Marriage Issues: ఒక మనిషి పుట్టుక వెనక ఏదో కారణం ఉంటుంది. అలాగే చావు వెనక కూడా అలాంటి అంతరార్థమే ఉంటుంది. అందుకే సృష్టిలో ఏ జీవి జనన మరణమైనా ఒక చరిత్ర లాగా ఉంటుంది. ముఖ్యంగా మనిషి జనన మరణానికి సంబంధించి చరిత్ర ఉంటుంది. మనం తరచూ చెప్పుకునే దేవతల కాలం నుంచి మొదలు పెడితే నేటి నవీన యుగం వరకు జనన మరణాల విషయంలో ఊహించని చరిత్ర ఉంది.. ఈ చరిత్రను కేవలం రెండే రెండు ముక్కల్లో ఒక బాలుడు చెప్పేశాడు. ఆ వీడియో ట్విట్టర్లో సంచలనం సృష్టిస్తోంది.
Also Read: మహేష్ బాబు – రాజమౌళి సినిమా మూడో షెడ్యూల్లో పాల్గొంటున్న పాన్ ఇండియా స్టార్స్ వీళ్ళే…
కంసుడిని కృష్ణుడు చంపేశాడు. కంసుడిలో మొదటి అక్షరం “క”, కృష్ణుడిలో మొదటి అక్షరం కూడా “క” కావడం గమనార్హం. రాముడు రావణాసురుడిని చంపేశాడు.. రాముడిలో మొదటి అక్షరం “రా”, రావణాసురుడిలో మొదటి అక్షరం కూడా “రా” కావడం విశేషం. గాంధీని చంపేసింది గాడ్సే. గాంధీలో మొదటి అక్షరం “గా”, గాడ్సేలో మొదటి అక్షరం కూడా “గా” కావడం గమనార్హం. ఒసామా అనే ఉగ్రవాదిని చంపేసింది అమెరికా అధ్యక్షుడు ఒబామా. ఇందులోనూ “ఒ” అక్షరం సరిపోలడం విశేషం.. ఇక ఇప్పుడు భార్యా భర్తలను పరిగణలోకి తీసుకుంటే “భ” అనే అక్షరమే మొదట వస్తుంది. దీని ప్రకారం ఏం జరుగుతుందో ఊహించుకోండి.. కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ ఓ బాలుడు ఆ వివరాలను, గతంలో జరిగిన సంఘటనలను ఉదహరిస్తూ మొత్తం చెప్పాడు.
ఇటీవల కాలంలో భార్యల చేతిలో భర్తలు చనిపోతున్నారు.. ఒకరకంగా భర్తలు సమిదలుగా మారిపోతున్నారు. గతంలో గృహహింసకేసుల్లో ఎక్కువ మంది భార్యలే బాధిత పక్షంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తలు ఆక్రమిస్తున్నారు. అంతకుముందు బెంగళూరు ఐటి ఉద్యోగి కేసు, మేఘాలయ హనీమూన్ కేసు, గద్వాల తేజేశ్వర్ కేసు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిలోనూ భర్తలే కన్నుమూశారు. భార్యలు స్కెచ్ వేయడం.. వారి ప్రియులు అమలు చేయడం.. అంతిమంగా భర్తలు చనిపోవడం వంటి సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా చోటుచేసుకున్నాయి. పరిస్థితిని ఇలా ఉదహరిస్తూనే.. ఆ బాలుడు పురాణాల నుంచి నేటి కాలంలో జరుగుతున్న సంఘటనల వరకు చెప్పడం విశేషం. అతడు చెప్పిన దాంట్లో కాస్త నాటకీయత ఉన్నప్పటికీ.. వాస్తవ పరిస్థితి మాత్రం అలానే ఉంది. అందువల్ల భర్తలు జాగ్రత్త.. ముఖ్యంగా అనవసరమైన వివాదాల జోలికి భర్తలు పోకూడదు. అనవసరమైన విషయాలలో వేలు పెట్టకూడదు. ఇక నూతనంగా వివాహం చేసుకున్నవారు అన్ని విషయాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలి. కాబోయే భార్యతో మాట్లాడాలి. గతంలో మాదిరిగా ఉంటామంటే ఇప్పుడు కుదరదు. కచ్చితంగా ప్రేమ వ్యవహారాలు ఏమైనా ఉన్నాయా? పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా? పెద్దలు బలవంత పెడుతున్నారా? అనే కోణాలలో కచ్చితంగా ప్రశ్నలు వేయాల్సిందే. అవసరమైతే ఎంక్వయిరీ చేయాల్సిందే. అప్పుడే సంసారం బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా భూమ్మీద ప్రాణం నిలబడుతుంది.
Intha pedda theory undha indhulo.. pic.twitter.com/IubxEoefb3
— Sᴜʀʏᴀ.. (@Wolverine9121) June 25, 2025