Rashmika next movie update: వరుస విజయాలతో కెరీర్ లో ఎవ్వరూ చూదంతా పీక్ ఫేస్ ని ఎంజాయ్ చేస్తున్న హీరోయిన్ రష్మిక(Rashmika Mandanna). రీసెంట్ గా వరుసగా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తో వేల కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి సరికొత్త రికార్డుని సృష్టించిన ఈమె, రీసెంట్ గానే ‘కుబేర'(Kuberaa Movie) చిత్రం తో మరో భారీ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే కేవలం రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ మాత్రమే కాకుండా ఈమధ్య కాలం లో ఈమె లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేయడానికి కూడా సిద్ధమైంది. రాహుల్ రవిచంద్రన్ దర్శకత్వం లో ఇప్పటికే ఈమె ‘గర్ల్ ఫ్రెండ్’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాని చేస్తుంది. ఇప్పుడు ఈమె మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసేందుకు సిద్ధమైంది. కాసేపటి క్రితమే తన సోషల్ మీడియా అకౌంట్స్ లో తనకు సమందించిన ఒక పోస్టర్ ని విడుదల చేసింది.
ఈ పోస్టర్ మీద ‘హాంటెడ్..ఊండెడ్..అన్ బ్రోకెన్’ అనే క్యాప్షన్స్ పెట్టింది. అంటే దీని అర్థం ఏమిటంటే ‘వేటాడింది..గాయపడింది..కానీ కృంగిపోలేదు’ అని అన్నమాట. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరు?, సంగీత దర్శకుడు ఎవరు? వంటివి ఏమి చెప్పలేదు. కేవలం ఈ చిత్రాన్ని ‘అన్ ఫార్ములా ఫిలిమ్స్’ అనే సంస్థ నిర్మిస్తుంది అని మాత్రమే తెలుసు. అయితే ఈ సినిమా టైటిల్ ఏంటో మీరే కనిపెట్టండి. ఒకవేళ కనిపెడితే కచ్చితంగా నేను మిమ్మల్ని కలుస్తాను అంటూ చెప్పుకొచ్చింది రష్మిక. అంత పెద్ద పాన్ ఇండియన్ స్టార్ హీరోయిన్ ని కలిసే అదృష్టం వస్తే ఎవరు మాత్రం వదులుకుంటారు చెప్పండి. ఆమె టైటిల్ ని ఊహించండి అని చెప్పగానే వందల సంఖ్యలో కామెంట్స్ రావడం మొదలు పెట్టాయి. ఒక్కొక్కరు ఒక్కో టైటిల్ చెప్పుకొచ్చారు. వారిలో కరెక్ట్ టైటిల్ ని ఊహించిన వారికి రష్మిక ని కలిసే అవకాశం దక్కుతుంది.
Can you guess what the title of my next could be?
I don’t think anyone can actually guess.. but if at all you can guess it then i promise to come meet you.. pic.twitter.com/7KPl6UyVJN— Rashmika Mandanna (@iamRashmika) June 26, 2025
బ్యాక్ డ్రాప్ చూస్తుంటే ఈ చిత్రం అడవి నేపథ్యంలో సాగే సినిమాలాగా అనిపిస్తుంది. రష్మిక ముఖాన్ని పూర్తిగా చూపించలేదు కానీ, మంచు బ్యాక్ గ్రౌండ్ లో కనిపిస్తుంది. ఎదో డిఫరెంట్ నేపథ్యం లో సాగే సినిమాలాగే అనిపిస్తుంది. ఇందులో రష్మిక రోల్ ఏమిటి అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలై కొన్ని రోజులు అయ్యిందట. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ జానర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పటి వరకు కేవలం అనుష్క మీదనే ఇలాంటి సినిమాలు తీశారు మేకర్స్. ఇప్పుడు రష్మిక కూడా ఆ లిస్ట్ లోకి చేరింది. చూడాలి మరి ఈమె ఎంత వరకు సక్సెస్ అవుతుంది అనేది. ఇకపోతే ప్రస్తుతం రష్మిక కుబేర మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం వంద కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని దాటింది. రాబోయే రోజుల్లో ఇంకెన్ని బెంచ్ మార్క్స్ ని అందుకుంటుందో చూడాలి.