IPL 2022: క్రికెట్ అంటేనే విజయాలు, అపజయాల పరంపరలో కొనసాగుతుంది. అయితే ఓ మ్యాచ్ గెలవొచ్చు, ఇంకో మ్యాచ్ ఓడిపోవచ్చు. అయినంత మాత్రానా ఎవరూ తక్కువ కాదు కదా. ఎవరి సత్తా ఏంటో టైమ్ వచ్చినప్పుడు బయటపడుతుంది. కానీ ఈ విషయాన్ని క్రికెట్ అభిమానులు మాత్రం ఒప్పుకోరు. వరుసగా రెండు మూడు మ్యాచ్‌లు ఓడిపోతే మాత్రం దారుణంగా ట్రోల్ చేస్తారు.

అదే రెండు మ్యాచ్ లలో గెలిస్తే నెత్తిన పెట్టుకుంటారు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్‌లో ఇలాంటి పరిణామాలే కనిపిస్తున్నాయి. ఈసారి బలమైన జట్లు దారుణంగా ఓడిపోతున్నాయి. మొన్నటి వరకు సన్ రైజర్స్ కూడా వరుసగా ఓటములను చవి చూసింది. కానీ అనూహ్యంగా శనివారం చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించి బోణీ కొట్టింది. ఇక సోమవారం అగ్ర స్థానంలో ఉన్న గుజరాత్‌ను మట్టి కరిపించి సత్తా చూపించింది.
Also Read: Minister Ambati Rambabu: వైరల్ : మంత్రి అంబటి రాంబాబు ఫొటోలు లీక్
దీంతో క్రికెట్ ఫ్యాన్స్ మీమ్స్ తో చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం వరుస ఓటములను చూస్తున్న ముంబై, చెన్నై టీమ్‌లపై ఎస్ ఆర్ హెచ్ టీమ్ ద్వారా పంచ్‌లు వేయిస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన జాతిరత్నాలు మూవీలో లోని పంచ్ డైలాగ్‌ను వాడేస్తున్నారు. ఈ మూవీలో నవీన్ తన ఫ్రెండ్స్ తో ఇక మీకు సీరియస్ నెస్ రాదారా లైఫ్ లో అని చెప్పే డైలాగ్‌ను సన్ రైజర్స్ జట్టుతో ముంబై, చెన్నైలకు చెబుతున్నట్టు మీమ్స్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ఇది ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఇక రెండు మ్యాచ్ లలో దుమ్ము లేపిన కేన్ విలియమ్సన్.. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో అతన్ని ఎన్టీఆర్ టెంపర్ మూవీలోని దండయాత్ర అనే డైలాగ్‌ను మీమ్ గా క్రియేట్ చేశారు. ఎన్టీఆర్ బాడీకి విలియమ్సన్ ఫేస్‌ను మార్ఫింగ్ చేసి… దండయాత్ర ఇది కేన్ దండయాత్ర అని మీమ్‌ను క్రియేట్ చేశారు. ఇక రంగస్థలంలోని రామ్ చరణ్ డైలాగ్ అయిన. ఇదయ్యా మీ అసలు రూపం అంటూ కేన్‌ను కొనియాడుతున్నారు. ప్రస్తుతం సన్ రైజర్స్ ను ఎవరూ తిట్టొద్దు అంటూ చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు వరుసగా గెలుస్తోందని కాబట్టి.. సపోర్టు చేయాలంటూ హ్యాష్ ట్యాగ్స్ ను క్రియేట్ చేస్తున్నారు.

Also Read:Roja: రోజా లేని ‘జబర్దస్త్’ లో చెలగిరేపోనున్న కామెడీయన్..!