spot_img
Homeటాప్ స్టోరీస్Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : హరీష్ రావును ఎందుకు తొక్కేస్తున్నారు

Harish Rao : భారత రాష్ట్ర సమితిలో ఒకప్పుడు హరీష్ రావు నెంబర్ 2 గా ఉండేవారు. ఎప్పుడైతే కేటీఆర్ అమెరికా నుంచి వచ్చి.. గులాబీ పార్టీ కండువా కప్పుకున్నారో.. అప్పుడే పరిస్థితి మారిపోయింది. భారత రాష్ట్ర సమితిలో హరీష్ రావు పాత్ర తగ్గిపోయింది. ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన ఆయనకు పార్టీ లో ఒకప్పటి మాదిరిగా ఇప్పుడు స్థానం లేదు. అప్పట్లో ఈటల రాజేందర్ ను బయటికి పంపించిన తర్వాత హరీష్ రావుకు వైద్య ఆరోగ్యశాఖ ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి రెండవసారి అధికారాన్ని దక్కించుకున్నప్పుడు హరీష్ రావుకు వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు. చాలా రోజుల తర్వాత ఆయనకు కెసిఆర్ పదవి ఇచ్చారు. దీనిపై రకరకాల ఊహాగానాలు బయటికి వచ్చాయి.

హరీష్ రావు పాదయాత్ర

ఇటీవల హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహించారు. ఆయన పాదయాత్ర 15 కిలోమీటర్ల మేర సాగింది. ఈ పాదయాత్ర వల్ల తెలంగాణ రాజకీయాలలో హరీష్ రావు సరికొత్త చర్చకు దారి తీశారు. రాష్ట్రం మొత్తం ఆయన వైపు తిరిగింది. హరీష్ రావుకు బలమైన కేడర్ ఉంటుంది. కార్యకర్తలు కూడా ఆయన వెంట ఉంటారు. అందువల్లే కదా సిద్దిపేట నియోజకవర్గంలో ప్రతి ఎన్నికల్లో తన మెజారిటీని పెంచుకుంటూ పోతున్నారు. అటువంటి నాయకుడిని భారత రాష్ట్ర సమితిలో కొంతమంది ఇబ్బంది పెడుతున్నారని తరచు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆరోపణలు.. ఊహగారాలు స్ప్రెడ్ అవుతూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎప్పటికప్పుడు హరీష్ రావు తన మనసులో మాటను బయటపెడుతూనే ఉన్నారు. తన పార్టీ అధినేత మాటను జవదాటే పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేస్తూనే ఉన్నారు. నాటి ఉద్యమ కాలం నుంచి ఇప్పటివరకు పార్టీకి ఎటువంటి కష్టం వచ్చినా సరే హరీష్ రావు ముందున్నారు. అయినప్పటికీ పార్టీలో ఆయనను తొక్కి వేయడానికి కుట్రలు జరుగుతూనే ఉన్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి.

కాలేశ్వరం మీద ఆయన ఒక్కడే

కేటీఆర్ ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు గాని.. కాలేశ్వరం మీద ఇప్పటికీ మీడియాలో మాట్లాడుతున్నది హరీష్ రావే. ప్రతి బ్యారేజ్.. గోదావరి నీటి ప్రవాహం.. ఇతర విషయాలను ఆయన లెక్కలతో సహా చెబుతూనే ఉన్నారు. కాలేశ్వరం ఎత్తిపోతల పథకం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం జరిగింది. భవిష్యత్తు కాలంలో ఎటువంటి ప్రయోజనం జరగబోతోంది అనే విషయాలను కూడా ఆయన క్లారిటీగా చెప్పేశారు.. అయినప్పటికీ భారత రాష్ట్ర సమితి ఆయనకు అంతగా సపోర్ట్ ఇవ్వడం లేదని ఆయన వర్గీయులు అంటున్నారు. ఇటీవల హరీష్ రావు పాదయాత్ర చేస్తే పార్టీకి సంబంధించిన సొంత మీడియా ఛానల్.. సొంత పేపర్లో అంతగా ప్రాచుర్యం లభించలేదు.. భారత రాష్ట్ర సమితిలో చాలామంది సోషల్ మీడియాలోనే పాపులర్. కానీ హరీష్ రావు మాస్ లీడర్.. నేరుగా రోడ్డు మీదకెక్కి ప్రజల సమస్యలను తెలుసుకొని.. ప్రజలతోనే మమేకమయ్యే నాయకుడు అతను. ప్రస్తుత కాంగ్రెస్ పార్టీని.. రేవంత్ రెడ్డిని నిత్యం నిలదీస్తున్న హరీష్ రావు.. వచ్చే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అధికారాన్ని దక్కించుకుంటుందనే భరోసాను కల్పించగలుగుతున్నారు.

