Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan : కష్టం విలువ తెలిసినవాడు.. రైతు గోస ఆలకించినవాడు.. మన పవన్

Pawan Kalyan : కష్టం విలువ తెలిసినవాడు.. రైతు గోస ఆలకించినవాడు.. మన పవన్

Pawan Kalyan : అకాల వర్షాల ధాటికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. పంట చేతికందే సమయానికి వర్షాలు ముంచెత్తడం అన్నదాత పాలిట శాపంగా పరిణమించింది. ఆదుకోవాల్సి ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న జనసేన అధినేత రైతుల గోస వినేందుకు కదిలారు. నీటిలో తడిచి ఇంకా కళ్లాల్లోనే ఉన్న పంటను చూసి చలించిపోయారు. రైతుల ఆక్రందనలు విని ఆవేదన లోనయ్యారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తూర్పు గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. రాజమండ్రి విమానాశ్రయం చేరుకున్న నేరుగా బొమ్మూరు, రాజవోలు మీదుగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం ఆవలో పర్యటించారు. అక్కడ నుంచి కడియం, అవిడి, పి.గన్నవరం నియోజకవర్గం రాజుపాలెంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పవన్ కల్యాణ్ తో మాట్లాడాలని రైతులు ఎగబడుతూ ధాన్యాన్ని తొక్కుతుంటే, అది చూసిన ఆయన వెంటనే అక్కడి నుంచి వైదొలగాలని సూచించారు. అక్కడే గుట్టలుగా పోసి ఉన్న తడిసిన ధాన్యాన్ని చూసి రైతులతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో హడావిడిగా కొనుగోలు చేసి లారీల్లో లోడ్ చేసి ఉంచిన ధాన్యాన్ని రైతులు చూపించారు. మొలకలు వచ్చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.

https://twitter.com/gopal_karneedi/status/1656221494760861696?s=20

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ రైతులతో ముఖాముఖి మాట్లాడారు. వారి కష్టాలు అడిగి తెలుసుకున్నారు. ‘‘ఇళ్లలో ఆడవారి పుస్తెలు తాకట్టు పెట్టి పంటలు పండించాం.. రూ.35 వేల నుంచి రూ.45 వేల వరకు పెట్టుబడి పెడితే వర్షాల వల్ల పంట పూర్తిగా దెబ్బతింది” అని ఓ రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. వడ్డీలు తెచ్చి మరీ పెట్టుబడి పెట్టామని తీవ్రంగా నష్టపోయామని అన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని వాపోయారు. “పంట నష్టం వాటిల్లితే అధికారుల నుంచి కనీసం పలకరింపు లేదని బాధను వెళ్లగక్కారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన రూ. 3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. వర్షాలు, వరదలు వచ్చి రైతులు కష్టాల్లో ఉంటే ఆ డబ్బు ఎక్కడ దాచుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాలకు ఎకరాకి 20 బస్తాలు పైనే నష్టపోయారని ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని అన్నారు. మద్దతు ధర రూ.1530 ఉంటే మిల్లర్ల ద్వారా కొనుగోలు చేస్తూ తరుగు పేరిట బస్తాకి రూ. 200 వరకు కోత పెడుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని పేర్కొన్నారు. మొలక వచ్చిన ధాన్యం, తడిసిన ధాన్యాన్ని అస్సలు కొనడం లేదని చెప్పారు. రైతుల కష్టాలు ఓపికగా ఆలకించిన  పవన్ కళ్యాణ్   పండించిన ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు జనసేన పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని భరోసా ఇచ్చారు.

SHAIK SADIQ
SHAIK SADIQhttps://oktelugu.com/
SHAIK SADIQ is a senior content writer who writes articles on AP Politics, General. He has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Politics. He Contributes Politics and General News. He has more than 10 years experience in Journalism.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper