Bigg Boss 6 Telugu- Geetu vs Adi Reddy: ఈ వారం బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కు ఎంత ఆసక్తికరంగా సవుతుందో మన అందరికి తెలిసిందే..హౌస్ మేట్స్ అందరూ చెలరేగిపోయి ఆడడం వల్ల ఈ వారం టీఆర్ఫీ రేటింగ్స్ కూడా దుమ్ము లేచిపోయింది..ఈ కెప్టెన్సీ టాస్కులో కూడా గీతూ వల్ల బోలెడంత కంటేంటీ వచ్చిన విషయం మన అందరికి తెలిసిందే..బాలాదిత్య సిగరెట్లు మరియు లైటర్ దొంగతనం చేసి అతని బలహీనతతో కబడ్డీ ఆడుకుంది..బాలాదిత్య కి సిగరెట్లు అంటే ఇంత పిచ్చి ఉందా అని ప్రేక్షకులకు అందరికి అర్థం అయ్యేలా చేసింది..అది పక్కన పెడితే ఇప్పుడు ఆది రెడ్డి తో కూడా కయ్యానికి సిద్ధమైపోయింది గీతూ.

హౌస్ లోకి వచ్చిన మొదటి రోజు నుండి నేటి వరుకు గీతూ అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నది కేవలం ఆది రెడ్డి తోనే..తన వ్యక్తిగత విషయాలు ఎవ్వరితో పంచుకొని గీతూ ఆది రెడ్డి తో ఎన్నో విషయాలను పంచుకుంది..ఇదంతా మనం చూస్తూనే ఉన్నాము..ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల చేసిన ప్రోమో చూస్తుంటే ఈరోజు ఆది రెడ్డి తో కూడా పెద్ద గొడవ పెట్టుకొని కంటెంట్ ఇచేలా ఉంది గీతూ.
ఇక అసలు విషయానికి వస్తే గీతూ మరోసారి తాను వరస్ట్ ప్లేయర్ అనేది చెప్పకనే చెప్పింది..బ్రేక్ టైం లో స్టోర్ రూమ్ లో పెట్టి ఉన్న ఆది రెడ్డి టీ షర్ట్ ని దొంగతనం చేసి అతని టీ షర్ట్ మీద ఉన్న లైఫ్ స్ట్రిప్స్ అన్నిటిని సొంతం చేసుకుంది..ఇది గమనించిన ఆది రెడ్డి గీతూ వద్దకి వస్తూ ‘అమ్మా గీతూ..బ్రేక్ టైం లో ఇలాంటి పనులు చెయ్యడం బిగ్ బాస్ రూల్స్ కి విరుద్ధం’ అంటాడు..అప్పుడు గీతూ ‘నేనేమి చెయ్యలేదే’ అని సమాధానం ఇస్తుంది..అప్పుడు ఫైమా తో ‘గీతూ నా జోలికి వచ్చింది..ఇక నా విశ్వరూపం ఏమిటో తనకి చూపిస్తాను’ అని అంటాడు..ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరగబోతుందో చూడాలి.

టాస్కు వరుకు వస్తే గీతూ అన్ని హద్దులను దాటేసి బంధాలు మరియు అనుబంధాలకు కూడా తావు ఇవ్వకుండా రాక్షసం గా ఆడేస్తుంది..గత వారం అలా రూల్స్ కి విరుద్ధంగా ఆడినందుకు నాగార్జున గారి నుండి ఫుల్ కోటింగ్ పడింది..ఇక ఈ వారం కూడా ఆమెకి నాగార్జున చేతిలో బడితపూజ తప్పేలా లేదు.