Marriage Age: ప్రతి ఒకరికి ఒకే జీవితం ఉంటుందని అనుకుంటారు. కానీ పెళ్లికి ముందు ఒక జీవితం.. పెళ్లి తర్వాత మరో జీవితం ఉంటుంది. పెళ్లికి ముందు అమ్మా నాన్నలపై ఆధారపడుతూ.. చిలిపి చేష్టలు చేస్తూ.. అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు. కానీ పెళ్లి అయిన తర్వాత ఒక బాధ్యతగా వ్యవహరిస్తూ.. ఒక కుటుంబానికి పెద్దగా ఉంటారు. అయితే పెళ్లి అయిన తర్వాత ఆ వ్యక్తికి అసలైన జీవితం ప్రారంభమవుతుంది. ఈ సమయంలోనే బరువు బాధ్యతలు ఉంటాయి. సమాజంలో గుర్తింపు వచ్చే సమయం కూడా ఇదే. అంతేకాకుండా ఈ సమయంలోనే పిల్లలతో సరదాగా ఉంటారు. అయితే ఈ జీవితం ఉండడానికి ఎలాంటి వయసులో పెళ్లి చేసుకోవాలి? ఏ వయసులో పెళ్లి చేసుకుంటే పిల్లలతో సంతోషంగా ఉండగలుగుతారు?
Also Read: ‘బిగ్ బాస్ 9’ అగ్ని పరీక్ష ప్రోమో అదిరిపోయింది..ఊహించని ట్విస్టులు ఇచ్చారుగా!
భారత వివాహ చట్టం ప్రకారం ప్రతి అమ్మాయికి 18 ఏళ్లు.. అబ్బాయికి 21 ఏళ్ల వయసు రాగానే పెళ్లి చేసుకోవచ్చు. కానీ చాలామంది ఈ వయసులో కెరీర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. తమ జీవితం బాగుపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. అయితే కొందరు కెరీర్ గురించి ఆలోచిస్తూ పెళ్లి వయసును మర్చి పోతున్నారు. అలా 30 ఏళ్లు దాటిన తర్వాత జీవితంలో స్థిరపడి.. అప్పుడు పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారు. కానీ 30 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటే జరిగే పరిస్థితులు వేరేలా ఉంటాయి. అమ్మాయిలు, అబ్బాయిల ఆరోగ్య విషయంలో అనేక మార్పులు వస్తుంటాయి.
24 నుంచి 30 ఏళ్ల వరకు అమ్మాయిల్లో అండం ఉత్పత్తి కావడానికి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అని కొందరు ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 30 ఏళ్ల వయసు దాటిన తర్వాత వీరిలో ఈ విషయంలో మార్పులు వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక 35 నుంచి 40 ఏళ్ల వరకు వారిలో 70% ఉత్పత్తి తగ్గే అవకాశం ఉందని తెలుపుతున్నారు.
అయితే కొందరు మగవాళ్ళు తాము 60 ఏళ్ళు వచ్చిన ఫిట్గానే ఉంటామని పేర్కొంటారు. కానీ ఇప్పుడు ఉన్న వాతావరణం లో పురుషులు 40 ఏళ్లు దాటిన తర్వాత వారిలో స్పెర్ము కౌంట్ ఆటోమేటిగ్గా తగ్గిపోతూ ఉంటుంది. దీంతో వీరు పెళ్లి చేసుకున్న తర్వాత.. అనేక సమస్యలతో బాధపడాల్సి వస్తుంది.
ఇలా 30ఏళ్ళు దాటిన తర్వాత అమ్మాయిలు.. తర్వాత అబ్బాయిలు పెళ్లి చేసుకుంటే వారి మధ్య అన్యోన్యమైన జీవితం ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ఎందుకంటే అమ్మాయిల్లో 30 ఏళ్ల లోపు అండం, అబ్బాయిల్లో 4 ఏళ్లలో స్పెర్మ్ సమృద్ధిగా ఉంటేనే ఇద్దరి మధ్య ప్రేమ బంధాలు పెరిగిపోతాయి. వీరి మధ్య కలయిక కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో ఒకరి కోసం ఒకరు అన్నట్లు జీవిస్తారు. అంతేకాకుండా పిల్లలు కావాలని అనుకునే వారికి కూడా ఇదే మంచి సమయం. అందువల్ల ఒకవైపు కెరియర్ గురించి ఆలోచిస్తూనే.. మరోవైపు వివాహం గురించి కూడా ప్రణాళిక వేసుకోవాలని కొందరు మానసిక నిపుణులు తెలుపుతున్నారు.