Homeజాతీయ వార్తలుViral Marriage Conditions : ఆ యువతికి అలాంటి భర్తనే కావాలట.. ఏసేసుకుంటున్నారు

Viral Marriage Conditions : ఆ యువతికి అలాంటి భర్తనే కావాలట.. ఏసేసుకుంటున్నారు

Viral Marriage Conditions : పెళ్లి.. నేటి కాలంలో ఈ తంతు జరుగుతున్న తీరు రకరకాలుగా ఉంటున్నది. కొందరేమో పెళ్లిని అత్యంత ఆడంబరంగా జరుపుకుంటే.. మరికొందరేమ ఎందుకొచ్చిన దరిద్రం అంటూ పక్కన పెడుతున్నారు. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలామందికి వివాహాలు కూడా కావడం లేదు. కన్యాదానం కాస్త కన్యాశుల్కంగా మారినప్పటికీ చాలామందికి పెళ్లి యోగం కలగడం లేదు. కొందరైతే పెళ్లి చేసుకోవడం మాత్రమే జీవిత లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిల ముందు ఎన్ని మెట్లైనా సరే […]

Viral Marriage Conditions : పెళ్లి.. నేటి కాలంలో ఈ తంతు జరుగుతున్న తీరు రకరకాలుగా ఉంటున్నది. కొందరేమో పెళ్లిని అత్యంత ఆడంబరంగా జరుపుకుంటే.. మరికొందరేమ ఎందుకొచ్చిన దరిద్రం అంటూ పక్కన పెడుతున్నారు. అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉండడంతో చాలామందికి వివాహాలు కూడా కావడం లేదు. కన్యాదానం కాస్త కన్యాశుల్కంగా మారినప్పటికీ చాలామందికి పెళ్లి యోగం కలగడం లేదు. కొందరైతే పెళ్లి చేసుకోవడం మాత్రమే జీవిత లక్ష్యం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. అమ్మాయిల ముందు ఎన్ని మెట్లైనా సరే కిందికి దిగుతున్నారు. ఇదే అదునుగా అమ్మాయిలు రెచ్చిపోతున్నారు. సరికొత్త కోరికలు కోరుతూ ట్రెండ్ సెట్టర్ గా నిలుస్తున్నారు. ఓ అమ్మాయి కూడా వింత కోరికలు కోరి అలానే నిలిచింది.

ఆ అమ్మాయి ఉన్నత విద్యావంతురాలు. ఒక సంస్థలో పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి వయసు వచ్చింది.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో తనకు కావలసిన క్వాలిటీస్ ఏంటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అది కాస్త విపరీతంగా వైరల్ గా మారింది. ఆమె కోరిన కోరికలు.. కావలసిన క్వాలిటీస్ సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు కారణం అవుతున్నాయి.

ఆ అమ్మాయికి నెలకు రెండు లక్షల రూపాయలకు పైగా వేతనం వచ్చే అబ్బాయి కావాలట. అతడు ఎత్తు 6 ఫీట్ల వరకు ఉండాలట. అందంగా ఉండాలట. కచ్చితంగా వంట వచ్చి ఉండాలట. అందరికీ స్నేహితురాళ్ళు ఉండకూడదట. 24 గంటల పాటు అతడు తన లైవ్ లొకేషన్ పంచుకోవాలట. అంతేకాదు ఆమెను ఫారిన్ ట్రిప్స్ తీసుకెళ్తూ ఉండాలట.

ఆమె విధించిన షరతులు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. మరికొందరేమో భర్త కావాలా.. లేదా జీవితాంతం భరించే సర్వెంట్ కావాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు..”ఇన్ని కండిషన్లకు ఓకే చెప్పి పెళ్లి చేసుకోవాలంటే మామూలు విషయం కాదు. అతడు ఆగర్భ శ్రీమంతుడు అయి ఉండాలి. ఓపిక సహనంలో భూదేవిని మించిపోవాలి. ఏం చేసినా మూసుకొని కూర్చోవాలి. ఇదంతా జరగాలంటే అతడు ఉప్పు కారం మానేయాలని” నెటిజన్లు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల కాలంలో పెళ్లి వయసుకు వచ్చిన అమ్మాయిలు తమకు సంబంధించిన జీవిత భాగస్వాముల విషయంలో క్లారిటీగా ఉన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా కండిషన్లు పెడుతున్నారు. తాము పెళ్లి చేసుకునే వారి విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. పైగా ఇండిపెండెంట్ లైఫ్ ను ఎక్కువగా కోరుకుంటున్నారు. అందువల్లే చాలామంది అబ్బాయిలు వివాహాలు చేసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. జీవితాంతం ఒంటరిగా ఉన్న పర్వాలేదు గానీ.. ఇలా ఇబ్బంది పడుతూ జీవించడం సాధ్యం కాదని మొహమాటం లేకుండా చెప్పేస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper