WhatsApp:వాట్సాప్ అదిరిపోయే ఫీచర్స్ తీసుకొస్తోంది. యూజర్లకు ఎన్నో ప్రయోజనాలు కలిగించేందుకు ముందుకొస్తోంది. ఇందులో భాగంగా ఇక మీదట ఆన్ లైన్ లో ఉన్నా హైడ్ చేసుకోవడం సులభమవుతుంది. ఆన్ లైన్ లో ఉన్నా ఎదుటి వారికి చూపించదు. వాట్సాప్ సరికొత్త మెసేజ్ రియాక్షన్ ఫీచర్ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇందుకు ఆరు ఎమోజీలు ఉండటం గమనార్హం. వాట్సాప్ సరికొత్త ఫీచర్స్ తో ముందుకు వెళ్తోంది. వాట్సాప్ లో ఏవైనా ఫొటోలు పంపించేందుకు కూడా పలు మార్పులు చేస్తోంది. మీడియా ఎడిటర్ ఆప్షన్ అందుబాటులోకి తెస్తోంది. ఇందులో టూల్స్ కు అదనంగా బ్లర్ టూల్ ను తీసుకురానుంది. యూజర్లు ఫొటోలను బ్లర్ చేసి పంపుకోవచ్చు.

యూజర్ల కోసం పలు రకాల ఫీచర్లు వినియోగంలోకి తీసుకువస్తోంది. ఇక మీదట వాట్సాప్ లో ఒకేసారి 32 మందికి వాట్సాప్ కాల్ చేసుకోవచ్చు. ఈ మేరకు ఫీచర్ ను యాజమాన్యం తీసుకొచ్చింది. ఇంకా ఒకేసారి గ్రూపుల్లో 1024 మందిని యాడ్ చేసుకోవచ్చు. ఈ సదుపాయాలతో వాట్సాప్ ఎన్నో అద్భుతాలు చేయనుంది. ఎమోజీల రియాక్షన్లు, 2జీబీ ఫైల్స్ షేరింగ్, సందేశాలను అడ్మిన్, డిలీట్ చేయడం వంటి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో వినియోగదారులకు మరింత సౌకర్యవంతంగా మారనుంది.
గతంలో కొంతమందికే ఉన్న ఫీచర్లు ప్రస్తుతం అందరికి అందుబాటులోకి రానున్నాయి. ఓ సారి మీ వాట్సాప్ చెక్ చేసుకుని ప్రస్తుతం ఇస్తున్న ఫీచర్లు వచ్చాయో లేదో చూసుకోండి. వాట్సాప్ యాజమాన్యం తీసుకొస్తున్న పద్ధతులకు అందరు ఫిదా అవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో వాట్సాప్ కే ప్రాధాన్యం ఏర్పడింది. సులువుగా అర్థమయ్యే రీతిలో వాట్సాప్ కొత్త కొత్త విధానాలు తీసుకొస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో వాట్సాప్ ను అందరు విధిగా ఉపయోగించుకుని తమ పనులు చక్క దిద్దుకుంటున్నారు.

ప్రస్తుత కాలంలో సామాజిక మాధ్యమాలకు భలే క్రేజీ ఏర్పడింది. ఇందులో ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ లు ప్రధానంగా ఉన్నాయి. ఇందులో కూడా వాట్సాప్ నే అందరు విరివిగా వాడుతున్నారు. అందరికి తేలికగా అర్థమయ్యే భాషలో వాట్సాప్ తన ఫీచర్లు అందుబాటులోకి తెస్తోంది. దీంతో అందరు వాట్సాప్ వాడుకుని తమ సందేశాలను పంపుకుంటున్నారు. ఏదైనా చిటికెలో పంపించుకునే వెసులుబాటు కల్పించడంతో వినియోగదారులకు వాట్సాప్ బాగా దగ్గరయింది.