Rohith Sharma : భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohith Sharma), అతని భార్య రితికా సజ్దేహ్‌ల జీవితంలో కొత్త అతిథి వచ్చాడు. వారి కుమారుడు అహాన్. 2024 నవంబర్ 15న జన్మించిన ఈ చిన్నారి, రోహిత్ కుటుంబంలో సంతోషపు సునామీని తెచ్చాడు. ఈ సంతోషకరమైన వార్తను రోహిత్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) ద్వారా అభిమానులతో పంచుకున్నాడు, ఇది సోషల్ మీడియాలో(Social media)వైరల్‌గా మారింది. రోహిత్, రితికా, వారి కుమార్తె సమైరా, ఇప్పుడు అహాన్.. నలుగురి కుటుంబం అభిమానుల హదయాలను గెలుచుకుంటోంది.
Also Read : రోహిత్ శర్మ అంటే మినిమం ఉంటది.. వైరల్ వీడియో
2024 నవంబర్ 15 అనేది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుటుంబానికి మరపురాని రోజు. ఈ రోజున వారి రెండో సంతానం, కుమారుడు అహాన్(Ahan) జన్మించాడు. రోహిత్ ఈ వార్తను తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. రోహిత్ మరియు రితికా తమ వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచే స్వభావం కారణంగా, అహాన్ యొక్క ఫొటోలు లేదా అతని ఆరోగ్యం గురించి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. దీంతో రోహిత్ ఫ్యాన్స్ ఆహాన్ కోసం ఎదురు చూస్తున్నారు.
తొలిసారి ఫేజ్ రివీల్..
రోహిత్ శర్మ కొడుకు ఆహాన్ ఫొటో ఎట్టకేలకు బయటకు వచ్చింది. తల్లి రితిక(Rithika)ఎత్తుకుని ఎయిర్ పోర్టులో వెళ్తుండగా ఫోటో, వీడియో గ్రాఫర్లు చిత్రీకరించారు. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో ఇది వైరల్‌గా మారింది. ఆహాన్ ఫొటో చూసిన రోహిత్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. జూనియర్ రోహిత్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఆహాన్ ఫేస్ అచ్చం రోహిత్ లాగానే గుండ్రటి ఫేస్, బుగ్గలు, కళ్లు ఉన్నాయని కొందరు పేర్కొంటున్నారు.
రోహిత్–రితికా.. ఒక అద్భుత కుటుంబం
రోహిత్ శర్మ–రితికా సజ్దేహ్ 2015లో వివాహం చేసుకున్నారు. వారి మొదటి సంతానం, కుమార్తె సమైరా, 2018లో జన్మించింది. సమైరా(Samaira)తో రోహిత్ గడిపే క్షణాలు ఆమెతో ఆడుకోవడం, బీచ్‌లో సమయం గడపడం తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. ఇప్పుడు అహాన్ రాకతో, ఈ కుటుంబం మరింత పూర్తయినట్లు కనిపిస్తోంది. రోహిత్ ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, రితికా ఒక సపోర్టివ్ భార్యగా వారి బంధం అభిమానులకు స్ఫూర్తినిస్తుంది. సమైరా ఇప్పటికే తన తండ్రి లాంటి ఉత్సాహంతో అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అహాన్ కూడా భవిష్యత్తులో ఇలాంటి ఆకర్షణను సొంతం చేసుకుంటాడని అభిమానులు ఆశిస్తున్నారు. రోహిత్ తన బిజీ క్రికెట్ షెడ్యూల్‌లో కూడా కుటుంబానికి సమయం కేటాయించడం అతని వ్యక్తిత్వంలోని మరో ముఖ్యమైన కోణం.
క్రికెట్ లెజెండ్, ఫ్యామిలీ మ్యాన్
రోహిత్ శర్మ కేవలం క్రికెట్ మైదానంలోనే కాదు, కుటుంబ జీవితంలో కూడా ఒక లెజెండ్. అతను రెండు వన్డే వరల్డ్ కప్‌లు, ఒక ఖీ20 వరల్డ్ కప్, ఐదు ఐ్కఔ టైటిల్స్, ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఆటగాడు అయినప్పటికీ, కుటుంబంతో గడిపే సమయాన్ని ఎప్పుడూ విలువైనదిగా భావిస్తాడు. అహాన్ రాకతో, రోహిత్ జీవితంలో కొత్త బాధ్యతలు జోడయ్యాయి. అతను ఈ కొత్త పాత్రను కూడా అద్భుతంగా నిర్వహిస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
Also Read : హార్దిక్ కన్నుకొట్టాడు.. రోహిత్ చిరునవ్వు నవ్వాడు.. వైరల్ వీడియో