Puri Jagannadh : దర్శకుడు పూరి జగన్నాధ్ సొంతూరు నర్సీపట్నంలో సందడి చేశారు. భార్య లావణ్యతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బంధు మిత్రులతో ఆయన కనిపించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. అయితే తన పార్ట్నర్ ఛార్మికి హ్యాండ్ ఇచ్చిన పూరి భార్య చెంతకు చేరాడని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొన్నేళ్లుగా పూరి-ఛార్మి సన్నిహితంగా ఉంటున్న విషయం తెలిసిందే. పూరి కనెక్ట్స్ బ్యానర్ స్థాపించి ఇద్దరూ చిత్రాలు నిర్మిస్తున్నారు. ఈ బ్యానర్ లో అనేక చిత్రాలు తెరకెక్కాయి. నిర్మాతగా మారాక ఛార్మి నటనకు గుడ్ బై చెప్పేశారు. ఛార్మితో పూరి సహజీవనం చేస్తున్నారనే ఓ వాదన ఉంది.
ఈ వార్తలను ఆయన ఖండించారు. ఛార్మితో నాకుంది అలాంటి బంధం అయితే ఎప్పుడో బోర్ కొట్టేసేది. మాది గొప్ప స్నేహం. అందుకే ఇన్నేళ్ళుగా కలిసున్నామని ఆయన అన్నారు. అయితే ఛార్మి కారణంగా భార్యను పూరి నిర్లక్ష్యం చేస్తున్నాడని పరిశ్రమలో టాక్ నడుస్తుంది. ఇదే విషయాన్ని నిర్మాత బండ్ల గణేష్ చోర్ బజార్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో పరోక్షంగా చెప్పారు. వ్యాంపుల కోసం నమ్మి వచ్చిన భార్యకు, కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడన్నట్లు మాట్లాడాడు.
కాగా పూరి-ఛార్మి నిర్మించిన లేటెస్ట్ మూవీ లైగర్ డిజాస్టర్ అయ్యింది. ఈ మూవీ విషయంలో వీరిద్దరూ అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. పెద్దగా బయట కనిపించడం మానేశారు. ఛార్మి అయితే సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్ లో కలిసి కనిపించారు. పూరి స్క్రిప్ట్స్ పట్టుకుని హీరోల వేటలో ఉన్నారు. అధికారికంగా ఆయన సినిమా ప్రకటించలేదు.
జీవితంలో ఒడిదుడుకులు ఎదురవుతుండగా పూరి జగన్నాథ్, ఛార్మి మధ్య మనస్పర్థలు తలెత్తి ఉండవచ్చు. ఛార్మి, పూరి ఎవరి దారి వారు చూసుకుని ఉండొచ్చు. అందుకే పూరి మరలా భార్య వద్దకు చేరాడని కొందరు అంచనా వేస్తున్నారు. కొందరైతే ఐరన్ లెగ్ ఛార్మిని వదిలేశావా అన్నా? అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక లావణ్యను పూరి జగన్నాధ్ ప్రేమ వివాహం చేసుకోవడం విశేషం. అప్పటికి ఆయన దర్శకుడిగా నిలదొక్కుకోలేదు. జేబులో రూపాయి లేని పూరిని నమ్మి పెద్దలను ఎదిరించి గుడిలో పెళ్లి చేసుకుంది లావణ్య,