YCP Social Media: పవన్ కళ్యాణ్( Pawan Kalyan) సతీమణి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఫుల్ సైలెంట్ అయింది. ఆమె అన్యమతస్తురాలు. క్రిస్టియన్ మతానికి చెందిన ఆమె తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్నారని తెలిసి తెగ హడావిడి నడిచింది. ఆమె డిక్లరేషన్ తో పాటు ఇతరత్రా విషయాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్. కానీ తిరుమలలో పవన్ సతీమణి అన్నా లెజినోవ వ్యవహరించిన తీరుతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. కనీస స్థాయిలో ఆ అంశాన్ని టచ్ చేయలేని విధంగా మొత్తం సీన్ మార్చేశారు ఆమె. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ సైలెన్స్ కావాల్సి వచ్చింది.
Also Read: దళిత యువకుడికి చంద్రబాబు షాక్.. అలా చేశారేంటి?
* మొక్కు తీర్చుకున్న అన్నా లెజినోవ
పవన్ కుమారుడు మార్క్ శంకర్( mark Shankar ) సింగపూర్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడిన మార్క్ శంకర్ ను తీసుకుని పవన్ దంపతులు ఇండియా వచ్చారు. అన్న లేజీనోవా ఈ ప్రమాదం తప్పడంతో నేరుగా తిరుమల వచ్చారు. మొక్కు తీర్చుకున్నారు. ఏకంగా తలనీలాలు సమర్పించారు. అంతకంటే ముందే టీటీడీ సిబ్బంది సమక్షంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. ఆమె అన్య మతస్తురాలు కావడంతో శ్రీవారి దర్శనానికి సంబంధించి డిక్లరేషన్ ఇచ్చారు. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం సతీమణి కావడంతో ఆమె డిక్లరేషన్ ఇస్తారా? లేదా? అని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎదురుచూసింది. డిక్లరేషన్ ఇచ్చేసరికి ఫుల్ సైలెంట్ అయింది.
* గతంలో వివాదాస్పదం..
గతంలో తిరుమల వేదికగా డిక్లరేషన్( declaration) ఇష్యూ ఏ స్థాయి ప్రభావం చూపిందో తెలియంది కాదు. ఏపీ సీఎం గా జగన్మోహన్ రెడ్డి ఉండేవారు. గత ఐదేళ్ల కాలంలో ఆయన డిక్లరేషన్ ఇచ్చిన సందర్భాలు లేవు. ఎందుకంటే ఆయన క్రిస్టియన్ మతానికి చెందినవారు. తప్పనిసరిగా అన్యమతస్తులు శ్రీవారి దర్శనానికి వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలి. మొన్నటికి మొన్న లడ్డు వివాదం సమయంలో డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి నిరసన తెలిపేందుకు తిరుమల వచ్చేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆ సమయంలో డిక్లరేషన్ ఇచ్చి తిరుమలలో అడుగు పెట్టాలన్న డిమాండ్ వినిపించింది. అయితే గత ఐదు సంవత్సరాలుగా ఇవ్వనిది.. ఇప్పుడు కొత్తగా ఇస్తే తప్పకుండా వివాదాస్పదం అవుతుందని భావించి జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గారు.
* ఏ అవకాశం ఇవ్వకుండా..
అయితే ఇప్పుడు పవన్ సతీమణి అన్నా లెజీనోవా( Anna Leji Nova) తిరుమల శ్రీవారి దర్శన నేపథ్యంలో.. మరోసారి వివాదం చేయాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా భావించింది. కానీ అందుకు అన్నాలిజి నోవా అవకాశం ఇవ్వలేదు. టీటీడీ సిబ్బంది సమక్షంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. ఆపై తిరుమలలో ఒక పూట భక్తుల అన్నదానానికి సంబంధించి 17 లక్షల రూపాయల విరాళం అందించారు. సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. దీంతో విమర్శలు చేయడానికి వీలులేని విధంగా ఆమె తిరుమల పర్యటన సాగింది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వింగ్ సైలెన్స్ పాటించాల్సి వచ్చింది.
Also Read: మరో మూడు రోజులు వానలు.. ఏపీలో ఆ జిల్లాలకు అప్రమత్తం!