కట్టడి వెనుక కుట్ర

హరీష్ రావును గొప్ప నాయకుడిగా ఎదగనీయకుండా చేయడానికి పార్టీలోనే అంతర్గతంగా కుట్రలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. దాని వెనుక వారసత్వ రాజకీయ కారణాలు ప్రధాన కారణంగా ఉన్నాయని ప్రచారంలో ఉంది. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ కొనసాగుతున్న నేపథ్యంలో.. హరీష్ రావు మాస్ ఇమేజ్ ఆయనకు డ్యామేజ్ చేస్తుందని పార్టీ అధినాయకత్వం భయపడుతోందనే టాక్ కూడా ఉంది. ఇప్పుడు ఇక అధికారంలో లేకపోయినప్పటికీ.. హరీష్ రావు సేవలను పార్టీ అంతగా ఉపయోగించుకోవడం లేదు అనే విమర్శ కూడా ఉంది. ఇటీవల సరూర్నగర్ ప్రాంతంలో నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాలని భారత రాష్ట్ర సమితి ఆందోళన చేసింది. అయితే దానికి హరీష్ రావును పిలవకపోవడం విశేషం. ఇటువంటివే జనాల్లోకి బలంగా వెళ్తాయి. కేటీఆర్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ.. ఇటువంటి వాటి వల్ల జరగాల్సిన నష్టం జరిగిపోతూనే ఉంటుంది. ఇప్పటికైనా హరీష్ రావు విషయంలో భారత రాష్ట్ర సమితి అధినాయకత్వం ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ వల్ల భవిష్యత్తు కాలంలో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

INS Mahendragiri

INS Malvan : సైన్యం చేతికి మరో యుద్ధ నౌక… శత్రు సబ్‌మెరైన్లకు ఇక చుక్కలే!

INS Malvan భారత సైన్యం చేతికి మరో యుద్ధ నౌక చేరింది. ఇటీవలే విశాపట్నంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ ఒక నౌకను నేవీకి అప్పగించారు. తాజాగా భారత నేవీ తన సబ్‌మెరైన్‌ వ్యతిరేక...

Telangana ACB : కిలోల కొద్ది బంగారం.. అంతకుమించి నోట్ల కట్టలు.. ఈ అధికారి అవినీతిలో అనకొండ

Telangana ACB : రెండు కిలోల బంగారం.. 52 లక్షల నగదు.. మూడు కార్లు.. 30 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు.. 20 అత్యంత ఖరీదైన విదేశీ మద్యం సీసాలు.. అంతేకాదు ఆయన...
The Odyssey 3 Day Collections

The Odyssey : ‘ది ఒడిస్సీ’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద...

The Odyssey : క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన లేటెస్ట్ ఎపిక్ బ్లాక్ బస్టర్ 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఓవర్సీస్ మార్కెట్స్ లోనే కాదు , ఈ...
Akhil Akkineni

Akhil Akkineni : ‘లెనిన్’ 12 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. ‘మా ఇంటి బంగారం’ ని అందుకోవడం...

Akhil Akkineni : అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ చిత్రం 'లెనిన్' బాక్స్ ఆఫీస్ వద్ద విజయవంతంగా 12 రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకుంది. మొదటి మూడ్ రోజుల్లోనే బ్రేక్...

Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడిన అషు రెడ్డి.. వీడియో వైరల్

Sudigali Sudheer : బుల్లితెర పై ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హవా ఎవ్వరూ ఊహించని రేంజ్ లో కొనసాగుతోంది. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా అనేక ఎంటర్టైన్మెంట్ షోస్ తో ప్రేక్షకులను అలరించిన...
Oktelugu Epaper