spot_img
Homeజాతీయ వార్తలుChandrababu KCR: చంద్రబాబు స్ఫూర్తితో కేసీఆర్ ఆ పని.. ఏమవుతుందో ఇక..

Chandrababu KCR: చంద్రబాబు స్ఫూర్తితో కేసీఆర్ ఆ పని.. ఏమవుతుందో ఇక..

KCR following Chandrababu’s tactics : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు.. తెలంగాణ విభజన తర్వాత ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌కు ఒకసారి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబునాయుడి బాటలోనే ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పయనిస్తున్నారు. తెలుగదేశం పార్టీలోనే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కేసీఆర్‌.. పాలనలోనూ తన రాజకీయ గురువు చంద్రబాబునే చాలావరకు అనుసరిస్తున్నారు. పార్టీ వ్యవహారాలు చక్కదిద్దడంలోనూ బాబు స్ఫూర్తితోనే కేసీఆర్‌ పనిచేస్తున్నారు. 2018 వరకు కేంద్రంతో సఖ్యతగా ఉంటూ వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకడు.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో విభేదించారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కూడా చంద్రబాబు బాటలోనే పయనిస్తున్నారు. 2020 హుజూరాబాద్‌ ఉప ఎన్నికల ముందు వరకు కేంద్రలోని బీజేపీతో సఖ్యతగా ఉంటూ వచ్చిన కేసీఆర్‌.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ఫలితాలు తనకు వ్యతిరేకంగా రావడంతో అప్పటి నుంచి కేంద్రంతో ఢీ అంటే ఢీ అంటున్నారు.

KCR-Chandrababu

-చంద్రబాబు వ్యూహం కేసీఆర్ కైనా పని చేస్తుందా?
2018 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కలిసి ఉన్న చంద్రబాబు.. 2019 ఎన్నికలకు ముందు కమలనాథులతో కయ్యానికి దిగారు. చావో రేవో అంటూ సవాల్‌ విసిరారు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పుతా అంటూ పరుగులు పెట్టారు. జాతీయ, ప్రాంతీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణ చేశారు. కానీ ఆ వ్యూహం కాస్తా బెడిసి కొట్టింది. మరి ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం ఇదే వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.. అయితే అక్కడ చంద్రబాబుకు ఓటమి ఎదురుకాగా.. ఇక్కడ కేసీఆర్‌ ప్రస్తుతం పన్నుతున్న వ్యూహం సఫలీకృతతం అవుతుందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలు.. భాష ఒక్కటైనా యాస వేరు.. సంస్కకృతి సాంప్రదాయాలు భిన్నం.. రాజకీయ పరిపక్వతలో దేశంలో ఎవరికి అందని తెలుగువారి నాడిని పట్టుకునేందుకు చేస్తున్న రాజకీయ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుంది.

-కేసీఆర్‌ దూకుడు కలిసోస్తుందా..?
సరిగా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలో బలంగా ఉన్న వైసీపీని పక్కనపెట్టేందుకు చంద్రబాబు బీజేపీతో కయ్యానికి కాలుదువ్వారు. ఈ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు పొత్తుపెట్టుకుని పోరులో దిగాయి. టీడీపీ 102 చోట్ల విజయం సాధించగా బీజేపీ 4 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ రెండు ఎంపీ సీట్లు సాధించింది. సుమారు మూడేళ్ల పాటు ఎన్డీలో ఉన్న చంద్రబాబు అకస్మాతుగా కూటమి నుంచి బయటకు వచ్చి నరేంద్రమోదీపై యుద్ధం ప్రకటించారు. బీజేపీ ఓటమే తన లక్ష్యమని ముందుకు సాగాడు. అయితే, ఈ వ్యూహం కాస్తా బెడిసి కొట్టింది. 2019 ఎన్నికల్లో చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు.

ఇక్కడ తెలంగాణలో ఇప్పటి వరకు అంతర్గతంగా బీజేపీతో మంచి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సైతం అదేస్థాయిలో విరుచుకుపడుతున్నారు. నోట్ల రద్దు విషయంలో సైతం మోదీపై విమర్శలు చేసిన కేసీఆర్‌ ఆ తర్వాత వెనుకంజ వేశారు. రైతు చట్టాల విషయంలో విమర్శలు చేసినప్పటికీ రైతుల ఆందోళనలో అంతగా పాల్గొనలేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో ఉన్న అంతర్గత సంబంధాలు కారణంగానే కేసీఆర్‌ ఇలా వ్యవహరించాడనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇప్పుడు తన టార్గెట్‌ బీజేపీ అంటూ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. ఏకంగా నరేంద్రమోదీ కేంద్రంగా చేసుకుని విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు. జాతీయ స్థాయిలో వివిధ ప్రాంతీయ పార్టీల నాయకులను కలుస్తూ బీజేపీని గద్దె దించేందుకు మూడో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేయాలని ముందుకు సాగుతున్నాడు. అయితే, ఈ వ్యూహం ఎంత వరకు ఫలిస్తుందనే విషయం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలో చర్చనీయాంశం అయింది.

-బలమైన ప్రత్యర్థిని వదిలి..
2019 ఎన్నికల ముందు ఏపీలో వైఎస్సార్‌సీపీ బలమైన ప్రతిపక్షంగా ఉంది. వైసీపీ నాయకుడు వైఎస్‌.జగన్ పాదయాత్రతో జనంలోని వెళ్లారు. అయితే స్థానికంగా బలంగా ఉన్న పార్టీని వదిలేసి బీజేపీపై పోరు చేయడం ద్వారా ప్రతిపక్షాలను ఇరుకున పెట్టాలనే భావనలోకి చంద్రబాబు వెళ్లారనే విమర్శలు వచ్చాయి. ఈ వ్యూహం కాస్తా విఫలం అయింది.

ప్రస్తుతం తెలంగాణ విషయానికి వస్తే ఆది నుంచి తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉంది. అయితే పార్టీ ఫిరాయింపుల ద్వారా కాంగ్రెస్‌ పార్టీని ఇప్పటికే బలహీన పరిచిన కేసీఆర్, ఇటీవల జరిగిన రెండు ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో తన ప్రత్యర్థి బీజేపీ అన్నట్లుగానే ఎన్నికల వ్యూహంలోకి వెళుతున్నట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ పార్టీ అసలు తెలంగాణలో లేనట్లు వ్యవహరించడంతోపాటు ఇప్పటి వరకు రాహుల్, సోనియాగాంధీలపై విమర్శలు చేసిన కేసీఆర్‌ వారికి సానుకూలంగా మాట్లాడటం, బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

అయితే ఇటీవల కొన్ని సర్వేలలో కాంగ్రెస్‌ పార్టీ మరింతగా పుంజుకున్నట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే ఇందుకు భిన్నంగా కేసీఆర్‌ తన ప్రత్యర్థిగా బీజేపీని ఎంచుకోవడం చూస్తే తన వ్యూహం ద్వారా కాంగ్రెస్‌ పార్టీని మరింత బలహీనం చేసి మరోమారు విజయం సాధించాలనే దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయంగా చైతన్యవంతులైన తెలంగాణ సమాజం ఎలా తీర్పు ఇస్తుందో ఎన్నికల వరకు వేచి చూడాలి.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper