Janmat polls : దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ సర్వే సంస్థలు హల్ చల్ చేస్తున్నాయి. సర్వేలను చేపడుతున్నాయి. వాటి ఫలితాలను ప్రకటిస్తున్నాయి. తాజాగా మరో సర్వే బయటకు వచ్చింది. జన్మత్ పోల్ సంస్థ దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ స్థానాల్లో సర్వే చేపట్టింది. ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది. ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఉందని ప్రశ్నించింది. ఆ సర్వే నివేదికలను వెల్లడించింది.కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం వస్తుందని తేల్చి చెప్పింది. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి బలం పుంజుకోలేదని తేల్చింది. ప్రాంతీయ పార్టీల హవా గట్టిగానే ఉంటుందని చెప్పుకొచ్చింది.
జాతీయస్థాయిలో 543 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ 323 నుంచి 326 స్థానాల వరకు దక్కించుకునే ఛాన్స్ ఉందని జన్మత్ ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ 44 నుంచి 46 స్థానాలు మాత్రమే దక్కించుకోనుందని తేలింది. ఇక ప్రాంతీయ పార్టీల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలను గెలుచుకోనుందని స్పష్టం చేసింది. ఆ పార్టీకి 21 నుంచి 23 లోక్ సభ స్థానాలు వచ్చే అవకాశం ఉందని తేల్చింది. ఇక ఢిల్లీలో అమ్ ఆద్మీ పార్టీ ఏడు నుంచి ఎనిమిది లోక్సభ స్థానాలు గెలిచే అవకాశాలున్నట్లు తేలింది. ఒడిస్సాలో అధికార బీజేడీ 10 నుంచి 11 లోక్సభ స్థానాల దక్కించుకుంటుందని కూడా తేల్చి చెప్పింది.
అయితే దేశవ్యాప్తంగా ఎన్డీఏ హవా స్పష్టంగా కనిపించగా.. ఏపీలో మాత్రం వెనుకబడినట్లు ఈ సర్వే తెలిసింది. టిడిపి, జనసేన, బిజెపి కూటమికి కేవలం ఐదు నుంచి ఏడు లోక్సభ స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఈ సర్వే తేల్చింది. ఈ మూడు పార్టీలు కూటమి కట్టినా.. జగన్ నేతృత్వంలోని వైసీపీని అధికారం నుంచి దూరం చేయలేరని కూడా తేల్చి చెప్పింది. ప్రతి పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటాయి. ఈ లెక్కన అధికార వైసిపికి 105 వరకు స్థానాలు దక్కే అవకాశం ఉందని ఈ సర్వే ద్వారా తేలింది. అయితే గత కొద్ది నెలలుగా జన్మత్ సంస్థ వరుసగా సర్వేలను ప్రకటిస్తూ వస్తోంది. అయితే గతం కంటే వైసీపీకి లోక్సభ స్థానాలుతగ్గడం విశేషం. అయితే ఈ సర్వేను విపక్షాలు పెద్దగా పరిగణలోకి తీసుకోవడం లేదు. వైసీపీ శ్రేణులు మాత్రం వాస్తవానికి దగ్గరగా ఈ సర్వే ఉందని సమర్థిస్తున్నాయి. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి.
loksabha election 2024
Total 543 seats
Ground report todayBJP =323-326
Congress =44-46
YSRCP=16-18
TMC=21-23
AAP=07-08
BJD =10-11
TDP+ =05-07
#LoksabhaElections2024— Janmat polls (@Janmatpolls) March 23, 2024