Janasena Party: ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ పుట్టినరోజు సందర్భంగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది జనసేన. పిఠాపురం నియోజకవర్గంలో పార్టీ యువజన విభాగం పేరును ‘జై కొట్టు’ గా నామకరణం చేసింది. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ నూతన విభాగం ‘జై కొట్టు’ను ఆవిష్కరించారు. జై కొట్టు పేరుతో ప్రత్యేకంగా ఒక పాటను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాను ఈ పాట షేక్ చేస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకాయి.
* కేరళలో పవన్…
పవన్ కళ్యాణ్ గత కొద్దిరోజులుగా కేరళలో ఉంటున్న సంగతి తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన అక్కడ ప్రకృతి వైద్యశాలలో వైద్య సేవలు పొందుతున్నారు. అందుకే తన జన్మదిన వేడుకలకు హాజరు కాలేకపోయారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా పవన్ జన్మదిన వేడుకలు అంబరాన్ని తాకుతున్నాయి. ఎక్కడికక్కడే బైక్ ర్యాలీలు చేపడుతున్నారు.. ఆలయాల్లో పూజలతో పాటు సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. జనసేనకు ముఖ్యంగా యువత బలం అధికం. అందుకే ఆ పార్టీ యువజన విభాగానికి ప్రత్యేక నామకరణం చేయాలని భావించారు. అందుకు పవన్ పుట్టినరోజు వేడుకలను వేదికగా చేసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ జన్మదిన వేడుకల్లో పార్టీ యువజన విభాగానికి జై కొట్టు అనే ప్రత్యేక పేరును పెట్టారు.
* ప్రత్యేక పాట సైతం..
మరోవైపు ఈ జై కొట్టు అనే నినాదానికి.. ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ పాత తోడైంది.’ జై కొట్టు’ పేరుతో ప్రత్యేకంగా పాటను కూడా విడుదల చేశారు. ఈ పాటకు ధమన్ మ్యూజిక్ అందించారు.. అయితే ఇంత పెద్ద కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోయారు. అందుకే ఆయన ఆడియో మెసేజ్ పంపించారు. చెయ్యెత్తి జై కొట్టు నినాదం అందర్నీ ఆకట్టుకుంటుందని మనోహర్ అభిప్రాయపడ్డారు. ఆ స్ఫూర్తిని అందించాలనే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ లోగోను తీసుకొచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. జై కొట్టు నినాదంతో యువత ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయాల్లో యువతకు ప్రత్యేక స్థానం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అరుపులు, కేకలు మాత్రమే కాదు. క్రమశిక్షణ కూడా ఎంతో ముఖ్యమని చెప్పారు.