో సమానంగా ఓట్లు సంపాదించుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీన్ని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. ఏరులైన పారిన డబ్బు, మద్యం కూడా మునుగోడు ప్రజల ఓట్లను ప్రభావితం చేయదని..టీఆర్ఎస్ ఓకే జనాలు ఓటు వేశారని ఈ సర్వేను బట్టి తెలుస్తోంది.
-వీ6 సర్వే నివేదిక ఇదీ.. క్లిక్ చేస్తే డౌన్ లోడ్ అవుతుంది..